Brahmamudi Serial Today Episode:  రాజ్ యాడ్‌ ఫిల్మ్‌ ఎలాగైనా అడ్డుకోవాలనుకున్న రాహుల్‌ ఒక డమ్మీ డైరెక్టర్‌ను రాజ్‌ దగ్గరకు పంపించాలి అనుకుంటాడు. అందుకోసం పరోటాలు చేసే వ్యక్తికి డబ్బులు ఇచ్చి రాజ్‌ దగ్గరకు వెళ్లి నాటకం ఆడమని చెప్తాడు. ఆ వ్యక్తి సరే అంటాడు. ఆ నాటకంలో అతని పేరు మణి వర్మ అని చెప్తాడు. మరుసటి రోజు రాజ్‌ నిద్ర లేచి రాగానే కిచెన్‌లో ఉన్న కావ్య గుడ్‌ మార్నింగ్‌ చెప్తుంది. రాజ్‌ కూడా గుడ్‌ మార్నింగ్‌ చెప్తూ కావ్య దగ్గరకు వెళ్తాడు.

Continues below advertisement

కావ్య:  ఏవండి కాఫీ తాగుతారా..?

రాజ్: కాఫీ గీఫీ ఏమీ వద్దు కానీ కళావతి నిన్న నేను చెప్పింది ఏమి ఆలోచించావు

Continues below advertisement

కావ్య:  దేని గురించి అండి

రాజ్: ఏంటి కళావతి అప్పుడే మర్చిపోతే ఎలా మన యాడ్‌ ఫిల్మ్‌లో  మోడల్‌ గా నటించాలని చెప్పాను కదా..?

కావ్య: ఏవండి.. చూడండి.. ఆ మోడలింగ్‌ నా వల్ల కాదండి.. మీకు నిన్నే చెప్పాను కదా

రాజ్: కళావతి ఫ్లీజ్‌ టైం లేదు కళావతి.. ఈ ఒక్కసారి ఓకే చెప్పు ఫ్లీజ్‌ ఇంకా చాలా పనులు ఉన్నాయి.. కాదనకు కళావతి

కావ్య: నాకు ఇష్టం లేదు.. నన్ను ఎక్కువ బలవంతం చేయకండి

ఇందిరాదేవి: రేయ్‌ ఆగరా..? చేయను చేయను అంటుంటే.. దాని వెనకాల పడతావేంట్రా..

రాజ్: నాన్నమ్మ నువ్వు ఆగు. నాకు మోడల్‌ దొరక్కా నేను కష్టపడుతుంటే.. మధ్యలో నువ్వు

ఇందిరాదేవి: మోడల్‌  నీ ఎదురుగానే ఉంది కదరా..?

రాజ్‌: నా ఎదురుగ ఉందా..? ఏది ఎక్కడ ఉంది…?

ఇందిరాదేవి: బాగా చూడరా..? నన్ను చూడు.. నేను మోడల్‌ గా పనికిరానా.? నన్ను వాడుకోరా..?

అని చెప్పగానే.. అందరూ నవ్వుతారు. దీంతో ఇందిరాదేవి తన దగ్గర మంచి కాన్సెప్ట్‌ ఉందని సీతారామయ్యతో కలిసి యాక్ట్‌ చేసి చూపిస్తుంది.

అపర్ణ: అత్తయ్య నేను చెప్పలేదా.? మీ కాన్సెప్ట్‌ వాడికి నచ్చదని.. మీదంతా ఓల్డ్‌ కాన్సెప్ట్‌ ఇప్పుడు చూడు మేము చూపిస్తాము..

అంటూ అపర్ణ కూడా యాక్టింగ్‌ చేయబోతుంటే.. రాజ్‌ ఇరిటేటింగ్‌ గా చూస్తుంటాడు.

అపర్ణ: అవును రాజ్‌ చూడు మా కాన్సెప్ట్‌ చాలా ట్రెండీగా ఉంటుంది. మాతో యాడ్‌ చేస్తే.. మన కంపెనీ సేల్స్‌ ఎక్కడికో వెళ్లిపోతాయి.

సుభాష్‌తో కలిసి అపర్ణ కాన్సెప్ట్‌ చేస్తుంది.

అపర్ణ: ఎలా ఉంది నాన్న మా కాన్సెప్ట్‌

రాజ్‌: మమ్మీ ఏమైందే మీకు ఇలా బెదరగొడుతున్నారేంటి..?  నా కంపెనీని ఉంచుతారా..? మూయిస్తారా..?

ప్రకాష్‌: రేయ్‌ రాజ్‌ వీళ్లందరూ నిన్ను దివాలా తీయించడానికే పూనుకున్నారురా..? ఒక్కసారి నా కాన్సెప్ట్‌ వింటావా..? దిమ్మ తిరిగ పోద్ది

రాజ్‌: బాబాయ్‌ నువ్వు కూడా కాన్సెప్ట్‌ రెడీ చేశావా

ప్రకాష్: అవున్రా.. ఒక్కసారి విను.. అదిరిపోతుంది మన కాన్సెప్ట్‌..

రాజ్‌: సరే చెప్పు బాబాయ్‌

అనగానే.. ప్రకాష్‌ కు కాన్సెప్టు గుర్తు రాక తల పట్టుకుంటాడు. తర్వాత రాజ్‌, కావ్యను బతిమాలి ఒప్పిస్తాడు. ఇంతలో రాహుల్‌ అరైంజ్‌ చేసిన మణివర్మ వస్తాడు. రాగానే ఇంట్లో హడావిడి చేస్తుంటాడు.

రుద్రాణి: ఒరేయ్‌ రాహుల్ పరోటాలు వేసుకునే వాడిని తీసుకొస్తానని చెప్పావు.. వీడేంటి ఇన్ని కబుర్లు చెప్తున్నాడు

రాహుల్‌: స్టేజీ ఆర్టిస్ట్‌ మమ్మీ అందుకే కొంచెం ఓవర్ యాక్టింగ్‌ చేస్తున్నాడు.

రుద్రాణి: వాడు ఎలా చేస్తే మనకేంటి ఏదో ఈ యాడ్‌ కంప్లీట్‌ అవ్వకుండా చూడటమే కదా మనకు కావాల్సింది

అంటుంది. తర్వాత మణివర్మ ఫెర్మామెన్స్‌ చూసి కావ్య, రాజ్ కూడా అనుమానిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!