Brahmamudi Serial Today Episode:   కేరళ ట్రీట్‌మెంట్‌కు వెళ్లిన రాజ్‌, కావ్యలకు అక్కడి ఆయుర్వేద గురువు శుభవార్త చెప్తాడు. కావ్యకు 90 శాతం నయం అయిందని.. వాళ్లు హైదరాబాద్‌ వెళ్లిపోవచ్చని చెప్తాడు. దీంతో రాజ్‌, కావ్య హ్యాపీగా ఫీలవుతారు.

Continues below advertisement

గురువు: ఇంకో నెల రోజులు క్రమం తప్పకుండా నేను ఇచ్చే కషాయాలు, గుళికలు తీసుకోవాలి. నూనెతో మర్దన చేయాలి. ఒక్క రోజు కూడా గ్యాప్‌ రానీయకూడదు.. అప్పుడే పూర్తి ఫలితం వస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి

రాజ్‌: లేదు గురువు గారు కలలో కూడా నిర్లక్ష్యం చేయము.. ఇన్ని రోజులు మేము చాలా కంగారు పడ్డాం. నీ భార్యకు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలో తెలియక.. ఎక్కడ ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలో తెలియక చాలా బాధపడ్డాం.. దినం దినం ఒక గండంలా గడపాల్సి వచ్చింది. కానీ మీ దగ్గరకు వచ్చాక నా భార్యకు ఇక ఏమీ కాదన్న ధీమా కలిగింది. ఇప్పుడు మీ మాటలు విన్నాక ఆ దేవుడే మీ రూపంలో ఇదంతా చేశాడు అనిపిస్తుంది మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము చాలా థాంక్స్‌ గురువు గారు

Continues below advertisement

గురువు: వైద్యుడిగా ప్రాణాలు నిలబెట్టడం మా బాధ్యత ఆ అమ్మవారు మీ వైపు ఉన్నారు అందుకే అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఇక మీరు బయలుదేరవచ్చు

అని చెప్పగానే..రాజ్‌, కావ్య అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు సుభాష్‌ కోపంగా చూస్తుంటే.. అపర్ణ వస్తుంది.

అపర్ణ: ఏవండి ఎప్పుడు మీలో ఇంత ఆవేశం చూడలేదు.. ఎందుకు రాహుల్‌ మీద చేయి చేసుకున్నారు

సుభాష్‌: ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా రాహుల్ వల్ల మన కంపెనీకి పది కోట్లు లాస్‌ వచ్చింది కాబట్టి. అది కూడా రాజ్‌ లేని టైంలో నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్న టైంలో జరిగింది కాబట్టి..

అపర్ణ: రాహుల్‌ మీద మనకు నమ్మకం లేకపోవచ్చు అండి కానీ స్వప్న చెప్పిన మాటలు చూస్తుంటే.. రాహుల్ తప్పు చేయలేదోమో అనిపిస్తుంది.

సుభాష్‌: నిజంగా వాడు తప్పు చేయకపోతే  మన కంపెనీ క్లయింట్స్‌ తో వెళ్లి ఎందుకు మాట్లాడాలి.. వాడి దగ్గర డిజైన్స్‌ ఉన్నాయని ఎందుకు చెప్పాలి. వాడికి నిజంగా బిజినెస్‌ చేయాలని ఉంటే వెళ్లి కొత్త క్లయింట్స్‌ ను చూసుకోవచ్చు కదా..? మన క్లయింట్స్‌తో ఎందుకు మాట్లాడాలి. వాడేమో మనకు బిజినెస్‌ కాంపిటీటర్‌ అయినట్టు

అపర్ణ: మరి ఈ విషయం వెళ్లి రాహుల్‌ నే అడగొచ్చు కదా

సుభాష్‌: ఎలా అడగమంటావు అసలు కావ్య వేసిన డిజైన్స్‌ దొంగిలించలేదు.. అంటున్నాడు పైగా వాడికి స్వప్న మద్దతుగా నిలబడింది. మొదటి తప్పునే మనం ప్రూవ్‌ చేయలేకపోయాము అలాంటిది ఇప్పుడు క్లయింట్స్‌ను ఎందుకు లాక్కున్నావు అని అడిగితే వాళ్లే వచ్చారు అంటాడు. దానికి మళ్లీ రుద్రాణి గొడవ చేస్తుంది. అప్పుడేం సమాధానం చెప్పాలి

అపర్ణ: మరి ఇప్పుడేం చేస్తారు

సుభాష్‌: లైఫ్‌లో ఫస్ట్‌ టైం ఓటమి చూశాను అపర్ణ అది కూడా నా ప్రమేయం లేకుండా… వదిలిపెట్టను దీని వెనక అసలు ఏం  జరిగింది.. ఎవరెవరు ఉన్నారో తెలుసుకోకుండా వదిలిపెట్టను

అపర్ణ: పోనీ రాజ్‌ కు ఏమైనా చెబుదామా

సుభాష్‌: వద్దులే అనవసరంగా వాళ్లను ఎందుకు డిస్టర్బ్‌ చేయడం తప్పు ఎక్కడ జరిగిందో నేనే కనుక్కుంటాను

అని చెప్పగానే ప్రెష్‌ అయి రండి టిఫిన్‌ చేద్దురు అంటూ అపర్ణ లోపలికి వెళ్తుంది. మరోవైపు అప్పు తన కేసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడగ్గానే… రేణుక వాళ్ల పాప అంజలి గురించి ఆలోచిస్తున్నానని చెప్తుంది. నువ్వు ఎక్కువగా ఆ కేసు గురించి ఆలోచించొద్దు నీ కడుపులో ఉన్న మన బిడ్డ హెల్త్‌ గురించి ఆలోచించావా అంటాడు. తర్వాత రాజ్‌, కావ్యల రూంలో కావ్యకు ఇంకా హెల్త్‌ బాగాలేదన్న రిపోర్ట్స్‌ రుద్రాణికి దొరుకుతాయి. అవి తీసుకుని వెళ్లి హాల్లో అందరికీ చెప్తుంది. నిజం తెలిసి అందరూ బాధపడుతుంటే రాజ్‌, కావ్య వస్తారు. వాళ్లను అపర్ణ నిజం అడుగుతుంది. రాజ్‌ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. కేరళ వెళ్లిన విషయం అక్కడ కావ్య ట్రీట్‌మెంట్‌ తీసుకున్న విషయం.. ప్రాబ్లం సాల్వ్‌ అయిన విషయం మొత్తం చెప్తాడు. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!