Nindu Manasulu Serial Today Episode ప్రేరణకి సిద్ధూ కాల్ చేస్తాడు. మంజు ప్రేరణని కోప్పడినందుకు సారీ చెప్పి తనని పెళ్లి పనులకు దూరంగా ఉండమని చెప్పిందని ప్రేరణతో చెప్తాడు. ప్రేరణ సిద్ధూతో ఏ కష్టం వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను.. నా అనుకున్న వాళ్లు ఏ పరిస్థితిలో నేను వదలను.. నువ్వు మాత్రం ఓడిపోతా అని అనుకోవద్దు.. మనం పెళ్లికి దూరంగా ఉండాలి అనే గణ ఇలా ప్లాన్ చేశాడు.. నువ్వు పెళ్లి పనుల్లో కచ్చితంగా ఉండాలి అని అంటుంది. 

Continues below advertisement

అందరూ ఆవేశంగా ఉన్నారు కదా నువ్వు కూడా అంతే ఆవేశపడితే ప్రాబ్లమ్ ఇంకా పెద్దది అవుతుంది. నువ్వు సమయమనంతో ఉండు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఇద్దరం కలిసి ఎదుర్కొందాం అని చెప్తుంది. ఐశ్వర్య విశ్వనాథ్ ఇంటికి వస్తుంది. విశ్వనాథ్‌తో మీతో కొంచెం మాట్లాడాలి సార్ అని రంజిత్‌ని దూరం పెట్టడం కరెక్టేనా అని అడుతుంది. మీ ప్రేమకి మీ ఆప్యాయతకి దూరమై అన్నీ కోల్పోయి బతుకుతున్నాడు అని సర్ది చెప్పాలని చూస్తుంది. విశ్వనాథ్ ఐశ్వర్య మీద కోప్పడతాడు. నిన్ను వాడే పంపాడా అంటే లేదు సార్ నాకు నేనే వచ్చాను అంటుంది. వాడేం చేశాడో నీకు తెలుసా అని విశ్వనాథ్ అంటాడు. ఏం చేస్తే ఏంటి సార్ తప్పు చేసిన వాళ్లని క్షమిస్తేనే కదా సంస్కారం అంటుంది. 

విశ్వనాథ్ ఐశ్వర్య మీద అరుస్తాడు. ఏం తెలుసు అని మాట్లాడుతున్నావ్.. నా సర్వీస్‌లో సగం వయసు లేని నువ్వు నాకు సంస్కారం గురించి చెప్తావా.. తప్పు చేస్తే క్షమించొచ్చు కానీ వాడు నేరం చేశాడు.. వాడిని క్షమించే ప్రసక్తే లేదు.. పో అని ఐశ్వర్యని పొమ్మని అంటాడు. మా అక్క లాంటి ఎంతో మందికి చదువు చెప్పారు.. పెద్ద ఉద్యోగాలు చేశారు.. కానీ మీరు తల్లీకొడుకుల్ని వేరు చేస్తే అవన్నీ వృథా సార్.. ఇప్పటికైనా రంజిత్ సార్‌కి క్షమించండి అని అంటుంది. 

Continues below advertisement

ఐశ్వర్య వెళ్లిపోగానే విశ్వనాథ్ రంజిత్‌కి కాల్ చేస్తాడు. రంజిత్ నాన్న అనగానే ఎవర్నా నీకు నాన్న ఆ నాన్న ఎప్పుడో చనిపోయాడు.. మాకు దగ్గర అవ్వాలి అని మధ్యవర్తిని పంపిస్తావా.. ఆ ప్రేరణ చెల్లి నా తప్పు సరిదిద్దుకోమని నాకు చెప్తుంది. నా దగ్గర సంస్కారం గురించి మాట్లాడుతుంది. నువ్వు ఎంత మందిని పంపినా నా మనసు మారదు.. నా గుండె తడి ఆరదు.. నిన్ను క్షమించను అని అంటాడు. 

రంజిత్ ఐశ్వర్య ఇంటికి రాగానే ఐశ్వర్య ఆగు అని అరుస్తాడు. ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ అంటాడు. ఐశ్వర్య ఏం మాట్లాడదు. నువ్వు విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్లావా అని ఐశ్వర్యని అడుగుతాడు. ఐశ్వర్య రంజిత్‌లో విశ్వనాథ్ గారు ఏంటి ఆయన మీ నాన్న గారు అని అంటుంది. ప్రేరణ, ఇందిర షాక్ అయిపోతారు. మీ నాన్న గారి ఇంటికి వెళ్లాను.. వెళ్తే ఏంటి అని ఐశ్వర్య అంటుంది. ఎందుకు వెళ్లావ్ అక్కడ ఏం మాట్లాడావ్ అని రంజిత్ అడుగుతాడు. మీ బాధ చూడలేక వెళ్లానని అంటుంది. నేను చెప్పానా నీకు బాధ పడుతున్నాను.. వాళ్ల కోసం వెళ్లమన్నానా అని అరుస్తాడు. నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరు అని అడుగుతాడు. నా గతం నీకు సరదా ఏమో కానీ నాకు బరువు.. మోయలేని బరువు.. అయినా మోస్తూనే ఉన్నాను.. కానీ ఎవరికీ నా కళ్లలో కనిపించనివ్వలేదు.. కానీ నువ్వు ఈరోజు ఆయన దగ్గరకు వెళ్లి నన్ను వెధవని చేశావ్.. నన్ను తల దించుకునేలా చేశావ్.. అని అంటాడు.

ప్రేరణ, ఇందిర సారీ చెప్తారు. దాంతో రంజిత్ వెళ్లిపోతాడు. ప్రేరణ ఐశ్వర్యని తిడుతుంది. కేఫ్ ఓపెనింగ్ రోజే నాకు వాళ్ల మధ్య ఏదో ఉందని అర్థమైంది కానీ నేను నీకు చెప్పానా.. నేను విశ్వనాథ్ గారి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నా అని రంజిత్‌ గారికి తెలుసు కానీ నాతో ఎప్పుడైనా మాట్లాడారా. తండ్రీకొడుకులు దూరంగా ఉన్నారు అంటే ఏదో సమస్య అయింటుంది. దానిలో తల దూర్చకూడదు అని అంటుంది. ఇద్దరినీ కలపాలి అనుకున్నా అందులో తప్పేముంది అందరూ నన్నే అంటున్నారు అని ఐశ్వర్య వెళ్లిపోతుంది.

ఈశ్వరి వర్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గణ ఇంటికి రాగానే ఎక్కడి నుంచి వస్తున్నావని అంటుంది. వర్ష ఎవరు అని అడుగుతుంది. తను నిజంగా నా ఫ్రెండే అని అంటాడు. దానికి అందరిలో అనుమానం వచ్చేలా ప్రవర్తించావ్‌.. ఆ ఇంట్లో వాళ్లు నీ మాట నమ్ముతారేమో కానీ నేను నీ తల్లిని నిజం చెప్పు నీకు ఆ అమ్మాయికి ఏమైనా అని అడుగుతుంది. నీ కొడుకు నిప్పు అమ్మా అని గణ అంటాడు. తల్లికి ఏదోలా సర్ది చెప్తాడు. ఇంతలో సాహితి కాల్ చేస్తుంది. సాహితి కూడా వర్ష గురించి అడుగుతుందేమో అని కంగారు పడతాడు. ఇంతలో సాహితి గణతో మా అమ్మ అన్నయ్యని పెళ్లి పనులకు దూరంగా ఉండమని చెప్పిందని అంటుంది. గణ చాలా సంతోషపడతాడు. పైకి మాత్రం నువ్వు బాధ పడకు నేను ఏదో ఒకటి చేసి మీ అన్నయ్య ఉండేలా చేస్తా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.