Sreeleela Replay To Troll Video: సాధారణంగా సినిమా నటీనటులపై తరచూ ట్రోల్స్‌ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వెండితెరపై, సోషల్‌ మీడియాలోని వారి లుక్‌ కారణంగా ఎక్కువగా ట్రోల్‌కు గురవుతుంటారు. ఒక్కొక్కొసారి వారి యాక్టింగ్‌ వల్ల కూడా విమర్శలు ఎదుర్కొంటారు. అయితే వారిపై ఎన్ని ట్రోల్స్‌ కామెంట్స్‌ వచ్చినా సెలబ్రిటీలు చూసి చూడనట్టు వదిలేస్తారు. నెటిజన్ల కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం చాలా రేర్‌. ఆ కామెంట్స్‌ పీక్స్‌లో ఉంటే తప్పా సెలబ్రిటీలు స్పందించరు. అలా ఓ సారి తనని ట్రోల్‌ చేసిన నెటిజన్‌ కామెంట్‌కి రష్మిక రిప్లై ఇచ్చిన వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తాజాగా తన యాక్టింగ్‌పై చేసిన కామెంట్‌కు స్వయంగా సమాధానం చెప్పింది. గుంటూరు కారంలోని ఓ సీన్‌లో శ్రీలీల లుక్‌పై కామెంట్స్‌ చేస్తూ ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ రీల్‌ చేశారు.


దీనికి స్వయంగా శ్రీలీల స్పందించడం చర్చనీయాంశమైంది. 'గుంటూరు కారం' మూవీలో శ్రీలీల ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌పై ఓ డౌట్‌ ఉందటూ యూజర్‌ రీల్‌ చేసింది. అదీ మహేష్‌ బాబును సంతకోసం ఒప్పించేందుకు శ్రీలీల అతడి వెంటపడుతున్న క్రమంలో ఓ సన్నివేశంలో  మజిలీలోని ఓ పాట వస్తుంది కదా! చెలి చూపు తాకిన ఉలకవ పలకవ అంటూ సాగే ఈ పాటకు శ్రీలీల ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వకుండ ఉంటుంది. అదే ఓ ఇన్‌స్టా యూజర్‌ షేర్‌ చేస్తూ రీల్‌ చేసింది. అచ్చంగా శ్రీలీలా ఈ పాటకు ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వడానికి ట్రై చేసింది. దీన్నే షేర్‌ చేస్తూ.. ఈ మూవీ చూసినప్పుడు ఇదే డౌట్‌ నాకు వచ్చింది? ఇప్పుడు మీకు కూడా వచ్చిందా? తను డ్యాన్స్‌ ఓ రేంజ్‌లో చేసి కేక పుట్టింది. కానీ, ఇక్కడ ఎందుకు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వలేదు. ఇక్కడ నేను ఆమెతో పోల్చడం కోసం రీల్‌ చేయలేదు.






ఈ క్లిప్‌లోని తన ఎక్స్‌ప్రెషన్‌పై నా అభిప్రాయం వ్యక్తంచేస్తున్నా అంతే అంటూ తన రీల్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. ఇక రీల్‌ కస్తా వైరల్‌ కావడంతో అది శ్రీలీల కంట పడింది. తన యాక్టింగ్‌పై ఆమె కామెంట్స్‌ చేయడంతో స్వయంగా స్పందింది. ఈ రీల్‌ దీనికి ఓ కారణం ఉంది పాపా అంటూ కన్నుగీటిన ఎమోజీని జత చేసింది. తన డౌట్‌కు ఏకంగా శ్రీలీలే స్పందించడం సదరు నెటిజన్‌ ఉబ్బితబ్బి బైపోయింది. "ఓ మైగాడ్‌ నేను అసలు మీ సమాధానాన్ని ఊహించలేదు. నా రీల్‌కు స్పందించినందుకు థ్యాంక్యూ. కానీ, ఇది నా డౌట్‌ మాత్రమే కాదు ఎంతో మంది ఆడియన్స్‌ది కూడా. కానీ, ఇప్పుడు మీ సమాధానం చూసిన వారందరి డౌట్‌ కూడా క్లియర్‌ అయ్యింది. సో స్వీట్‌ ఆఫ్‌ యూ శ్రీలీల. గుడ్‌ లక్‌ స్వీట్‌ హాట్‌" అంటూ ఆమె శ్రీలీల కామెంట్‌కు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. తనపై వచ్చిన ట్రోల్ కి స్వయంగా శ్రీలీలే స్పందించడంతో అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు.