Satyabhama Serial Today Episode క్రిష్ సంజయ్‌ని పక్కకి తీసుకెళ్లి సంధ్యకి అన్యాయం చేస్తే అస్సలు ఊరుకోను. మా బాపు కూడా నన్ను అడ్డుకోలేరని సంధ్య సంతోషంగా ఉందని ఒక్క కారణంతో నిన్ను ఏం అనడం లేదు సంధ్య బాధ పడితే మాత్రం నిన్ను ఉంచను అని వార్నింగ్ ఇస్తాడు.
సంజయ్: బ్లడీ గల్.. పీడ వదిలింది అనుకుంటే వెతుక్కుంటూ ఇక్కడి వరకు వస్తుందంట. ప్రస్తుతానికి మాట దాటేసి తప్పించుకున్నా కానీ అది వస్తే ఎలా తప్పించుకోవాలి.
చక్రి: వాడి వల్ల కాదు సత్య నలుగురిలో అడ్డంగా దొరికిపోయాడు. తప్పించుకోలేడు.
సత్య: ఏమో మామయ్య ఈ మధ్య ఏం అనుకున్నా జరగడం లేదు. మీ పెంపకంలో పెరిగినా ఇలా తయారయ్యాడేంటి మామయ్య.
చక్రి: పేరుకే నా కొడుకు కానీ వాడి రక్తం అన్నయ్యది. ఫారెన్‌లో పెరిగాడు కదా నాకు అటాచ్ మెంట్ లేదమ్మా. పైగా వాడిని ముఖం చూస్తే అన్నయ్యే గుర్తొచ్చే వాడు కోపంలో ఏమైనా చేస్తానేమో అని వదిలేశాను.
సత్య: సంజయ్ వేషాలు భరించలేక చెంప దెబ్బ కొట్టాను. సైలెంట్ అయిపోతే మారుతాడు అనుకున్నా కానీ ఇలా సంధ్యని ట్రాప్ చేస్తాడని ఊహించలేదు. క్రిష్‌కి మీ మీద ఉన్న అభిమానం వల్ల సంజయ్‌ని నెగిటివ్‌గా ఆలోచించలేకపోతున్నాడు.
చక్రి: క్రిష్ సంజయ్‌కి ఎదురు తిరిగితే మా అన్నయ్య వల్ల క్రిష్‌కి ప్రమాదం.
సత్య: క్రిష్‌కి మీ అన్నయ్య ఎదురు వెళ్లలేరు మామయ్య. మీరు ఒక్క సారి నిజం చెప్పండి
రూప: సంజయ్ సంజయ్ ఎక్కడున్నావ్ బయటకు రా.
చక్రి: రూప వచ్చినట్లుంది పదమ్మా. తర్వాత మాట్లాడుకుందాం.
రూప: ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నావ్‌రా నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు ఏం చేయలేదు అనుకున్నావా. పెళ్లి చేసుకుంటా అని చెప్పి నాతో తిరిగి నన్ను మోసం చేస్తావా.
సంజయ్: రూప మంచిగా మాట్లాడు.
రూప: నోర్ముయ్ బూతులు.. బూతులు తిట్టేదాన్ని పెద్ద వాళ్లు ఉన్నారని ఆగిపోయా నువ్వు చేసిన మోసం తలచుకుంటే ఒళ్లు రగిలిపోతుంది. నా మెడలో కట్టాల్సిన తాళి వేరే దాని మెడలో కడితే ఊరుకుంటానా.
క్రిష్: మా వాడు నీ వెనక తిరగాడు అనడానికి ఫ్రూఫ్ ఏంటి?
రూప: అంటే నేను అబద్ధం చెప్తున్నానా. ఫోన్ చూపించి దీని నిండా మా ఫొటోలు ఉన్నాయి. చాటింగ్ ఉంది. పర్సనల్ ఫొటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి. వీడి పక్కన ప్లేస్ నాది నీది కాదు. కుర్రోడు బాగున్నాడని లైన్ వేసుంటావ్ పడిపోయాడు. నన్ను వదిలేశాడు.
సత్య: నోర్ముయ్ నా చెల్లిని ఏమైనా అన్నావంటే నోరు కుట్టేస్తా. నీతో తిరిగింది మోసం చేసింది సంజయ్ అతనితో తేల్చుకో. నీ లాగే నా చెల్లి కూడా అతని బాధితురాలు. నువ్వు ఎలాంటి ఉచ్చులో ఇరుక్కున్నావో తెలుస్తుందా. ముఖంలో కొంచెం కూడా బాధ లేదేంటే. నీ సంతోషానికి అడ్డు పడుతున్నా అన్నావ్. నిన్ను చూసి అసూయ పడుతున్నా అన్నావ్. నమ్మేశారు అందరూ నమ్మేశారు. నన్ను దోషిలా చూశారు. విన్నావుగా ఆ రూప మాటలు. ఇప్పుటికైనా నిజం తెలిసొచ్చిందా. పద మన ఇంటికి వెళ్దాం పద. అమ్మానాన్నలకు క్షమాపణ అడుగుదాం పద.
సంధ్య: ఆగు అక్క ఇక చాలు ఇంకొక్క సారి సంజయ్‌ని మోసగాడు అనకు. ఇదిగో ఇదే సంజయ్‌ని మోసం చేసింది. సంజయ్ రూపని ప్రేమించిన మాట నిజం కానీ రూప ఆస్తి కోసం తనని రూప ప్రేమించిందని తెలుసుకున్న సంజయ్ తనని వదిలేశాడు. ఆ మాటలు నాకు ముందే చెప్పాడు.
చక్రి: మరి ఈ మాట వాడు ముందే చెప్పొచ్చు కదా.
సత్య: అప్పుడు దొరికిపోయా అనే టెన్షన్లో ఉన్నాడు. తర్వాత తీరికగా ఆలోచించి కట్టు కదా అల్లేశాడు.
అందరూ సత్యనే తప్పు పడతారు. సంజయ్‌ని ఎందుకు తప్పు పడతావ్ అని మహదేవయ్య, భైరవి అరుస్తారు. నీకు ఇష్టం లేకపోతే సంధ్యని తీసుకెళ్లిపో నీ చెల్లే కదా గుడి దగ్గరకు గోల చేసి పెళ్లి చేసుకుంది అని అంటాడు. ఇక సంధ్య అందరికీ ఓ వీడియో చూపిస్తుంది. అందులో రూప ఆస్తి కోసమే సంజయ్‌ని ప్రేమించినట్లు ఆస్తి దక్కించుకొని సంజయ్‌ని తోసేస్తా అని ఉంటుంది. ఇక సంధ్య రూపని కొట్టి ఇంటి నుంచి గెంటేస్తుంది. ఇప్పటికైనా నా మొగుడి మీద నిందలు వేయడం ఆపేయ్ అని సత్యకి వార్నింగ్ ఇస్తుంది. సంజయ్‌ని తీసుకొని చక్రి దగ్గరకువెళ్లి మీతో ఇవన్నీ చెప్పలేదు కానీ నాతో చెప్పాడని అంటుంది. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే కానీ ఆ తప్పునకు కారణం సంజయ్ కాదు నేను అని చెప్పి తనని ఆశీర్వదించమని మా అమ్మానాన్న వదిలేశారు మీరు కూడా వదిలేయొద్దు మామయ్య అని ఏడుస్తుంది. దాంతో చక్రవర్తి ఇద్దరిని దీవిస్తాడు. మహదేవయ్య సంజయ్‌ని హగ్ చేసుకుంటాడు.
సత్య బయటకు వెళ్లి చీకట్లో ఏడిస్తే మహదేవయ్య సత్య దగ్గరకు వెళ్లి అందరూ చూస్తారు అనా ఇలా ఏడుస్తున్నావా అని అంటాడు. మీ మామని బాగానే పిలిచావ్ కానీ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయిందని అంటాడు. తన చిన్న కొడుకు మాత్రం చేసేవన్నీ చేస్తాడు కానీ దొరకడు అని అంటాడు. నీకు నేను ఇచ్చిన గడువులో ఒక్క రోజు మాత్రమే ఉందని ఎలక్షన్‌లో విత్ డ్రా అయితే సంజయ్, సంధ్య హనీమూన్‌కి సంతోషంగా వెళ్తారు. లేదంటే ఒక్కరే వస్తారని అంటాడు. సత్య చాలా భయపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.