Brahmamudi Serial Today Episode: ఆస్థి పంపకాలు చేస్తానన్న సీతారామయ్య కాళ్ల మీద పడి తనను క్షమించమని అడుగుతాడు ప్రకాష్. ఆస్థి పంపకాలు చేయోద్దని అందరం కలిసే ఉందామని ప్రాధేయపడతాడు. అయితే ఆస్థి పంచకూడదంటే మీరు కళ్యాణ్, అప్పులను ఇంటికి తీసుకురావాలని చెప్తాడు సీతారామయ్య. సరే అంటారు ప్రకాష్, ధాన్యలక్ష్మీ. తర్వాత ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది రుద్రాణి.
రుద్రాణి: శ్రీరాముడితో కలిసి సీత అరణ్యవాసానికి వెళ్లినట్టు నువ్వు కూడా వెళ్లాలనుకుంటున్నావా..? లేకపోతే భర్త మాటలు జవదాటని భార్య అని ఏదైనా న్యూస్ చానెల్‌లో హెడ్‌లైన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా..?
ధాన్యలక్ష్మీ: అసలు నువ్వు ఏం అడగాలనుకున్నావో అడుగు రుద్రాణి.
రుద్రాణి: నేనేం ఏం అడుగుతాను. ఇన్ని రోజులు నీకు నీ కొడుక్కు ఆస్థి దక్కాలని.. నీ తరపున పోరాడాను. నిన్ను అలాగే తీర్చిదిద్దాను. కానీ నువ్వేంటి ఇలా మారిపోయావు. బెల్లం కొట్టిన రాయిలా చలనం లేకుండా ఉండిపోయావు. మీ ఆయన అలా అడుగుతుంటే.. నువ్వెందుకు అలా ఉండిపోయావు
ధాన్యలక్ష్మీ: నువ్వే అడగొచ్చు కదా..? నేను అడిగి అందరి ముందు చెడ్డదాన్ని కావాలి. గయ్యాలి దాన్ని కావాలా..? నువ్వు మాత్రం తెర వెనక కథ నడిపిస్తూ తెరముందు మంచిదానిలా తిరుగుతుంటావా..?
రుద్రాణి: ధాన్యలక్ష్మీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను అడిగే దానికి నువ్వు అడిగే దానికి చాలా తేడా ఉంది. నేను వాళ్ల రక్తం పంచుకుని పుట్టినదాన్ని కాదు. కానీ మీకు అన్ని హక్కులు ఉన్నాయి ఆస్థిలో వాటా అడగొచ్చు.
అని ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టాలని రుద్రాణి ప్రయత్నిస్తుంది. కానీ ధాన్యలక్ష్మీ మాత్రం నా కొడుకు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రోజు అప్పు కళ్యాణ్ బల్లు ఆరేస్తుంటే.. ప్రకాష్, ధాన్యలక్ష్మీ వస్తారు.
అప్పు: అత్తయ్యా.. మామయ్యా బాగున్నారా..?
కళ్యాణ్: అమ్మా నాన్నా.. ఎలా ఉన్నారు..?
ప్రకాష్: బాగానే ఉన్నాం అమ్మా..
ధాన్యలక్ష్మీ: బాగానే ఉన్నాం కళ్యాణ్..
అప్పు: లోపలికి రండి మామయ్యగారు
ప్రకాష్: మేము లోపలికి రావడం కాదు. మీరే మాతో పాటు రావాలి
అప్పు, కళ్యాణ్ షాక్ అవుతారు.
కళ్యాణ్: మేమా.. ఎక్కడికి రావాలి నాన్నా
ప్రకాష్: చల్లకొచ్చి ముంత దాస్తావెంటుకు.. చెప్పు వాళ్లకు
ధాన్యలక్ష్మీ : మనం మన ఇంటికి వెళ్లాలి.. రండి
మరోసారి కళ్యాణ్, అప్పు షాక్ అవుతారు.
ప్రకాష్: ఇంత మంచి వార్త చెబితే అలా షాక్ అవుతారేంట్రా
ధాన్యలక్ష్మీ : మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టి తప్పు చేశానేమో.. నన్ను క్షమించండి.
కళ్యాణ్ : అమ్మా ఏం మాటలవీ.. నువ్వు మమ్మల్ని అలా దూరం పెట్టడంతోనే మంచి జరిగిందేమో.. స్వతహాగా ఎదగాలన్న ఆశ రెట్టింపైంది. కానీ నేను ఇంకా పూర్తి స్థాయి రైటర్‌గా స్థిరపడలేదు. అవకాశాల కోసం తిరగాలి. ఈ టైంలో అక్కడికి వస్తే ఎలా..?
ధాన్యలక్ష్మీ: ఇవే పనులు మన ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు కదా
అని ధాన్యలక్ష్మీ చెప్పగానే ప్రకాష్ కూడా ఓరేయ్ మీ అమ్మే వచ్చి అడిగితే ఇంకా కాదంటావేంట్రా పదండి ముందు మన ఇంటికి అంటాడు. అప్పు, కళ్యాణ్‌లను తీసుకుని ఇంటికి వస్తారు. ఇంట్లో కావ్య వాళ్లు గ్రాండ్ వెల్‌కం చెప్తారు. ఇంతలో ఇందిరాదేవి తాను ఓ నిర్ణయం తీసుకున్నానని ఇల్లు ముక్కలు అవ్వకుండా ఉండాలంటే రాహుల్, రుద్రాణి బయటకు వెళ్లిపోవాలని చెప్తుంది. అందరూ సపోర్టు చేస్తారు. ఆస్థిలో వాటా ఇస్తే తీసుకుని వెళ్తానని రుద్రాణి అంటుంది. చిల్లిగవ్వ కూడా ఇచ్చేది లేదని బయటకు వెళ్లిపోమ్మని సీతారామయ్య చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!