Brahmamudi Serial Today Episode:  రాజ్‌, శ్వేతను ఓదార్చడం.. చూసి కావ్య ఏడుస్తుంది. తన అనుమానమే నిజమైందని బాధపడుతుంది. ఏడుస్తూ తిరిగి ఇంటికి వస్తుంది. ఇంట్లోకి రాగానే అనామిక ఎదురు వచ్చి కావ్య అక్క నువ్వు కాశ్మీరీ పులావ్‌ బాగా చేస్తావని కళ్యాణ్‌ చెప్పాడు. నాకు నేర్పించవా? నేను నేర్చుకుంటాను అని అడుగుతుంది. కావ్య డల్‌గా ఏమీ వినబడనట్లు వెళ్లిపోతుంది. చేయి పట్టుకుని లాగి కిచెన్‌ ఇటు ఉంటే నువ్వు అటు వెళ్తున్నావేంటి అక్కా అంటుంది అనామిక.


కావ్య: ఈ పూటకి నువ్వే ఏదో ఒకటి చేసి పెట్టు


అనామిక: అదేంటక్కా కళ్యాణ్‌ నీకు అన్నింట్లో సపోర్ట్‌ చేస్తాడు నువ్వు ఈ ఒక్క చిన్నదానికి సహాయం చేయలేవా? ఒక అరగంటే కదా ఆ మాత్రం స్పెండ్‌ చేయలేవా అక్కా?


కావ్య: అనామిక ఒక్కసారి చెబితే నీకు అర్థం కాదా? నాకిప్పుడు వంట చేసే మూడ్‌ లేదు. అలసిపోయాను. అర్థం చేసుకోవేంటి? అందరికీ నేనొక వంటలక్కను అయిపోయాను.


 అంటూ కోపంగా అరిచి పైకి వెళ్లబోతుంటే ఇదంతా గమనిస్తున్న ధాన్యలక్ష్మీ కోపంగా దగ్గరకు వస్తూ..


ధాన్యలక్ష్మీ: ఏయ్‌ ఆగు


అనామిక: ఇది కదా నాకు కావాల్సింది (అని మనసులో అనుకుంటుంది.)


దగ్గరకు వచ్చిన ధాన్యలక్ష్మీ తన కోడలు మీద ఎందుకు అరిచావని అడుగుతుంది. తనేమైనా ఆస్తులు అడిగిందా? అంటూ నిలదీస్తుంది. ఒక్కరోజు ఆఫీసుకు వెళ్లిరాగానే ఇంత అహంకారం పెరిగిపోయిందా? అంటూ తిడుతుంటే.. కోపంగా ఏయ్‌ అపు అంటూ ధాన్యలక్ష్మీ మీద ఫైర్‌ అవుతుంది కావ్య. దూరం నుంచి గమనిస్తున్న అపర్ణ షాక్‌ అవుతుంది. ఏంటో భలే అరుస్తున్నావు అంటూ ధాన్యలక్ష్మీ అరవగానే అపర్ణ నువ్వేంటే అరుస్తున్నావు అంటూ వచ్చి నా కోడలు ఇంటి పనిమనిషిలా ఉందా? అంటూ ప్రశ్నిస్తుంది. కావ్య ఆఫీసులో అలసిపోయి వచ్చిందేమో ఆ మాత్రం దానికి ఇంత గొడవ చేయాలా అంటూ ఇకనుంచి నువ్వు నీ కోడలే ఇంట్లో వంట చేయాలని.. కావ్యను వెళ్లి రెస్ట్‌ తీసుకో అని చెప్తుంది అపర్ణ. పైకి వెళ్లిన కావ్య చీకటి రూంలో కూర్చుని ఏడుస్తూ.. రాజ్‌, శ్వేతల గురించి ఆలోచిస్తుంది. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి ఏం జరిగిందని కావ్యను అడుగుతాడు. దీంతో కావ్య నిజం చెప్తుంది. దీంతో మీరు ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు. పరిస్థితి చేజారిపోకముందే మీరు తొందరపడాలి అంటూ కళ్యాణ్‌ చెప్తాడు. తర్వాత కళ్యాణ్‌  హాల్లో అటు ఇటు తిరుగుతుంటే ఇంతలో రాజ్‌ వస్తాడు.


రాజ్‌: ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావు.


కళ్యాణ్‌: నువ్వు బయట తిరుగుతున్నావని నేను ఇక్కడ తిరుగుతున్నాను.


రాజ్‌: ఏమైందిరా నీకు అలా మాట్లాడుతున్నావు.


కళ్యాణ్‌: నా కళ్లు తెరుచుకుంది ఇవాళే


అంటూ లోపలికి వెళ్లిపోతాడు కళ్యాణ్‌. రాజ్‌ ఏంటి వీడు అనుకుంటూ పైకి వెళ్లిపోతాడు. రూంలోకి వెళ్లగానే కావ్య అదో రకంగా చూస్తుంటుంది.


రాజ్‌: ఏయ్‌ ఏంటా చూపు అసలు ఏమైంది మీ అందరికీ..కిందేమో కళ్యాణ్‌ గాడు కళ్లల్లోనే కత్తులు చూపించాడు. నువ్వేమో చూపులతోనే చంపేసేలా ఉన్నావు.


అనగానే  కావ్య వెళ్లి డోర్‌ ను  కాలితో తన్ని మూస్తుంది.


రాజ్‌: ఓసేయ్‌ తలుపును తన్నరే మూస్తారు. అయినా రాగానే మొదలు పెట్టాల్సింది నేను కదా నువ్వు మొదలు పెడతావేంటి?


అంటూ రాజ్‌ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో.. నేను ఆఫీసు నుంచి డైరెక్టుగా ఇంటికి వచ్చాను కానీ మీరెక్కడికి వెళ్లారు. అంటూ నిలదీస్తుంది కావ్య. ఇవన్నీ అడగటానికి నువ్వెవరు అంటాడు రాజ్‌. మీరు తాళి కట్టిన మీ భార్యను.. శ్వేతను కాదు అంటూ కావ్య అనడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఏదో ఒకరోజు మనం విడిపోవాల్సిన వాళ్లమే అంటూ రాజ్‌ వార్నింగ్‌  ఇస్తాడు. దీంతో మరోసారి కావ్య షాక్‌ అవుతుంది. ఎందుకు విడిపోవాలో కారణం చెప్పండని నిలదీస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?