Brahmamudi Serial Today Episode: కిడ్నాప్ అయిన పాపను సేవ్ చేసేందుకు అప్పు రంగంలోకి దిగుతుంది. డెలివరీ చేసే తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి వీడియోలో కనిపించిన స్కూల్ గురించి చెప్తుంది. వాళ్లు సరే చూస్తామని వెళ్తారు. దీంతో పాప వాళ్ల అమ్మకు ధైర్యం చెప్తుంది అప్పు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో కొరియర్ బాయ్ వచ్చి మేడం పార్శిల్ వచ్చింది అంటాడు. అందరూ ఏ మేడం కు అని అడుగుతారు. దీంతో కళ్యాణ్ నేను వెళ్లి చూస్తూను ఉండండి అని వెళ్లగానే కొరియర్ బాయ్ పార్శిల్స్ ఇస్తుంటాడు. చాలా పార్సిల్స్ రావడంతో అందరూ షాక్ అవుతారు. ఎవరికోసం వచ్చాయని ఆశ్యర్యంగా చూస్తుంటారు. ఇంతలో రాహుల్ వచ్చి పార్సిల్ మీద రుద్రాణి పేరు ఉండటం చూసి షాక్ అవుతాడు.
అపర్ణ: బాబు నువ్వు రాంగ్ అడ్రస్‌కు వచ్చావేమో ఒకసారి చెక్ చేసుకో...
ధాన్యలక్ష్మీ: ఎవరైనా కొత్త షాప్ ఓపెన్ చేస్తున్నారేమో..
లోపలి నుంచి స్వప్న వస్తుంది. షాక్ అవుతున్న రాహుల్‌ను చూసి
స్వప్న: అవాక్కయ్యావా?
రుద్రాణి: ఈ చెవాకులేంటి?
ఇందిరాదేవి: అవాకులు చెవాకుల తర్వాత ముందు ఎవరు అర్డర్ చేశారో చెప్పండ్రా?
అనగానే రుద్రాణి లేచి వెళ్లి ఎవర్రా చేసింది అనుకుంటూ పార్శిల్ తీసుకుని పేరు చూస్తుంది. దానిపై తనపేరు ఉండటంతో షాక్ అవుతుంది. నాపేరుతో వచ్చిన పార్శిల్ కు అమౌంట్ ఎవరు కట్టారు అంటూ నిలదీస్తుంది. అయితే బుక్ చేసింది నేనే బిల్ కట్టింది నీ క్రెడిట్ కార్డుతోనే అంటూ చెప్తుంది స్వప్న. కొన్నది మాత్రం నీకు కాదు నాకు కాదు నా చెల్లి కోసం అని స్వప్న చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఇంతలో పైనుంచి రాజ్ వచ్చి కావ్య కోసం అయితే నేను కొనేవాడిని కదా స్వప్నా అంటాడు. ఎవరో నా చెల్లిన్ని అప్పలమ్మలా ఉన్నావు అన్నారంట. నా చెల్లిని పట్టుకుని అంత మాట అన్నాక నేనెందుకు ఊరుకుంటాను.
రుద్రాణి: నువ్వెందుకు వదులుతావే 70వేలు ఎవరిస్తారు?
స్వప్న: నువ్వెందుకు గింజుకుంటున్నావు. అది కూడా ఇంటి డబ్బే కదా.. మీ అత్తగారి ఆస్థా నీ కొడుకు స్వార్జితమా?
అనగానే సుభాష్ నా కోడలును పట్టుకుని ఎవరు అంత మాట అన్నారు అని అడుగుతాడు. రాజ్‌కు బాగా తెలుసు అంకుల్ అంటుంది. దీంతో రాజ్ నాకు ఆఫీసుకు టైం అవుతుంది అంటూ వెళ్లిపోతాడు. రుద్రాణి మాత్రం తన డబ్బు పోయింది అంటూ బాధపడుతుంటే అపర్ణ నీ డబ్బు నేను ఇస్తానులే అని చెప్పగానే రుద్రాణి కూల్ అవుతుంది. మరోవైపు అప్పు తన ఫ్రెండ్స్ నుంచి ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతలో ఇద్దరు ఫ్రెండ్స్ కాల్ చేసి నువ్వు చెప్పిన స్కూల్ దగ్గరకు వచ్చామని అక్కడ పాత ఇల్లు లేదని చెప్తారు. మలక్‌పేట నుంచి ఫ్రెండ్ ఫోన్ చేసి ఇక్కడ ఆ ఇల్లు ఉందని ఎవరో రౌడిల్లా ఉన్నారని చెప్తాడు. దీంతో నువ్వు అక్కడే ఉండు అంటూ పాప వాళ్ల మథర్ ను తీసుకుని అక్కడకు వెళ్తుంది అప్పు. మరోవైపు స్వప్న, కావ్యను తయారు చేసుకుని తీసుకోస్తానని చెప్పి లోపలికి తీసుకెళ్లి రెండు గంటలైంది ఇంకా రాలేదేంటి అంటూ అందరూ ఎదురు చూస్తుంటారు. ఇంతలో స్వప్న బయటకు వస్తుంది. కావ్య కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ఇంతలో కావ్య సిగ్గుపడుతూ.. మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. అందరూ కావ్యను చూసి ఆశ్యర్యపోతారు.
స్వప్న: నచ్చేకళ్లు ఆశీర్వదిస్తాయి. నచ్చని కళ్లు దిష్టి పెడతాయి. ఎవరికి నచ్చలేదో ఇప్పుడు చెప్పండి.
రుద్రాణి: ఇప్పుడెవరైనా నచ్చలేదు అంటే దిష్టి కళ్లు అని కన్‌ఫం చేస్తావా?
స్వప్న: అంతే కదా.. ఏ మీకు నచ్చలేదా?
రుద్రాణి: నాకేందుకు నచ్చలేదు. నాకు బాగా నచ్చింది. నేను ఫ్యాషన్‌ను ఎంకరేజ్ చేస్తాను.
ధాన్యలక్ష్మీ: దిష్టి కళ్లు అనుకున్నా పర్వాలేదు. నాకు మాత్రం నచ్చలేదు. ఎంటి అక్కా నీ కోడలును నెత్తికి ఎక్కించుకున్నావు..
అనగానే అపర్ణ కావ్యను వెనకేసుకొస్తుంది. ఆఫీసుకు వెళ్లే వాళ్లు ఇలాగే ఉండాలని కావ్యను చాలా బాగా రెడీ చేశావని స్వప్నను మెచ్చుకుంటుంది. ఇంతలో కావ్య ఆఫీసకు వెళ్తుంటే ధాన్యలక్ష్మీ కోపంగా లోపలికి వెళ్తుంది. మరోవైపు అప్పు తన ప్రెండ్, కిడ్నాపైన పాప మథర్ తో కలిసి కిడ్నాపర్లు ఉన్న ఇంటి దగ్గరకు వస్తుంది. రిస్కు తీసుకుని పాపను సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: షాకింగ్.. ఆ హీరోకు తల్లిగా అనసూయ? ఏ సినిమాలో అంటే!