Brahmamudi Serial Today Episode: బయట పిచ్చి పిచ్చి యోగాసనాలు వేసి నడుం పట్టేయడంతో బెడ్‌రూంలోకి వెళ్లిన రాజ్‌. మంచం మీద ఆదోరకంగా పడుకుని ఉంటాడు. కావ్య వచ్చి ఏంటి ఇలా పడుకున్నారు. అందుకే చెప్పాను మీకు ఆసనాలు రావని చెప్తే మా బావ ఏమీ అనుకోరని వింటే కదా అంటుంది. మీ బావ ముందర  గొప్పలు పోవాల్సిన అవసరం నాకు లేదని రాజ్‌ అనడంతో మరి ఇదేంటి? అని కావ్య అడుగుతుంది.


రాజ్‌: ఏదో ఆసనం అలవాటు తప్పి ఇలా అయ్యింది కానీ లేదంటే మీ బావ బుర్ర తిరిగిపోయేలా ఆ వృశ్చికాసనమే వేసేవాణ్ని.


కావ్య: కోయండి కోయండి మీరు గొప్పలకు పోయి నాకు ఈ తిప్పలు తెచ్చారు.


రాజ్‌: అయినా ఎంతకాలంలే నిన్ను వదిలేశాకా మీ శ్వేత అక్క వస్తుంది. తనే చేస్తుంది ఇవన్నీ.


అనగానే రాజ్‌ నడుముల మీద కావ్య లాగిపెట్టి కొడుతుంది. దీంతో రాజ్‌ కేవ్వుమని అరుస్తాడు. మరోవైపు కనకం ఆత్రుతగా మూర్తి దగ్గరకు వచ్చి అల్లునికి ఫోన్‌ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్తుంది. మూర్తి తన మేనల్లునికి ఫోన్‌ చేయడంతో ఇక్కడ అంతా  బాగానే ఉందని తనకు ఊరికే ఫోన్‌ చేయోద్దని చెప్తాడు. ఇంతలో అప్పు వస్తుంది.


అప్పు: నాన్నా అమ్మా మీకో గుడ్‌ న్యూస్‌.


 కనకం: ఎంటే అది.


అప్పు: కానిస్టేబుల్‌ ఉద్యోగానికి నోటిఫికేషన్‌ వచ్చింది దానికి  అప్లై చేశాను.  


మూర్తి: అదేంటమ్మా నువ్వు ఎస్సై అవుతానన్నావుగా


అప్పు: కానిస్టేబుల్‌ అయ్యాక కూడా ఎస్సై అవ్వోచ్చని మా గురూజీ చెప్పారు.   


కనకం: సడెన్‌గా ఈ గురూజీ ఎక్కడి నుంచి వచ్చాడే..


 అని అడగ్గానే గ్రౌండ్‌లో రిటైర్డ్‌ ఎస్సై తనకు పరిచయం అయిన విషయం చెబుతుంది అప్పు ఇంతలో ఆ ఎస్సై వస్తాడు. అప్పుకు బుక్స్‌ ఇచ్చి వెళ్తాడు. మరోవైపు కావ్య వాళ్ల బావ ఇంట్లో  ఉండనని హోటల్‌లో ఉంటానని ఇందిరాదేవికి చెప్పడంతో.. నువ్వు ఇండియాలో ఉన్నన్ని రోజులు మా ఇంట్లోనే ఉండాలని చెప్తుంది. అయితే ఈ మాట రాజ్ అన్నయ్య చెబితే ఉంటానని కావ్య వాళ్ల బావ అనడంతో కావ్య కూడా రాజ్‌కు ఇష్టం లేనట్టుందని తమ బావను బట్టలు సర్దుకోమని చెప్తుంది.


రాజ్‌: హలో నేను ఇబ్బంది కలుగుతుందని చెప్పానా? నాకేం ఇబ్బంది లేదు. ఆ విషయం ఇదిగో మీ బుజ్జికి కూడా తెలుసు. కావాలంటే నెలరోజులు కాదు రెండు నెలలు కూడా ఉండొచ్చు.


కావ్య: ఏవండి మీరు నిజంగానే మనఃస్ఫూర్తిగా అంటున్నారా?


అని కావ్య అడగ్గానే నిజంగానే అంటున్నాను అంటాడు రాజ్‌. బామ్మ కూడా ఇక రాజ్‌ కూడా ఒప్పుకున్నారు ఇక ఇక్కడే ఉండొచ్చు అంటుంది. ఇంతలో వాళ్ల బావ కావ్యతో కలిసి సిటీ చూసోద్దామనుకుంటున్నాను అంటాడు. బామ్మ వెళ్లమని చెప్తుంది. దీంతో కావ్య, వాళ్ల బావ బయటకు వెళ్తారు. వాళ్ల వెనకాలే రాజ్‌ వెళ్తాడు. ఇంతలో రుద్రాణి, ధాన్యలక్మీ అసూయగా కావ్యను వాళ్ల బావను అనుమానిస్తారు. దీంతో అపర్ణ, ప్రకాష్‌, ఇందిరాదేవి వాళ్లను తిడతారు. మరోవైపు అనామిక కోపంగా కళ్యాణ్‌ను తిడుతుంది. రోజూ ఆఫీసుకు వెళ్లడం కాదు. పెద్దపెద్ద ప్రాజెక్టులు లీడ్‌ చేయాలని సూచిస్తుంది. దీంతో ఈరోజు నుంచి ఒక బ్రాంచిని నేనే చూసుకుంటానని అన్నయ్యకు చెప్తానని కళ్యాణ్‌ చెప్పడంతో అనామిక హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు కావ్యను వాళ్ల బావ కాఫీ హౌస్‌కు తీసుకెళ్లడంతో రాజ్‌, శ్వేతను తీసుకుని అదే కేఫ్‌ కు దొంగచాటుగా వచ్చి కావ్య వాళ్లను గమనిస్తుంటాడు.


కావ్య: బావ మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము.?


బావ: సర్‌ప్రైజ్‌


రాజ్‌: చూశావా సర్‌ఫ్రైజ్‌ అట కావ్యను నా నుంచి దూరం చేయడానికే బావగాడు వచ్చాడు.


అంటూ రాజ్‌ ఇరిటేటింగ్‌గా ఫీలవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: అదేం ఎక్స్‌ప్రెషన్? ‘గుంటూరు కారం’లోని ఆ సీన్‌పై ఇన్‌స్టాలో ట్రోలింగ్, స్పందించిన శ్రీలీల