Brahmamudi Serial Today Episode: షాపింగ్ చేసుకుని ఇంట్లోకి కోపంగా వచ్చిన స్వప్న, రుద్రాణి, ధాన్యలక్ష్మీని తిట్టి అపర్ణకు సారీ చెప్తుంది. కావ్య ఆ రెండు లక్షలు తనకే ఇచ్చిందని చెప్తుంది. దీంతో కావ్య షాక్ అవుతుంది. అందరూ షాక్ అవుతారు. ఇంతలో రుద్రాణి కోపంగా ఈ షాపింగ్ అంతా అదేనా తీసుకున్న రెండు లక్షలు ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టుకుని వచ్చావా? అంటూ కోపంగా నిలదీస్తుంది.
స్వప్న: దేవుడు మీ ఇద్దరికి నోళ్లు ఇచ్చి బ్రెయిన్ ఇవ్వడం మర్చిపోయాడు. మా కావ్యకి బ్రెయిన్ ఇచ్చి నోరు ఇవ్వడం మర్చిపోయాడు.
ఇందిరాదేవి: పూర్తిగా చెప్పకుండా ఎవరెవరు అడ్డు పడదలచుకున్నారో వాళ్లంతా బయటకు వెళ్లండి.
స్వప్న: కావ్య రెండు లక్షల నాకే ఇచ్చింది. తను ఆఫీసుకు వెళ్తున్నందుకు ఇంట్లో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ఇవ్వమని చెప్పింది. అందుకే అవి నేనే భద్రంగా దాచాను.
అంటూ స్వప్న చెప్పగానే రుద్రాణి అబద్దం అని చెప్తుంది. అయితే నిజం ఏంటని చెప్పమని స్వప్న అడగ్గానే రుద్రాణి నోరు మూసుకుంటుంది. ఇంతలో స్వప్న పైకి వెళ్లి రెండు లక్షలు తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో అపర్ణ కోపంగా ధాన్యలక్ష్మీని నిలదీస్తుంది. ప్రకాష్ ధాన్యలక్ష్మీని తిట్టి లోపలకి వెళ్లమంటాడు. లోపలికి కోపంగా వెళ్తున్న రుద్రాణి వెనకాల రాహుల్ వెళ్లి రుద్రాణిని వెటకారంగా మాట్లాడతాడు. స్వప్నకు కనిపించేలా డబ్బు ఎందుకు దాచావని అడుగుతాడు. దానికి కనిపించేలా ఎందుకు దాస్తానని కంగారుగా బీరువా తెరచి చూస్తుంది రుద్రాణి. అందులో తాను దాచుకున్న 5 లక్షలు కొట్టేసిందని ఇద్దరూ బాధపడుతారు. ఇంతలో స్వప్న వస్తుంది.
స్వప్న: ఏంటి నిజం తెలిసిపోయిదా? మీకు నేనే కరెక్టు. ఏ పాపం తెలియని నా చెల్లిని దొంగను చేయాలని చూశారుగా అందుకే ఐదు లక్షల్లోంచి రెండు లక్షలు తీసి వాళ్లకి ఇచ్చేశాను.
రుద్రాణి: మరి మూడు లక్షలు?
స్వప్న: ఇంకెక్కడి మూడు లక్షలు ఇందాకా మోసుకొచ్చిన క్యారీబ్యాగ్స్ ఏమనుకుంటున్నారు. వాటి నిండా షాపింగ్ చేసి మూడు లక్షలు ఖర్చు పెట్టాను.
రాహుల్: ఏయ్ ఇప్పుడే వెళ్లి జరిగిందంతా అందరితో చెప్పేస్తాను.
అనగానే ఇదొక్కటే కాదు ఆ ఐదు లక్షల గురించి మీరు కొట్టేసిన రెండు లక్షల గురించి కూడా చెప్పు వాటికి లెక్కలు చెప్పు అంటూ స్వప్న బెదిరించడంతో రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. మీరు నా చెల్లి విషయంలో జోక్యం చేసుకుంటే మీకిలాగే ఉంటుంది. జాగ్రత్త అంటూ హెచ్చరించి వెళ్లిపోతుంది స్వప్న. బయటకు వచ్చిన స్వప్నను కావ్య వచ్చి హగ్ చేసుకుని నాకు చాలా హెల్ఫ్ చేశావు అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు హాల్లో తదేకంగా రాజ్‌ను చూస్తూ ఉంటుంది ఇందిరాదేవి. పైకి ఇంక మంచిగా కనబడతాడు వీడా కాపురాన్ని పాడుచేసుకునేది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో రాజ్ దగ్గరకు వచ్చి
రాజ్: ఏంటి నాన్నమ్మ అలా చూస్తున్నావు.
ఇందిరాదేవి: రేయ్ ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా?
రాజ్: దేని గురించి నాన్నమ్మ
ఇందిరాదేవి: నీ కాపురం గురించి
రాజ్: అదేంటి నాన్నమ్మ పెళ్లైన ఇన్ని రోజులకు ఈ ప్రశ్న వేస్తున్నావు.
ఇందిరాదేవి: ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతేనే ఎదురు ప్రశ్న వేస్తారు. పెళ్లైన ఇన్ని రోజులకు కూడా నీ కాపురం చక్కబడినట్లు లేదు. అందుకే అడుగుతున్నాను.
రాజ్: అసలు నీకెందుకు ఆ అనుమానం వచ్చింది.
కావ్య ఇంతకు ముందులా లేదని మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది. అంటూ ఇందిరాదేవి నిలదీయడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో కావ్య కిచెన్ లోంచి వస్తుంటే పిలిచి నాన్నమ్మకు మనమీద అనుమానం వచ్చిందట అంటూ లేని ప్రేమను ఉన్నట్లు నాటకమాడటంతో ఇందిరాదేవి, కావ్య నవ్వు కుంటారు. రాజ్ పైకి వెళ్తాడు. వాడు నాతోనే నాటకాలు ఆడుతున్నాడు. నువ్వు నాటకం ఆడటంలో తప్పేం లేదు. నువ్వు వెంటనే తెర తియ్యి నీ వెనకాల నేనుంటాను అని ఇందిరాదేవి చెప్తుంది. పైకి వెళ్లిన రాజ్ రూంలోకి కావ్య రావడం చూసి గట్టిగా శ్వేతతో ప్రేమగా మాట్లాడుతున్నట్లు నటిస్తాడు. శ్వేత తో మీరు బాగా మాట్లాడుకోండి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. కావాలిస్తే నేను బయటకు వెళ్లి పడుకుంటాను మనలో మనకు దాపరికాలు ఎందుకు మీరు క్లియర్‌గా చెప్పారు. నేను అర్థం చేసుకున్నాను. అని బెడ్ షీట్స్ తీసుకుని బయటకు వెళ్తూ.. నేను బయట పడుకుంటే అందరికీ అనుమానం వస్తుంది. మీ ఇద్దరికీ పెళ్లై నేను మా ఇంటికి ఆటోలో వెళ్లేదాకా ఇక్కడే పడుకుంటాను అని కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.