Brahmamudi Serial Today Episode: కంపెనీ విషయంలో ఒక సీక్రెట్‌ తెలిసింది మమ్మీ అంటూ రాహుల్‌ చెప్పగానే ఏంటని అడుగుతుంది రుద్రాణి. తాతయ్య హాస్పిటల్‌ బిల్లు కంపెనీ అకౌంట్‌ నుంచి కాకుండా క్యాష్‌ పే చేశారట.. అని రాహుల్‌ చెప్పగానే.. అయితే కావ్య, రాజ్‌ కలిసి ఏదో గూడు పుఠాణి చేస్తున్నారు అదేంటి తెలుసుకుంటే సరిపోతుంది కదా అంటుంది రుద్రాణి. అవును మమ్మీ అంటాడు రాహుల్‌. మరోవైపు కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరకు స్వప్న వెళ్తుంది.

Continues below advertisement


కావ్య: టీ కావాలా.. అక్క..?


స్వప్న: కాదు సమాధానం కావాలి


కావ్య: దేనికి అక్కా..?


స్వప్న: నా సీమంతం విషయంలో ఎందుకు నువ్విలా చేస్తున్నావు


కావ్య: అది అమ్మ కదా చేసేది


స్వప్న: అమ్మకు ఆ ఐడియా ఇచ్చింది నువ్వేనని నాకు తెలుసు


కావ్య: అయితే నేను ఎందుకు ఇలా చేస్తున్నానో కూడా తెలుసుకోలేదా..?


స్వప్న: నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవాల్సింది ఏముంది. నీ చేతికి ఆస్తి వచ్చింది కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు


అంటూ ఏడుస్తూ స్వప్న వెళ్లిపోతుంది. అంతా వింటున్న అపర్ణను చూసి కావ్య షాక్‌ అవుతుంది. మీరు ఏదైనా అనాలంటే అనండి అంటుంది. నీ గురించి నాకు తెలుసు కానీ.. రేపు సీమంతానికి తీసుకెళ్లే వస్తువులు లిస్టు రాద్దాం ఫ్రీగా అయ్యాక రా అని చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు సీమంతానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం సీమంతం శ్రీనును పిలిపిస్తుంది కనకం. ఒక లిస్ట్‌ చెప్పి ఎంత అవుతుందని అడుగుతుంది. నలభై వేలు అవుతాయని శ్రీను చెప్పగానే.. తన బోడి ఐడియాలతో ఇరవై వేలకు తీసుకొస్తుంది. దీంతో సీమంతం శ్రీనే షాక్‌ అవుతాడు. ఇంకోవైపు బెడ్‌రూంలో కావ్య సర్దుతుంటే రాజ్‌ డోర్‌ దగ్గర నిలబడి చూస్తుంటాడు.


ఆత్మ: ఏరా ఇప్పుడు బాగుందా..?


రాజ్:చాలా బాగుందని


ఆత్మ: సిగ్గుందా నీకు సొంత పెళ్లాన్ని దొంగలా చూస్తావా? ఇప్పుడే మంచి చాన్స్‌ మెల్లగా వెళ్లి హత్తుకో వెళ్లు


రాజ్‌: సడెన్‌గా హత్తుకుంటే మొత్తుకుంటుందేమో..?


ఆత్మ: అలాంటిదేం జరగదు వెళ్లు


అని ఆత్మ బలవంతం చేయగానే రాజ్‌ మెల్లగా కావ్య దగ్గరకు వెళ్తాడు. కావ్య తిరిగి చూస్తూ పడబోతుంటే రాజ్‌ పట్టుకుంటాడు. ఆత్మ మాత్రం గట్టిగా కౌగిలించుకో అంటూ సైగ చేస్తుంది. ఎందుకు సైలెంట్‌గా వచ్చారని కావ్య అడిగితే.. నేనేమైనా మైక్‌ సెట్టునా సౌండ్‌ చేసుకుంటూ రావడానికి అంటాడు రాజ్‌. మరి ఎందుకు వచ్చారు అంటుంది కావ్య.. ఏం లేదని రాజ్‌ వెళ్లిపోతాడు. సీమంతం గురించి బాధపడుతున్న స్వప్న దగ్గరకు రుద్రాణి, రాహుల్‌ వెళ్తారు.



రుద్రాణి: ఏంటి స్వప్న రేపు సీమంతం పెట్టుకుని ఇంత డల్లుగా కూర్చున్నావు


రాహుల్‌: డల్లుగా కూర్చోక ఏం చేస్తుంది మామ్‌


రుద్రాణి: ఎంత బాధగా ఉన్నా గుండెల్లో దాచుకోవడం తప్పా మనం ఓపెన్‌ అయితే శత్రువుల్లా చూస్తారు కదా..?


స్వప్న: శత్రువుల్లా ప్రవర్తిస్తే శత్రువుల్లానే చూస్తారు.. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో చెప్పండి


రాహుల్‌: ఒకరి మీద కంఫ్లైంట్‌ చేయడం మాకేంటి స్వప్న.. నీ బాధను చూసి నిన్ను ఓదార్చడానికి వచ్చాము


స్వప్న: నాకెందుకో మీరు నన్ను రెచ్చగొట్టేందుకు వచ్చారు అనిపిస్తుంది


రుద్రాణి: సరే నీ ఇష్టం కానీ నీ సీమంతం ఖర్చు మిగిల్చాలని పుట్టింటికి తీసుకెళ్తుంది మీ చెల్లి.. రేపు నీకు బిడ్డ పుట్టబోయే ఖర్చు కూడా తగ్గించాలని గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్తుందేమో ఆలోచించుకో


అని రుద్రాణి చెప్పగానే స్వప్న ఆలోచిస్తుంది. మరోవైపు కనకం ఇంట్లో సీమంతం ఏర్పాట్లు జరగుతుంటాయి. ఇంతలో దుగ్గిరాల కుటుంబం కనకం ఇంటికి వస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!