Brahmamudi Serial Today Episode:   ఇంట్లో అందరూ తనను డబ్బులు అడుగుతున్నారని.. ఇలా ఇచ్చుకుంటే పోతే ఖజానా దివాలా తీస్తుందని కావ్య వెళ్లి అపర్ణతో బాధపడుతుంది. ఈ బాధ్యతలు మోయడం నా వల్ల కాదని వాపోతుంది. దీంతో అయితే ఎవరితో ఎలా ఉండాలో కోడలుకు చిట్కాలు చెప్తుంది అపర్ణ. నువ్వు ఓడిపోయి వెనకంజ వేస్తే అది నాకు అవమానం.. ధైర్యంగా నిలబడు నీ వెనక నేనున్నాను అంటూ తాళాలు కావ్యకు ఇచ్చి పంపిస్తుంది అపర్ణ. మరోవైపు రాహుల్‌ రూంలో ఆలోచిస్తుంటాడు.


రాహుల్‌: ఈ ఇంట్లో డబ్బులు సంపాదించడం ఇంత ఈజీ అని నాకు ఇంత వరకు తెలియదు. తాతయ్య పేరు చెప్పి అడిగితే డబ్బులు వస్తాయనుకుంటే.. ఎప్పుడో ఈ పని చేసేవాడిని


అనుకుంటూ  తన ఫ్రెండ్‌కు ఫోన్‌ చేస్తాడు. తమ ఇంటికి వచ్చి డబ్బులు అడగమని చెప్తాడు. సరే అంటాడు రాహుల్‌ ఫ్రెండ్‌ అంతా విన్న స్వప్న లోపలికి వస్తుంది. స్వప్న :  ఇంత దద్దమ్మవు నన్నెలా పడగొట్టావు.. అసలు నిన్ను ఎలా తిట్టాలో అర్థం కావడం లేదు.


రుద్రాణి: నా కొడుకేం తెలివితక్కువ వాడు కాదు.. ఇప్పుడు వాడు జీనియస్‌


స్వప్న: అవునా నీ కొడుకు ఏం చేశాడో తెలిస్తే జీనియసా కాదా నువ్వే డిసైడ్‌ చేస్తావు


రుద్రాణి: ఏం చెశాడో ముందు చెప్పు


స్వప్న:  ఆ పాడు ఆలోచన నేనెందుకు చెప్పడం మీ కొడుకునే అడగండి


అని స్వప్న చెప్పగానే రాహుల్‌ తన ప్లాన్‌ గురించి చెప్తాడు. రుద్రాణి కూడా రాహుల్‌ను తిడుతుంది. రాజ్‌ హాల్లో నిల్చుని ఆలోచిస్తుంటాడు. కావ్య వచ్చి పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. కావ్యను పిలుస్తాడు రాజ్‌.


రాజ్‌: ఏంటో నేను ఇక్కడ పిలుస్తుంటే అక్కడ చూస్తున్నావు..?


కావ్య: ఏం లేదు ఇక్కడ కూడా మీరు గీత గీసారేమో.. నేను పొరపాటున దాటానేమో అని చూస్తున్నాను


రాజ్‌: ఏంటి జోకా.. చెట్టంత మనిషి ఎదురుగా ఉన్నాడు. పొద్దునే లేచాడు.. రెడీ అయ్యాడు. వాడి ముఖం మీద కాఫీ అయినా పడేయాలి అని తెలియదా..?


కావ్య: ముఖం మీద కాఫీ వేయడం నాకు రాదండి. రాత్రి కాఫీ ఇస్తే అరిచారు.. ఇప్పుడు ఏమంటారో అని ఇవ్వలేదు.


రాజ్‌:  అంటే ఎప్పుడూ నేను తిట్టే వాడిలా ఉంటానా..? ముందు వెళ్లి కాఫీ తీసుకురాపో


అని రాజ్‌ ఆర్డర్‌ వేయగానే కావ్య కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. ఇంతలో రాజ్‌ ఫ్రెండ్‌ ఇంటి బయట నిలబడి ఫోన్‌ చేస్తాడు. రాజ్‌ బయటకు వెళ్తాడు. వంద కోట్లకు షూరిటీ తీసుకున్న వాడు బతికే ఉన్నాడని బ్యాంకాక్‌లో అడ్రస్‌ మార్చి బతుకుతున్నాడని వాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదని చెప్తుంటే కావ్య కాఫీ తీసుకుని వస్తుంది.


రాజ్‌: నీకసలు బుద్ది ఉందా.. ఇక్కడ ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే.. ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. వచ్చి డిస్టర్బ్‌ చేయడమేనా వెళ్లు..


కావ్య :  సారీ అండి..


అపర్ణ: రాజ్‌


ఫ్రెండ్‌: నేను తర్వాత ఆఫీసుకు వచ్చి కలుస్తాను రాజ్‌


అపర్ణ: పరాయి మగవాడి ముందు నీ భార్యను అవమానిస్తావా..? ఇష్టం వచ్చినట్టు అరుస్తావా..?   నీ చదువు నీకు ఇదే నేర్పిందా..?    


రాజ్‌: సారీ అమ్మా అనుకోకుండా అరిచేశాను.


అపర్ణ: ఆ మాట నాకు కాదు చెప్పాల్సింది నీ భార్యకు..


రాజ్‌:  సారీ కళావతి మమ్మీ చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. నిజంగానే అలా మాట్లాడి ఉండకూడదు


అని రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత రాజ్‌ రూంలోకి వెళ్లిన కావ్య మీరు దేని గురించో బాగా ఆలోచిస్తున్నారు ఏంటది అని అడుగుతుంది. ఏం లేదని కావ్యను తిట్టి పంపిస్తాడు రాజ్‌. ఇంతలో కింద బ్యాంకర్లు వచ్చి సీతారామయ్య ఇచ్చిన షూరిటీ గురించి చెప్పి మీ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నాము అనగానే అందరూ షాక్‌ అవుతారు. రుద్రాణి, ధాన్యలక్ష్మీ కోపంగా సీతారామయ్యను తిడుతుంటారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!