• Brahmamudi Serial Today Episode: బారసాల జరుగుతుంటే అందరూ సంతోషంగా ఉంటారు. ఇంతలో అనామిక వస్తుంది. ఎందుకొచ్చావని అందరూ అడగ్గానే.. మీకో రహస్యం చెప్పాలని వచ్చాను అంటుంది. నీతో మాటలేంటి వెళ్లిపో ఇక్కడి నుంచి అని కావ్య, తిడుతుంటే.. రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఆ రహస్యం ఏంటో చెప్పనివ్వండి అంటారు.

అనామిక: రాజ్‌, కావ్య వంద కోట్లు అప్పు చేశారు. అందుకోసం మీ ఆస్తులు ఒక్కోక్కటి తాకట్టు పెడుతున్నారు.

సుభాష్‌: ఏంట్రా అనామిక చెప్పేది నిజమా

అపర్ణ: ఏంటి కావ్య నిజమేనా

రుద్రాణి: అమ్మో ఇప్పుడు అర్థం అవుతుంది. ఇన్నాళ్లు ఒక్క టిఫిన్‌ ఒక్క కూర అని ఎందుకు రూల్స్‌ పెట్టిందో.. ఒక్క కారు ఉంచి మన అన్ని కార్డులు బ్లాక్‌ చేయించి మన అందరినీ పేదరికంలోకి నెట్టేసింది. ఇందుకేనా..?

ఇందిరాదేవి: నువ్వు ఆపు రుద్రాణి.. ఒక అనామకురాలు వచ్చి ఏదేదో వాగితే నువ్వు రాదాంతం చేయడానికి కారణం దొరికిందా..?

రాహుల్‌: అమ్మమ్మ అనామిక చెప్పింది అబద్దమే అయితే రాజ్‌, కానీ కావ్య కానీ ఎందుకు ఏమీ అనడం లేదు. ఎందుకు మౌనంగా ఉంటున్నారు.

ధాన్యలక్ష్మీ:  అత్తయ్యా ఇందులో నిజం ఉందనిపిస్తుంది

ఇందిరాదేవి: ఏంటా నిజం ధాన్యలక్ష్మీ కుటుంబంలో అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి కావ్య చేసిన ప్రయత్నం మీకు ఇలాగా కనిపిస్తుందా..?

అనామిక: అది అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి చేసిన ప్రయత్నం కాదు అమ్మమ్మ గారు. బ్యాంకు వాళ్లు వంద కోట్లు కట్టాలని ఇచ్చిన నోటీసు ఇది మీరే చూడండి..

అని పేపర్లు ఇస్తుంది అనామిక. ఆ పేపర్లు చూసిన సుభాష్‌ షాకింగ్‌గా ఉండిపోతాడు. అందరూ ఏమైందని అడుగుతారు.

సుభాష్‌: అవును బ్యాంకుకు వంద కోట్లు కట్టాలి

అందరూ షాక్‌ అవుతారు.

అనామిక: హమ్మయ్య ఇన్నాళ్లకు దుగ్గిరాల వాళ్ల ముఖచిత్రాలు మాడిపోవడం, వాడిపోవడం కళ్ళారా చూశాను. ఇక ప్రశాంతంగా నిద్రపోతాను.

అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఇంట్లో రుద్రాణి, ధాన్యలక్ష్మీ  కోపంగా రాజ్‌, కావ్యల మీదకు దండయాత్ర చేస్తారు.   

ధాన్యలక్ష్మీ: ఏ బినామీ ఆస్థులు కొనడానికి బ్యాంకులో అప్పు చేశారు..?

అపర్ణ: ఎందుకు అప్పు చేశారో చెప్పండి

కళ్యాణ్‌: అన్నయ్యా మీరు ఏదో కారణం ఉంటేనే ఇలా చేసి ఉంటారు. ఆ బలమైన కారణం ఏంటో అందరికీ చెప్పండి.

ధాన్యలక్ష్మీ:  ఇంకా బలమైన కారణం ఏంట్రా ఆసలు ఎందుకు ఆప్పులు చేశారో తెలుసుకో..?

అందరూ రాజ్‌, కావ్యలను నిలదీస్తారు. దీంతో కావ్య ఏదో చెప్పబోతుంటే రాజ్‌ ఆపేస్తాడు.

రాజ్‌: కళావతి నువ్వేం చేయలేదు.. అంతా నేను చెప్పిందే చేశావు. నేను కళావతి రాత్రింబవళ్లు కష్టపడి 25 కోట్ల అప్పును తీర్చగలిగాం ఇక 75 కోట్ల అప్పును తీరుస్తాం.. కంపెనీ ఆస్తులు ఎక్కడికి  పోలేదు ఇందులో కళావతి తప్పేం లేదు.. రా కళావతి

అని రాజ్, కావ్యను తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత రాజ్‌ వంద కోట్ల అప్పు చేయడమేంటని అపర్ణ, సుభాష్‌ ఆలోచిస్తారు. ఎందుకు అప్పు చేశారో అర్థం కావడం లేదని అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది. బలమైన కారణం ఉంటే కానీ వాళ్లు నిజాన్ని బయటపెట్టరని సుభాష్‌ సమర్థిస్తాడు. మరోవైపు కళ్యాణ్‌, ప్రకాష్‌ ఆలోచిస్తూ కూర్చుని ఉంటే ధాన్యలక్ష్మీ వచ్చి కళ్యాణ్‌ను కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది. దీంతో కళ్యాణ్‌ కోపంగా ధాన్యలక్ష్మీని తిడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!