Brahmamudi Serial Today Episode: అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అప్పు రేణుక కేసు విషయంలో ఆలోచిస్తుంది. ఎలా ముందుకు వెళ్లాలి అన్న మీ మాంసలో ఉంటుంది. అప్పుడే వచ్చిన కళ్యాణ్‌ అప్పును చూసి ఆశ్చర్యపోతాడు.

Continues below advertisement

కళ్యాణ్‌: ఏంటి పొట్టి అంతలా ఆలోచిస్తున్నావు

అప్పు: ఏం లేదు రేణుక గురించి ఆలోచిస్తున్నాను.. రేణుక మాటలు నమ్మాలనిపిస్తుంది. మరోపక్క జనం చెప్పిన మాటలు నమ్మాలా వద్దా అనిపిస్తుంది

Continues below advertisement

కళ్యాణ్‌: పొట్టి ముందు నువ్వు నిజాలు అబద్దాలు పక్కన పెట్టు కాస్త ప్రశాంతంగా ఆలోచించూ.. నీ మనసు ఏం చెప్తుందో అదే నమ్ము

అప్పు: రేణుక చెప్పిన మాటలు నిజం అనిపిస్తుంది. తనలో తన ఆవేదనలో ఓ తల్లి బాధ స్పష్టంగా కనిపిస్తుంది

కళ్యాణ్‌: అలాంటప్పుడు డాక్టర్‌ను కన్సల్ట్ అయితే తనేంటో తెలిసిపోతుందా కదా పొట్టి

అప్పు: ఇన్ని రోజులుగా తన ప్రవర్తన చూశాక డాక్టర్‌ ను కన్సల్ట్‌ అయ్యారు. డాక్టర్‌ కూడా తాను నార్మల్‌ గానే ఉందని చెప్పారు.

కళ్యాణ్‌: అలాంటప్పుడు ఇందులో అనుమానపడాల్సింది ఏముంది…? కన్ఫీజ్‌ అవ్వడానికి ఏముంది. తన మాటలు నిజమని ముందుకు వెళితే సరిపోతుంది. అవును పొట్టి నువ్వు నమ్మిందే చేయ్‌.. ఎక్కడ నీకు అనుమానం వచ్చినా ఆవిడ చెప్పింది అబద్దం అని తేలితే ఇన్వెస్టిగేషన్‌ ఆపేయ్‌.. ఒకవేళ నీ అనుమానం నిజమైతే కేసు గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్‌ చేయ్‌..నీలాంటి ధైర్యం గల ఆఫీసర్‌ కన్ఫీజ్‌లో ఉండకూడదే.. క్లారిటీతో ఉండాలి.. నువ్వు ముందడుగు వేయ్‌..

అప్పు: వేస్తాను కూచీ ముందడుగు వేస్తాను. నా అనుమానం తీరేదాకా..? ఆ తల్లి ఆవేదనకు అర్థం తెలిసే దాకా అందులో ఉన్న నిజానిజాలు గుర్తించేదాకా వెళ్తాను. ఈ కేసును మాత్రం వదిలిపెట్టను..

అంటూ అప్పు కాన్ఫిడెంట్‌ గా చెప్పే సరికి కళ్యాణ్‌ కూడా అప్పును మెచ్చుకుంటాడు. కేరళలో ఉన్న రాజ్‌, కావ్య ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి తమ కష్టాలు చెప్పుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. త్వరగా నయం అయితే హైదరాబాద్‌ వెళ్లిపోవచ్చని అనుకుంటారు. ఇక ఆర్‌ కంపెనీలో రాహుల్‌ డిజైనర్‌ ను తీసుకొచ్చి కావ్య డిజైన్స్‌ మక్కీకి మక్కీ గీయమంటాడు. డిజైనర్ గీస్తుంటాడు.

రాహుల్‌:  ఏయ్‌ ఆగు.. ఏం చేస్తున్నావు నువ్వు

డిజైనర్‌: మీరు ఇచ్చిన ఈ డిజైన్స్‌ గీస్తున్నాను సార్‌

రాహుల్‌: ఈ వర్జినల్‌ డిజైన్‌ లో అక్కడ ఒక డైమండ్‌ ఉంది.. అది ఎందుకు మిస్‌ చేస్తున్నావు నువ్వు

డిజైనర్‌: సార్‌ అది అసలు ప్రాబ్లమే కాదు సార్‌ ఏం పర్వాలేదు సార్‌

రాహుల్‌: నో వర్జినల్‌కు దీనికి ఒక చిన్న తేడా కూడా ఉండకూడదు.. యాజ్‌ టీజ్‌గా ఉండాలి. అలాగే గీయాలి. చిన్న డైమండ్‌ కానీ ముత్యం కానీ అక్కడ ఎలా ఉంటే అలాగే ఉండాలి. సైజు కూడా మారకూడదు

డిజైనర్‌: ఒకేసార్‌ బట్‌ సొంతంగా డిజైన్‌ చేయగలను సార్‌. మీరు సాటిఫై అయ్యే విధంగా కొత్త డిజైన్స్‌ ఇవ్వగలను సార్‌

రాహుల్‌: వద్దు నీ క్రియేటివీ నీ టాలెంట్‌ నాకు వద్దు నాకు జస్ట్‌ ఇది కాఫీ చేసి ఇస్తే చాలు

డిజైనర్‌: ఓకే సార్‌

సతీష్‌: సార్‌ కావ్య గారి డిజైన్స్‌ ను ఇంత కష్టపడి ఎంత కాఫీ కొట్టినా క్లయిట్స్‌ మనవే అని నమ్ముతారా సార్‌..

రాహుల్‌: ప్రపంచం అంతా నమ్మక్కర్లేదు.. ఫస్ట్‌ నా భార్య నమ్మితే చాలు కథను అదే నడిపిస్తుంది.

సతీష్‌: అదేంటి సార్‌

రాహుల్‌: అంతా నేను చూసుకుంటాను నువ్వు సైలెంట్‌గా చూస్తూ ఉండు..

అంటూ స్వప్నకు కాల్‌ చేస్తాడు రాహుల్‌

రాహుల్‌: భోజనం చేశావా..?

స్వప్న: చేయలేదు రాహుల్‌ నేను నీ కోసమే వెయిట్‌ చేస్తున్నాను

రాహుల్‌: నేను ఈ రోజు రాలేను స్వప్న చాలా వర్క్ ఉంది. నువ్వు భోజనం చేయ్‌

అని రాహుల్‌ చెప్పగానే.. నేనే క్యారియర్‌ తీసుకుని ఆఫీసుకు వస్తాను అని స్వప్న ఆఫీసుకు వెళ్తుంది. రాహుల్‌ తానే స్వయంగా డిజైన్స్‌ గీస్తున్నట్టు నాటకం ఆడతాడు. మరోవైపు కేరళలో ఉన్న రాజ్ దగ్గరకు చనిపోయిన వ్యక్తి అన్న వెళ్లి డీటెయిల్స్‌ అడుగుతుంటాడు. రాజ్‌ అతన్ని తిట్టి పంపిచేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!