Brahmamudi Serial Today Episode: ముద్ర కంపెనీ ప్రతినిధులు వెళ్లిపోయాక రాజ్‌ తన చాంబర్‌లోకి కావ్యను పిలిచి ఎందుకు మీటింగ్‌ పెట్టావని తిడతాడు. నేను లేకుండా మీటింగ్‌ పెట్టడంలో నీ ఉద్ద్యేశం ఏంటని నిలదీస్తాడు. దీంతో మీరు మీ పియాన్సీతో ఊరేగుతుంటే మేమిక్కడ ఖాళీగా కూర్చోవాలా అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. దీంతో రాజ్‌ మరింత కోపంగా..


రాజ్‌: నువ్వు ఏ ఉద్ద్యేశంతో మీటింగ్‌ కంటిన్యూ చేశావో నాకు తెలుసు.


కావ్య: ఏ ఉద్యేశంతో చేశానని అనుకుంటున్నారు.


రాజ్‌: నిన్ను వదిలేస్తానని చెప్పాను కాబట్టి ఈలోగా మా డాడీ దగ్గర మార్కులు కొట్టేసి.. నా ఫ్యామిలీ మొత్తాన్ని నీ వైపు తిప్పుకోవాలని ఇదంతా చేస్తున్నావు. రేపు నేను నీకు విడాకులిస్తానంటే నా వాళ్లంతా నీకు సపోర్టు చేయాలని ఇదంతా చేస్తున్నావు.


  అనగానే కావ్య తనది అంత చీప్‌ క్యారెక్టర్‌ కాదని మీకు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. కళ్యాణ్‌ ఫోన్‌ నుంచి చేస్తే వస్తానని  చెప్పి   ఎప్పుడొచ్చారు అంటుంది. దీంతో రాజ్‌ కోపంగా శ్వేతకు త్వరలోనే విడాకులు రాబోతున్నాయి. ఆ వెంటనే నేను నీకు విడాకులు ఇచ్చి నేను శ్వేత పెళ్లి చేసుకుంటాము నువ్వికి నా జీవితంలోంచి వెళ్లిపో అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో కావ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. కావ్యను చూసిన శ్వేత కోపంగా లోపలికి వెళ్లి రాజ్‌ను తిడుతుంది. దీంతో రాజ్‌ తను నాతో హ్యాపీగా లేదని అందుకే ఇష్టం లేకపోయినా ఇలా మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని అబద్దం చెప్పాను. అప్పుడైనా తను నాకు దూరం అవుతుంది అని రాజ్‌ చెప్పగానే శ్వేత ఒక అమ్మాయిని బాధపెట్టడం పద్దతి కాదంటుంది. దీంతో చాటు నుంచి కావ్య మొత్తం విని ఏడుస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రుద్రాణి, అనామిక హాల్లో కూర్చుని గుసగుసలాడుకుంటుంటారు.


రుద్రాణి: ఈ మధ్య మీ పెద్దత్త మీ అత్తని తెగ  ఆడేసుకుంటుంది.


అనామిక: ఏం మిమ్మల్నేమయినా తక్కువ అంటున్నారా?


రుద్రాణి: నేనంటే ఆడపడుచుని నన్ను అనడానికి కొన్ని లిమిటేషన్స్‌ ఉంటాయి. కానీ మీ అత్తకే పాపం ఇత్తడైపోతుంది.


అనామిక: అవును పాపం


రుద్రాణి: నువ్వు మీ అత్తను వెనకేసుకొచ్చి మీ పెద్దత్తను గట్టిగా దులిపేయ్యోచ్చు కదా?


అనామిక: మా అత్తకు చెప్పుకునే దిక్కులేదు. ఇక నన్ను కరివేపాకు కింద తీసిపారేయదు.


రుద్రాణి: నువ్విలాగే ఉంటే అంతే సంగతులు.


అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంతలో అక్కడకు అపర్ణ వస్తుంది. ఇద్దరూ సైలెంట్‌ అవుతారు. ఆఫీసు నుంచి సంపత్‌ వచ్చి సుభాష్‌ సార్‌ పంపిచారు అని ఐదు లక్షలు తీసుకురమ్మని చెప్పగానే అపర్ణ లోపలికి వెళ్లి లాకర్‌ లో  డబ్బులు చూసి మూడు లక్షలే ఉన్నాయేంటి అనుకుని బయటకు వచ్చి సంపత్‌కు మూడు లక్షలు ఇచ్చి మిగతా రెండు లక్షలు ట్రాన్స్‌ ఫర్‌ చేస్తానని చెప్పు అని చెప్తుంది. దీంతో సంపత్‌ వెళ్లిపోతాడు.


రుద్రాణి: అదేంటి వదిన డబ్బులు ట్రాన్స్‌ ఫర్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది.


అపర్ణ: లాకర్‌లో ఐదు లక్షలుండాలి. కానీ ఇప్పుడు చూస్తే మూడు లక్షలే ఉన్నాయి.


రుద్రాణి, అనామిక షాక్‌ అయినట్లు నటిస్తూ..


రుద్రాణి: ఏంటి నీకు తెలియకుండా అంత డబ్బు ఎలా మాయం అంవుతుంది. ఎక్కడికి పోతాయి ఎవరు తీసి ఉంటారు.


ధాన్యలక్ష్మీ: ఇంకెవరు తీసుంటారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే.. ఇలాగే ఉంటుంది.


అంటూ ధాన్యలక్ష్మీ, రుద్రాణి 2 లక్షలు కావ్య తీసి ఉండొచ్చని ఆమెపై దొంగతనం మోపి.. తాళం ఇచ్చిన మొదటిరోజే ఇలా చేసింది అనడంతో అపర్ణ కోపంగా నీ కోడలు కూడా తీసి ఉండొచ్చు కదా ఎందుకంటే ఇంతకు ముందు తాళాలు తీసుకొచ్చి ఇచ్చింది నీ కోడలే అంటూ లోపలికి వెళ్లిపోతుంది. దీంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణి, అనామిక చాలా హ్యాపీగా ఇవాళ ఆ కావ్య పని అయిపోయిందని ఫీలవుతారు. మరోవైపు ఆఫీసు నుంచి బాధగా ఇంటికి వస్తున్న కావ్య కారు మధ్యలో ఆగిపోతుంది. ఇంతలో రాజ్‌ వచ్చి ఏమైందని డ్రైవర్‌ను అడుగుతాడు. ఏదో ప్రాబ్లమ్‌ సార్‌ అని చెప్పడంతో రాజ్‌ డ్రైవర్‌ను తిట్టి కావ్యను తన కారులో వెళ్దామని చెప్పడంతో కావ్య రానని చెప్తుంది. దీంతో రాజ్‌, కావ్యపై కోప్పడటంతో రాజ్‌ను కావ్య తిడుతుంది. నేను ఇంటికి రావడం లేదని నేను నా పుట్టింటికి వెళ్తున్నానని చెప్పడంతో.. సరే అక్కడే డ్రాప్‌ చేస్తాను పద అనగానే కావ్య రాజ్‌ కారు ఎక్కి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: తిరుపతి వడలను ఇంట్లోనే ఇలా చేసేయండి.. రెసిపీ చాలా ఈజీ