Brahmamudi Serial Today Episode: కేరళలోని ఒక హోటల్లో రాజ్, కావ్య భోం చేస్తుంటారు. ఇంతలో వాళ్ల పక్కన కూర్చున్న అమ్మాయి రాజ్, కావ్యలతో మాట్లాడుతుంది.
అమ్మాయి: మీరు లవర్సా..?
కావ్య: హస్బెండ్ అండ్ వైఫ్
రాజ్: ఎందుకు కళావతి అలా చెప్పావు వాళ్ల మాట వినడానికి ఎంత బాగుంది. కాసేపైనా హ్యాపీగా అనుభవించనివ్వవా..?
అమ్మాయి: ఓ హనీమూన్‌కు వచ్చారా.?
రాజ్: అవునండి ఫస్ట్ టైం
కావ్య: ఏవండి హనీమూన్‌కు వచ్చే వాళ్లు ఫస్ట్ టైం కాక థర్డ్ టైం వస్తారా..? ఎందుకలా చెప్తున్నారు..?
అమ్మాయి: మీ జంట చాలా బాగుందండి. మీరు అసలు భార్యాభర్తల్లా లేరండి
రాజ్: చూశావా కళావతి నీ పక్కన యంగ్ అండ్ డైనమిక్ నేను ఉన్నాను కాబట్టి అందుకే అలాంటి కాంప్లిమెంట్స్
కావ్య: మీరు యంగ్ అండ్ డైనమిక్ అయితే నేనేంటి పేదరాశి పెద్దమ్మనా..?
రాజ్: అయ్యో నేను అలా అనలేదు కళావతి ఫ్లీజ్
అమ్మాయి: సార్ మీరు భార్యాభర్తలు అని అర్థం అయిపోయింది.
రాజ్: అవునా ఎలా తెలిసింది
అమ్మాయి: మీరు మీ ఆవిడను బతిమాలుతున్నారు కదా అలా అర్థం అయిపోయింది
అంటూ అమ్మాయి చెప్పగానే.. రాజ్ సిగ్గుపడుతుంటాడు. రౌడీలు మారువేషంలో వచ్చి రాజ్ రూంలోకి వెళ్లి పెన్ డ్రైవ్ వెతుకుతుంటారు. అప్పుడే రూలో సర్వీస్ చేయడానికి వచ్చిన బాయ్ కి పెన్ డ్రైవ్ దొరుకుతుంది. అది తీసుకెల్లి రిసెప్షన్‌లో ఇవ్వాలనుకుంటాడు సర్వీస్ బాయ్. మరోవైపు స్వప్న రెడీ అవుతుంటే రాహుల్ వెళ్తాడు.
రాహుల్: నువ్వు ఇలా అందంగా రెడీ అయి ఎన్ని రోజులు అయింది స్వప్న
స్వప్న: మన పెళ్లి అయ్యాక ఫస్ట్ టైం నువ్వు నన్ను లంచ్‌కు తీసుకెళ్తానన్నావు అలాంటప్పుడు ఈమాత్రం రెడీ అవ్వాలి కదా..?
రాహుల్: ఇన్ని రోజులు మా అమ్మ మాటలు నమ్మి మూర్ఖంగా ఉన్నాను. ఇక అలా ఉండకూడదు అనుకుంటున్నాను
ఒక నెక్లెస్ స్వప్న మెడలో వేస్తాడు రాహుల్..
స్వప్న: ఇదెప్పుడు కొన్నావు
రాహుల్: నీ కోసమే స్పెషల్‌గా డిజైన్ చేయించాను. నచ్చిందా..?
స్వప్న: నువ్వు నా కోసం ఇలా తీసుకురావడం నాకు ఇంకా ఇంకా నచ్చింది.
రాహుల్: ఇన్ని రోజులు నేను నీ కోసం కానీ మన పాప కోసం కానీ ఏమీ చేయలేదు. ఇక నుంచి నేను చేసే ప్రతి పని మీ కోసమే
స్వప్న: ఇన్ని రోజులు ఇంట్లో రాజ్, కళ్యాణ్‌ను చూసి నా రాహుల్ వాళ్ల లాగా ఎందుకు లేడా అని బాధపడేదాన్ని
రాహుల్: ఇప్పుడే కాదు స్వప్న.. ఫ్యూచర్‌లో ఇంకెప్పుడు నువ్వు నా వల్ల బాధపడవు. ఇది నా ప్రామిస్ అన్నట్టు స్వప్న త్రీడేస్ నుంచి నేను ఎంతో కష్టపడి డిజైనర్ దగ్గరుండి మరీ మన కంపెనీ కోసం కొత్త డిజైన్స్ గీయించాను కదా..?
స్వప్న: అవును దానికోసం నువ్వు 24 గంటలు నిద్ర కూడా పోలేదు కదా..?
రాహుల్: వాటిని ఫైనల్ చేసి ఈరోజు మ్యానుఫాశ్చరింగ్ యూనిట్‌కు పంపించాలి.
స్వప్న: పంపించు దానికి నన్ను అడగడం దేనికి..?
రాహుల్: వాటిలో ఏవి బాగున్నావో ఏంటో నువ్వే ఫైనల్ చేయాలి కాబట్టి నీకే చెప్తున్నాను..
స్వప్న: రాహుల్ నేను ఫైనల్ చేయడం ఏంటి..? దాని గురించి నాకేం తెలుసు..?
రాహుల్: నీకు డిజైన్స్ ఎలా ఉండాలో తెలియకపోవచ్చు కానీ ఈ రాహుల్ సక్సెస్ అవ్వాలని మాత్రం నీ మనసులో కోరుకుంటావు కదా..? ఆ మంచి మనసు చాలు నేను సక్సెస్ అవ్వడానికి వచ్చి సెలెక్ట్ చేయ్
స్వప్న: రాహుల్ బిజినెస్ అనేది ఎమోషనల్ గా ఆలోచించకూడదు అనుకుంటా..?
రాహుల్: మన కంపెనీలో మొదటి సారి మానుఫాశ్చరింగ్ చేయబోతున్న డిజైన్స్ ఇవి వీటికి టాలెంట్‌తో పాటు లక్కీ కూడా ఉండాలి కదా..? నా లక్కీ చార్మ్ నువ్వే కదా వీటిలో ఏవి బాగున్నాయో నువ్వే సెలెక్ట్ చేయ్
స్వప్న: ఇవి బాగున్నాయి.. నాకైతే చాలా నచ్చాయి
రాహుల్: నాకు ఏవి నచ్చాయో నీకు కూడా అవే నచ్చాయి తెలుసా..?
స్వప్న: నిజంగా చెప్తున్నావా..?
రాహుల్: ఒకప్పుడ మనిద్దరికి ఆ దేవుడు పెళ్లి ఎందుకు చేశాడా ..? ఇద్దరి ఆలోచనలు వేర్వేరు కదా..? అనుకునేటోడిని కానీ నేను మారాకే అర్థం అయింది. నువ్వు నా లైఫ్‌లో ఉండటమే కరెక్టు అని నేను మారితే మనిదరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతామని ఆ దేవుడు ముందే డిజైన్ చేశాడేమో సరే స్వప్న నువ్వు రెడీ అవ్వు.. నేను మేనేజర్‌కు ఈ డిజైన్స ఇచ్చి వస్తాను
అంటూ రాహుల్ వెళ్లిపోతాడు. ఇక రాజ్, కావ్యలు రౌడీలను గుర్తు పట్టి వారితో ఓ ఆటాడుకుంటారు అంతా ఫన్నీగా ఉంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!