Brahmamudi Serial Today Episode: తమ ఆఫీసులో డిజైన్స్‌ కొట్టేసి రాహుల్‌కు ఇచ్చిన వ్యక్తిని ప్లాన్‌ వేసి మరీ  పట్టుకుంటారు. దీంతో కోపంగా రాజ్‌ ఆ వ్యక్తిని కొట్టబోతుంటే వద్దని కావ్య ఆపేస్తుంది.

Continues below advertisement

కావ్య: ఏవండి ఇలాంటి వాళ్లను కొట్టడం కాదు.. పోలీసులకు అప్పగించండి

రాజ్‌: మేనేజర్‌ ఇతన్ని పోలీసులకు పట్టించండి

Continues below advertisement

మేనేజర్‌ వచ్చి అతన్ని తీసుకెళ్లిపోతాడు.

కావ్య: మీకు తెలియకుండా కొత్త డిజైన్స్‌ వేస్తానా..? శ్రీవారు

రాజ్‌:  పర్వాలేదు ఇంటి దొంగలను పట్టడంలో నన్ను మించిపోయావు

కావ్య: ఎంతైనా మీ పాద దాసిని కదా అందుకే ఇలా చేశాను

రాజ్‌: సరే ఇక న్యూ డిజైన్స్‌ గురించి ఆలోచిద్దామా

ఒకే అంటూ ఇద్దరు డిజైన్స్‌ వేస్తుంటారు. మరోవైపు అప్పు రేణుక భర్త అశోక్‌ను స్టేషన్‌ కు పిలిపిస్తుంది. అశోక్‌ వస్తాడు.

అశోక్‌: మేడం రమ్మన్నారంటా…?

అప్పు: మీకో గుడ్‌ న్యూస్‌

అశోక్‌: ఈ కేసు క్లోజ్‌ చేస్తున్నారా..?

అప్పు: కేసు క్లోజ్‌ చేస్తే మీకు గుడ్‌ న్యూస్‌ ఎలా అవుతుంది

అశోక్‌: అంటే అది మేడం సీఐ గారు మీకు కేసు క్లోజ్‌ చేయమన్నారు కదా..? మాకు బ్యాడ్‌ న్యూసే కానీ మీకు గుడ్‌ న్యూసే కదా

అప్పు: మీ పాప చనిపోలేదు.. బతికే ఉంది

అశోక్‌: వాట్‌..

అప్పు: అదేంటి పాప బతికే ఉందని చెబితే ఎగిరి గంతేయాల్సింది పోయి అలా షాక్‌ అవుతున్నారేంటి

అశోక్‌: అంటే మేడం ఇప్పటి దాకా మీరే కదా మేడం పాప చనిపోయిందని తేల్చేశారు. మీరు ఉన్నట్టుండి పాప బతికే ఉందని చెప్పేసరికి ఇదిగో ఇలా షాక్‌ అయ్యాను.. అప్పుడే మీ డిపార్ట్‌మెంటే కదా పోస్ట్‌మార్టం రిపోర్టులో చనిపోయిందని చెప్పారు..

అప్పు: అప్పుడు ఎవరో పోస్ట్ మార్టం రిపోర్ట్‌ ఎవరో తప్పుగా ఇచ్చారు.. మళ్లీ నేను రీపోస్ట్‌ మార్టం చేయించాను.. అందులో మీ పాప చనిపోలేదని తేలింది.

అనగానే అశోక్‌ అనుమానంగా మాట్లాడి వెల్లిపోతాడు. అశోక్‌ ను అబ్జర్వ్‌ చేయమని కానిస్టేబుల్‌కు చెప్తుంది అప్పు. కానిస్టేబుల్ సరే అంటాడు. ఇక ఇంటికి వెళ్లిన కావ్య గార్డెన్‌లో కూర్చుని డిజైన్స్‌ వేస్తుంటే.. రాజ్‌ కాపీ తీసుకుని వస్తాడు.

రాజ్‌: వేడి వేడి కాఫీ

కావ్య: నేను సీరియస్‌గా డిజైన్స్‌ వేస్తుంటే.. మీరు కాపీ అంటారా..?

రాజ్‌: నా కోసం కష్టపడుతున్న నా శ్రీమతికి ఈ మాత్రం సేవ చేయలేనా..?

కావ్య: అవును కానీ శ్రీవారు ఈ డిజైన్‌ ఎలా ఉందో చెప్పండి.

రాజ్‌: అబ్బా చాలా చెండాలంగా ఉంది. ఈ మాత్రం డిజైన్స్‌ శృతి కూడా వేస్తుంది.

అనగానే కావ్య కోపంగా అయితే శృతితోనే డిజైన్స్‌ వేయించుకోండి నాకు ఇక చెప్పకండి అంటూ అలుగుతుంది. దీంతో రాజ్‌, కావ్యను బుజ్జగిస్తాడు. ఇద్దరూ మళ్లీ సరదాగా మాట్లాడుతుంటారు. అంతా రాహుల్‌ పై నుంచి గమనిస్తుంటాడు. కావ్య మళ్లీ డిజైన్స్‌ వేస్తుంటుంది.

రాహుల్‌: ( మనసులో) ఈ రెండు రోజులు నిన్ను అడ్డుకుంటే చాలు నాకు రెండో విజయం కూడా దక్కుతుంది. ఈ రాహుల్ ఏం చేస్తాడో చూస్తూ ఉండు..

కావ్య: ఏవండి ఇది ఎలా ఉందో చూడండి

రాజ్‌:  అద్బుతంగా ఉంది.. అదీ నా కళావతి అంటే సూపర్‌గా వేశావు.. ఇది డిజైన్‌ చేయించి మోడల్‌తో యాడ్‌ షూట్ చేయిస్తాను చూడు ఇక అదిరిపోతుంది

అంటూ రాజ్‌ చెప్పగానే.. కావ్య నవ్వుతుంది.  తర్వాత రాజ్‌ యాడ్‌ ఫిల్మ్‌ చేయాలనుకుంటే అందుకు కోసం రావాల్సిన మోడల్‌ను రాకుండా రాహుల్‌ అడ్డుకుంటాడు. యాడ్‌ షూటింగ్‌ వాయిదా వేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్లిన రాజ్‌, యాడ్‌ షూటింగ్‌ గురించి టెన్షన్‌ పడుతుంటే కావ్య వచ్చి ఏమైందని అడుగుతుంది. దీంతో రాజ్‌ కోపంగా కావ్యను తిడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!