Brahmamudi Serial Today Episode: లేట్‌ నైట్‌ కూడా పాప మర్డర్‌ కేసు ఫైల్‌ స్టడీ చేస్తుంది అప్పు. అప్పుడే రూంలోకి వచ్చిన కళ్యాణ్‌ ఇంత టైం అయినా కూడా పేపర్స్‌ చూస్తుందేంటి అని అనుకుంటూ..

Continues below advertisement

కళ్యాణ్‌: ఏం చేస్తున్నావు పొట్టి

అప్పు: వన్‌ ఇయర్‌ గా మా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు చేసిన ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టు మొత్తం చదువుతున్నాను కూచి

Continues below advertisement

కళ్యాణ్‌: టైం ఎంత అయిందో తెలుసా..?

అప్పు: ఏం మా అత్తయ్య నీకు చిన్నప్పటి నుంచి టైం చూడటం నేర్పించలేదా..?

కళ్యాణ్‌:  ఏంటి సెటైరా..?

అప్పు: ఏమైంది ఇప్పుడు

కళ్యాణ్‌: నీలో ఉన్న గిల్టీ ఫీలింగ్‌ పోగొట్టడానికే మళ్లీ నువ్వు జాబ్‌ చేయడానికి ఒప్పుకున్నాను అంతేకానీ ఆరోగ్యం పాడు చేసుకోమని కాదు

అప్పు: కేసు మొత్తం స్టడీ చేయకుండా కేసును సాల్వ్‌ చేయడం రాదు కదా కూచి. వీలైనంత త్వరగా అత్తయ్యకు అనుమానం రాకుండా  కేసును కంప్లీట్‌ చేయాలనుకుంటున్నాను

ప్రకాస్‌: ఒరేయ్‌ కళ్యాణ్‌ ఎవరో సంజయ్‌ అంటరా నీ ఫోన్‌ స్విచ్చాప్‌ వస్తుందని నాకు కాల్‌ చేశారు. వెంటనే ఆయనకు కాల్ చేయరా..? (కేసు పేపర్స్‌ చూస్తూ..) ఏంట్రా ఆ పేపర్స్‌   ఏదో పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌.. ప్రోసీజర్‌.. ఇవన్నీ పోలీస్‌ కేసుకు సంబంధించినవి కదా..? అయినా నువ్వు ఇప్పుడు డ్యూటీలో లేవు కదమ్మా..? ఇవన్నీ ఇక్కడెందుకున్నాయి

కళ్యాణ్: అడుగుతున్నాడు కదా కారణం చెప్పు

అప్పు: కారణం నేను ఎలా చెప్పను..? నువ్వే చెప్పు

కళ్యాణ్‌: నేనే చెప్పాలా.. అది నాన్నా

ధాన్యలక్ష్మీ పాలు తీసుకుని వస్తుంది.

ధాన్యలక్ష్మీ : అబ్బా పాలు అడిగి ఇక్కడికి వచ్చారా..? నేను పాలు తీసుకుని ఇళ్లంతా తిరిగాను మీ కోసం. (పేపర్స్‌ చూస్తుంది) ఏంటవి..?  

ప్రకాష్‌: ఇందాకటి నుంచి నేను అదే అడుగుతున్నాను నవ్వుతున్నారు కానీ చెప్పడం లేదు

ధాన్యలక్ష్మీ : ఏవో కేసు ఫైల్స్‌ లా ఉన్నాయి

కళ్యాణ్‌:  చూశావా మా అమ్మ ఎంత ఇంటలిజెంటో..? మా అమ్మ ఇట్టే కనిపెట్టేసింది అమ్మా అవన్నీ మా డైరెక్టర్‌ ఒక పోలీస్‌ స్టోరీ సినిమా చేస్తున్నారు. దానికి సాంగ్స్‌ రాయమని ముందుగా ఈ స్టోరీస్‌ చదవమని ఇచ్చాడు

ప్రకాష్: అవునా చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉందిరా ఇంతకీ స్టోరీ ఏంట్రా మొత్తం చెప్పవా..?

కళ్యాణ్‌ ఏదో కట్టుకథ చెప్తాడు. ప్రకాష్‌ చాలా బాగుంది అంటాడు. ధాన్యలక్ష్మీ మాత్రం తిడుతుంది. వీలైతే ఆ డైరెక్టర్‌ను తన దగ్గరకు తీసుకురమ్మని మంచి ఫ్యామిలీ స్టోరీ చెప్తాను అంటూ ప్రకాష్‌ను తీసుకుని వెళ్లిపోతుంది. రాహుల్‌ తన మేనేజర్‌ సతీస్‌కు ఫోన్‌ చేస్తాడు.

రాహుల్: స్వరాజ్‌ కంపెనీలో ఉన్న నీ మనుషులకు చెప్పి కావ్య, రాజ్‌ వేసిన డిజైన్స్‌ కొట్టేయమను. రేపు సాయంత్రం కల్లా ఆ డిజైన్స్‌ నా టేబుల్‌ మీద ఉండాలి

సతీష్‌: ఓకే సార్‌ ఇప్పుడే చెప్తాను.

ఇంతలో రుద్రాణి వస్తుంది.

రుద్రాణి: భలే ప్లాన్‌ చేస్తున్నావురా కానీ అలా చేస్తే దొరికిపోతావురా రాజ్‌ అడిగితే ఏం చెప్తావు

రాహుల్‌: అవన్నీ నేను చూసుకుంటాను. మరీ గొడవ ఎక్కువైతే కాపాడటానికి స్వప్న ఉంది కదా

రుద్రాణి: ఇప్పుడు నీ మీద నమ్మకం వచ్చింది రాహుల్‌

అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రేణుక ఫోన్‌ చేయడంతో అప్పు బయటకు వెళ్లబోతుంటే కళ్యాణ్‌ అపేస్తాడు. అందరూ హాల్లోనే ఉన్నారు ఎలా వెళ్తావు అని చెప్తాడు. ఇంతలో కేరళ వెళ్తున్న రాజ్‌, కావ్యలను చూసి వారికి సెండాఫ్‌ ఇవ్వడానికి ఎయిర్‌ఫోర్ట్‌కు వెళ్తున్నట్టు చెప్పి వెళ్దాం అంటాడు కళ్యాణ్‌. అలాగే చెప్పి రాజ్‌, కావ్యలతో బయటకు వెళ్తారు. బయట నుంచి కళ్యాణ్‌, అప్పు రేణుక ఇంటికి వెళ్లిపోతారు. రాజ్‌, కావ్య ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!