Brahmamudi Serial Today Episode:  కళ్యాణ్‌ ఆఫీసుకు వెళ్తుంటే అనామిక వస్తుంది. కళ్యాణ్‌ను అవమానిస్తుంది. పదివేల చెక్కు తీసుకొని వచ్చి నా దగ్గర బిల్డప్‌ కొట్టావు ఆరోజు కానీ ఆ పదివేలు మీ ఆయన ఊడిగం చేస్తే వచ్చాయి అని అప్పును తిడుతుంది. నీకున్న గుడ్డి నమ్మకమే కళ్యాణ్‌ నిన్ను తిక్కదాన్ని చేసి ఆడుకునేలా చేసింది అంటుంది.


అప్పు: ఇంకోసారి తిక్క గిక్క అన్నావంటే మర్యాదగా ఉండదు. మోసం చేయడాలు.. వెన్నుపోటు పొడవడాలు నీలాంటి దానికి అలవాటు.


అనామిక: అంతలేదు ఇక్కడ లిరిక్‌ రైటర్‌ దగ్గర కాళ్లు పట్టి టీ పెడితే వచ్చిన చెక్కు అది. ఇప్పుడు చెప్తున్నాను కదా..? నువ్వు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటావు. నిన్ను చూసి నేను ఎప్పుడూ జాలి పడుతూనే ఉంటాను. ఇంకెప్పుడు చిల్లర రాతల చెక్కులు తీసుకొని వచ్చి టెక్కులు పడకు


అని చెప్పి  అనామిక వెళ్లిపోతుంది. ఏంటిది కూచి అని అప్పు అడగ్గానే నువ్వు బాధపడతావని నిజం చెప్పలేదు అంటాడు కళ్యాణ్‌. ఇంకోసారి ఇలా చేయకు ఎవరో వచ్చి చెప్పే కన్నా ఏదైనా నువ్వు చెబితేనే నాకు సంతోషం అంటుంది అప్పు. సరేనంటాడు కళ్యాణ్‌. ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంటే రుద్రాణి వచ్చి చావు నాటకం ఆడమని చెప్తుంది. ఇంతలో కావ్యను తీసుకుని అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు. వాళ్లు ఇంట్లోకి అడుగుపెట్టగానే ధాన్యలక్ష్మీ ఉరి వేసుకోవడానికి ట్రై చేస్తుంది. అందరూ కంగారు వెళ్తారు. ఎందుకిలా చేస్తున్నావని అడుగుతారు.


ధాన్యలక్ష్మీ: నాకు న్యాయం కావాలి. ఈ ఇంటి వారసుడైన నా కొడుక్కి అన్యాయం జరిగింది. ఈ ఇంటి పెద్దలు ఈ కుటుంబ సభ్యులు వాడికి ఎప్పటికీ న్యాయం చేయరని అర్థమైంది. కనీసం నా చావుతోనైనా మీరు మీ నిర్ణయం మార్చుకుంటారని అప్పుడైనా నా కొడుక్కి న్యాయం చేస్తారని..


 అంటూ ఉరి వేసుకోబోతుంటే అపర్ణ వెళ్లి ధాన్యలక్ష్మీని కిందకు లాగి చెంప పగులగొడుతుంది.


అపర్ణ: ఎవరు నీ కొడుక్కి అన్యాయం చేస్తున్నారు. వాడికి అన్యాయం జరిగిందంటే దానికి కారణం నువ్వు.. వాడు బయటకు అడుగుపెట్టాడు అంటే దానికి కారణం నువ్వు.. ఇంత ఆస్థిని వాడు పూచిక పుల్లతో తీసిపడేశాడు అంటే దానికి కారణం నువ్వు.


ఇందిరాదేవి:  అవును నువ్వు నీ కోడలిని కోడలిగా ఒప్పుకుని ఉంటే వాడు బయటకు ఎందుకు వెళ్తాడు. నీ దగ్గర తప్పు పెట్టుకుని నీ అర్థం లేని షరతులు ఒప్పుకోలేదని చచ్చి ఎవరిని సాధించాలి అనుకుంటున్నావు.


రుద్రాణి: అన్ని అపూర్వ వదినకే చేస్తూ… ధాన్యలక్ష్మీకి, చిన్ననయ్యకు ఎవ్వరూ సపోర్టుగా లేకపోతే చావకపోతే ఏం చేస్తుంది.


అపర్ణ: రుద్రాణి నువ్వు ఇంకొక మాట మాట్లాడావు అంటే ఇదే ఉరి నీకు వేసి చంపేస్తాను.. అసలు నువ్వు ఆడదానివేనా..? మేము తిరిగి వచ్చేలోపే ధాన్యలక్ష్మీని ఎంత రెచ్చగొట్టి ఉంటావో మేము ఊహించలేము అనుకుంటావా..? నిజంగానే ధాన్యలక్ష్మీ ప్రాణం పోయుంటే…?


అని అపర్ణ తిట్టగానే ప్రకాష్‌ కూడా ధాన్యలక్ష్మీని తిడతాడు. నువ్వు ఏమైనా చేసుకో కానీ ఆస్థులు పంపకం అనేది జరగదు అంటాడు. ఇందిరాదేవి, రుద్రాణిని తిడుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ అయితే నాకు చావే గతి అనుకుంటూ ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందరూ ధాన్యలక్ష్మీని పక్కకు లాగడానికి ప్రయత్నిస్తుంటారు. వెనక నుంచి అంతా గమనిస్తున్న సీతారామయ్య స్ర్టోక్‌ రావడంతో కింద పడిపోతాడు. అందరూ కంగారు పడుతూ సీతారామయ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!