Brahmamudi Serial Today Episode: అంజలి కేసు విషయంలో అప్పు చేయించిన రీ పోస్ట్‌మార్టం ఫైల్ తెప్పించుకుని చూస్తుంది అప్పు.. ఫైల్ లో ఉన్న విషయాలు చూసి షాక్ అవుతుంది. అప్పుడే సీఐ, అప్పు దగ్గరకు వస్తాడు.
సీఐ: అపూర్వ ఏంటి నిన్న ఎమ్మెల్యే గారి అల్లుడి కేసు విషయంలో వారి ఇంటికి వెళ్లలేదంట
అప్పు: సార్ నేను రేణుక గారి పాప కేసు విషయంలో కొంచెం బిజీగా ఉన్నాను సార్
సీఐ: నీకెలా చెప్పాలి అపూర్వ.. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..? ఆ పాప కేసు క్లోజ్ చేయమన్నాను.. ఎమ్మెల్యే గారి అల్లుడి కేసు టేకప్ చేయమన్నాను.. అయినా చెవికి ఎక్కించుకోవడం లేదు.. నీకు సుపీరియర్ అంటే లెక్కలేదా..? లేదా ఉద్యోగం చేయడం ఇంట్రస్ట్ లేదా..?
అపూర్వ: అది కాదు సార్ నేను చెప్పేది వినండి
సీఐ: ఏంటి వినేది..? ఇంకా ఎన్నాళ్లనీ ఇలా అర్థం పర్థం లేని కేసు పట్టుకుని వేలాడతావు..
అపూర్వ: రేణుక పాప కేసు అర్థం పర్థం లేని కేసు కాదు సార్.. ఆలోచించాల్సిన కేసు.. ఒక్కసారి ఇది చూడండి..
ఫైల్ చూపిస్తుంది.
సీఐ: ఏంటిది..?
అప్పు: సంవత్సరం క్రితం డ్రైనేజీలో శవంగా దొరికిన ఆ పాపకు చెందిన పోస్ట్‌మార్టం రిపోర్ట్.. మళ్లీ రీ పోస్ట్ మార్ట్ చేయిస్తున్నానని చెప్పాను కదా..? ఆ రిపోర్ట్ వచ్చాయి.. ఒక్కసారి చూడండి.. చనిపోయిన పాప డీఎన్‌ఏకి రేణుక డీఎన్‌ఏకి మ్యాచ్ కావడం లేదు సార్.. వాళ్లిద్దరికీ ఏ సంబంధం లేదు..
సీఐ: కానీ ఆరోజు
అప్పు: గతంలో ఎవరో ఫేక్ ఫోస్ట్‌మార్టం చేయించారు. రేణుక పాప చనిపోయిందని అబద్దం చెప్పించారు సార్....
సీఐ: అంటే ఆ పాప
అపూర్వ: ఎక్కడుందో తెలియదు కానీ కచ్చితంగా బతికే ఉంది. సంవత్సర కాలం నుంచి తన తల్లి వస్తుందని.. తనను కాపాడుతుందని ఎదురుచూస్తూనే ఉంటుంది. దయచేసి ఈ కేసు విషయంలో నన్ను ఆపకండి సార్.. ఆ పాప ఎక్కడున్నా వెతికి పట్టుకుని రేణుకకు అప్పగించే బాధ్యత నాది సార్..
సీఐ: వెల్‌డన్ అపూర్వ.. అసలు విషయమే లేని కేసని క్లోజ్ చేశాక నువ్వు ఈ కేసును టేకప్ చేసి పురోగతి సాధించావు.. వీలైనంత త్వరగా ఆ పాపను పట్టుకుని ఈ కేసును క్లోజ్ చేయ్
అని చెప్పి సీఐ వెళ్లిపోతాడు. ఇక రాహుల్ అవార్డు ఫంక్షన్‌లో ఉన్న రాజ్, కావ్య షాక్ అవుతారు. అక్కడ తాము వేసిన డిజైన్స్ రాహుల్ వేశాడని వీడియో రావడంతో ఉలిక్కిపడతారు. దీంతో రాజ్ కోపంగా రాహుల్‌ను తిడతాడు. ఇంతలో తాను అవార్డు రాజ్ చేతుల మీదుగా అందుకోవాలని రాహుల్ కోరగానే కోపంగా వెళ్లి రాహుల్‌కు అవార్డు ఇచ్చి బయటకు వస్తారు రాజ్, కావ్య. మరోవైపు ఇంట్లో అప్పుకు భోజనం తీసుకెళ్తున్న ధాన్యలక్ష్మీని కళ్యాణ్, ప్రకాష్ కలిసి బురిడి కొట్టిస్తారు. ప్రకాష్ దుప్పటి కప్పుకుని పడుకుని అప్పులా నటిస్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ భోజనం టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతుంది. రాహుల్ మీద కోప్పడుతున్న రాజ్ దగ్గరకు స్వప్న వచ్చి ఎమోషనల్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!