Brahmamudi Serial Today Episode: కళ్యాణ్‌, అప్పు పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ధాన్యలక్ష్మీ బాధపడుతుంది. నా కన్నకొడుకే నాకు ద్రోహం చేశాడని.. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందని ఫీలవుతుంది. రుద్రాణి కూడా కనకం కుటుంబాన్ని తిడుతుంది. స్నేహం స్నేహం అని చెప్పి ఈ కన్నతల్లికే ద్రోహం చేసి వెళ్లాడు. అని ఏడుస్తుంది ధాన్యలక్ష్మీ.


ప్రకాష్‌: ఎందుకు ఏడుస్తావ్. నీ మనసులో ఏముందో చెప్పావ్ కానీ, వాడి మనసు అర్థం చేసుకున్నావా. నీ ఇష్టాలు రుద్దావ్. నీకోసం ఇన్నాళ్లు భరించాడు. అప్పు దూరమవుతుందని తెలిసి బయటపడ్డాడు. ఇకనుంచి వాడు చాలా సంతోషంగా బతుకుతాడు.


ధాన్యలక్ష్మీ: ఏముందని బతుకుతాడు ఏం చేసి బతుకుతాడు. రోడ్డు పడ్డాడు ఆ అప్పు అనే మహమ్మారి దాపరించినప్పటి నుంచి వాడి బతుకు బజారున పడుతూనే ఉంది. ఇప్పుడు రోడ్డున పడింది.


సుభాష్‌: ఇది అనుకోకుండా జరిగింది. కల్యాణ్ ఎక్కడున్న వాడు దుగ్గిరాల వారసుడే. ఈ కోపాలు పంతాలు ఎప్పుడు ఉండవు.


రుద్రాణి:  దీనంతటికి సూత్రధారులు కావ్య స్వప్న ఆ అప్పు. వీళ్లు మన ఇంటి సంతోషాన్ని, ఆస్తులను బొమ్మలు అమ్ముకున్నట్లు అమ్మెస్తున్నారు.


స్వప్న: ఏం మాట్లాడుతున్నావు అత్తా.. నీ కొడుకు ఆస్తి దోచుకున్నామా, నీ మొగుడి ఆస్తి దోచుకున్నామా? ఈ దుగ్గిరాల ఇంటి ఆస్తి దోచుకున్నామా? మా మూడు జంటల్లో అప్పు, కల్యాణ్‌కే న్యాయం జరిగింది. ఉన్నా లేకున్నా వాళ్లు ఆనందంగా ఉంటారు.


రుద్రాణి: నోర్మూయ్. మీరు ఎంత మోసం చేసి పెళ్లి చేసుకున్నారో మర్చిపోయారా?


కావ్య: అవును మోసమే చేశాం అయితే ఇప్పుడు ఏంటీ. ఇప్పుడు జరగాల్సింది కాకుండా సంవత్సరం క్రితంది తవ్వుతున్నారు. ఎవరు ఎవరికి ముసుగు వేసి మోసం చేశారో అందరికీ తెలుసు.


  దీంతో రుద్రాణి, కావ్యను తిడుతుంది. ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తానని స్వప్న, రుద్రాణికి వార్నింగ్‌ ఇస్తుంది. దాంతో రాహుల్ ఫైర్ అవుతాడు. అప్పు వల్లే కదా కల్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు అంటాడు. రుద్రాణి, రాహుల్ మీరిద్దరు కాస్తా సైలెంట్‌గా ఉంటారా. అప్పుపై ప్రేమను వాడు చివరి వరకు గ్రహించకపోవడం వాడి తప్పు అని ఇందిరాదేవి అంటుంది.


 


 ధాన్యలక్ష్మీ: నువ్ రాజ్ కలిసి నా కొడుకుకు అప్పును ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. నాకు ఎవరు న్యాయం చేస్తారు..?


రుద్రాణి: ఇంకేం చేస్తారు. రాజ్‌ను కొంగున ముడి వేసుకుని అంతా చేసింది కావ్య. కల్యాణ్‌ను కూడా తను చెప్పినట్లు చేసేలా చేస్తుంది అప్పు. ఈ ఇంటికి రాకుండా కూడా చేస్తారు.


అపర్ణ: ఆపు రుద్రాణి నీకు అన్ని విద్యలు తెలిసినట్లు మాట్లాడుతున్నావ్. మరి నువ్వెందుకు నీ మొగుడిని కొంగున ముడి వేసుకోలేదు. మా ఇంటి మీదకు వచ్చి పడ్డావ్. నువ్వు మా సొంత ఆడపడుచువి కాదు. పరాయి పంచన పడి ఉండేదానివి. హద్దుల్లో ఉండు.


రుద్రాణి: నన్ను అంత మాట అంటావా. నేను పరాయిదాన్నా. అమ్మా నాన్నా విన్నారా?


ఇందిరాదేవి: అమ్మ ఎవరు?  నాన్న ఎవరు? భర్తను వదిలేసి వస్తే.. ఇంతకాలం సానుభూతితో నిన్ను తమలో కలుపుకున్నారు. కానీ, వాళ్ల మధ్యే విభేదాలు సృష్టించాలని చూస్తే నువ్వేవరు మేము ఎవరు?


  ఇందిరాదేవి మాటలకు రుద్రాణి  ఏడుస్తూ వెళ్లిపోతుంది. రాహుల్ కూడా వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మీ నువ్ దుఖంలో ఉన్నావ్. కన్నీళ్లతో ఉంటే నిజమేంటో గ్రహించలేం. కాస్తా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. తర్వాత మాట్లాడుకుందాం అని అపర్ణ చెబుతుంది. మరోవైపు కనకం, కృష్ణమూర్తి జరిగింది తలుచుకుని బాధపడుతుంటారు. అప్పు కల్యాణ్ బయట ఎలా బతుకుతారో అని కంగారుపడతారు. మరోవైపు అప్పు కల్యాణ్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. కల్యాణ్ రూమ్ చూస్తుంటే.. ఇది నీకు నచ్చలేదా మీ ఇంటికి ఈ ఇంటికి చాలా తేడా ఉంటుందని అప్పు అంటుంది. లేదు బయటకొచ్చిన మనకు అదృష్టంగా ఈ రూమ్ దొరికింది అని కళ్యాన్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.