Brahmamudi Serial Today Episode: పెళ్లి చూపులకు వెళ్తున్న సాఫ్ట్ వేర్ సావిత్రి తన దరిద్రమైన స్టోరీ చెప్తుంటే రాజ్ ఇంగ్లీష్‌లో మాట్లాడతాడు. దీంతో రాజ్‌ను డ్రైవర్ వి డ్రైవర్ లాగ ఉండుం అంటూ సావిత్రి హెచ్చరించడంతో కావ్య ముసిముసిగా నవ్వుకుంటుంది. మీతో కాదు మేడంతో మాట్లాడతాను అంటూ వెనక్కి తిరిగి మీ పేరేంటి మేడం అని అడుగుతాడు. కావ్య అని చెప్పగానే.. ఆహా ఎంత కమ్మగా ఉంది మీ పేరు అంటూ పొగుడుతుంటే ఒక మెసేజ్ వస్తుంది. అది చూసిన సావిత్రి మేడం మీరు ఎంత లక్కీ మీతో ఇలా మాట కలిపానో లేదో నాకు అలా హోమ్ లోన్ వచ్చింది అంటూ ఏయ్ డ్రైవర్ కొంచెం కారు ఆపు అంటూ రాజ్ కారు ఆపగానే దిగి వెళ్లి వెనక కావ్య పక్కన కూర్చుంటాడు. హాస్పిటల్‌లో సీతారామయ్య పక్కన కూర్చున్న కళ్యాణ్‌కు బయట గోలగోలగా వినిపిస్తుంటే బయటకు వెళ్తాడు.
కళ్యాణ్: హలో ఇది హాస్పిటల్ దయచేసి మెల్లగా మాట్లాడండి.
వ్యక్తి: సారీ సార్..
అని చెప్పి వెళ్తిపోతాడు. దూరంగా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్‌ను చూసి కళ్యాణ్ ప్లాష్ బ్యాక్‌లోకి వెళ్తాడు.
అప్పు: రిటర్న్ టెస్ట్ రాశాను. రిజల్ట్ వస్తుంది. తర్వాత ఆరు నెలల ట్రైనింగ్‌కు వెళ్తాను. తర్వాత ఎస్సై అయిపోతాను.
కళ్యాణ్: ఇంకేముంది వారం రోజులు లీవ్ పెట్టేసి హనీమూన్‌కు ఏ ఊటీకో.. కొడైకెనాల్ కో వెళ్లిపోవాల్సిందే
అప్పు: అబ్బా బలే కలలు కంటున్నావురా బై నువ్వు
కళ్యాణ్: రేపు పిల్లలను కనాలంటే ఇలాంటి కలలు కనాలి కదా
అప్పు: కనాలి కానీ నువ్వు కూడా మంచి లిరిక్ రైటర్ అవ్వాలి. మన ఫ్యామిలీ మనల్ని గర్వంగా ఇంటికి పిలవాలి. ఇంకా ముఖ్యంగా కొంత మందికి గుణపాఠం నేర్పాలి. అప్పుడు నువ్వు ఎక్కడకు అంటే అక్కడకు వెళ్దాం
కళ్యాణ్: అయితే సరే నువ్వు ఎలాగూ పోలీస్ అవుతావు కానీ ముందే నిన్ను పోలీస్ డ్రెస్ లో చూడాలని ఉంది. ఇప్పుడు డ్రెస్ వేసుకోవా ఫ్లీజ్
అప్పు: అయితే సరే ఒక్క నిమిషం నువ్వు బయటకు వెళితే నేను డ్రెస్ వేసుకుంటాను
కళ్యాణ్ బయటకు వెళ్లి వెయిట్ చేస్తుంటే అప్పు పోలీస్ డ్రెస్ లో వస్తుంది. ఆ డ్రెస్‌లో అప్పును చూసిన కళ్యాణ్ షాక్ అవుతాడు. ప్రేమగా హగ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ అప్పు వద్దని వారిస్తుంది. పోలీసులను ఎవ్వరూ హగ్ చేసుకోకూడదు అంటూ అప్పు నవ్వుతున్న విషయం కళ్యాణ్ గుర్తు చేసుకుని తాను హ్యాపీగా నవ్వుకుంటూ ఐసీయూలోకి వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య, రాజ్, సావిత్రి కారులో వెళ్తుంటారు.
కావ్య: నాకు ఇప్పుడు కొబ్బరిబొండం తాగాలని ఉంది.
సావిత్రి: మీరు అలా నోరు తెరచి అడిగితే ఎంత పాపిస్టోడైనా సరే మొదనష్టపోడైనా సరే కొని పెట్టకుండా ఉంటాడా..? ఓయ్ డ్రైవర్ ముందు కారు ఆపు
రాజ్ సడెన్ బ్రేక్ వేస్తాడు. సావిత్రి ముందు సీటుకు వచ్చి కొట్టుకుంటాడు.
రాజ్: అదేంటి దండం మీద దుప్పటి ఆరేసినట్టు అలా పడ్డావు
సావిత్రి: నువ్వు బ్రేక్ వేసే పద్దతి అంత చెండాలంగా నికృష్టంగా ఉంది మరి.. మేడం మీరు అడిగిన కొబ్బరిబొండం ఈ పక్కనే ఉంది మీరు దిగండి మేడం.
అని డోర్ తీసి తన చేయి అందిస్తాడు సావిత్రి. కావ్య కూడా రాజ్‌ను చూస్తూ.. మీరు నన్ను ఆడుకుంటారు కదా.. ఇప్పుడు నేను ఆడుకుంటాను అని మనసులో అనుకుని సావిత్రి చేయి పట్టుకుని కారు దిగుతుంది. సావిత్రికి లాయర్ ఫోన్ చేసి మనం కోర్టులో కేసు గెలిచాం అని చెప్తాడు. సావిత్రి సంతోషంగా కావ్యను మీది నిజంగా గోల్డెన్ హ్యాండే మేడం అంటూ ఎన్నో ఏళ్లుగా మా తాతల ఆస్థి కోసం కోర్టులో పోరాడుతున్నా అది ఇప్పుడు నేనే గెలిచానట అంటాడు. తర్వాత కొబ్బరి బొండాలు తాగి వెళ్లిపోతూ.. కావ్యను పెళ్లి అయిందా అని అడుగుతాడు. కాలేదని కావ్య చెప్పగానే సావిత్రి కావ్యకు ప్రపోజ్ చేయాలనుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!