Brahmamudi Serial Today Episode: రాజ్‌, కావ్యను బయటకు తీసుకెళ్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని నిలదీస్తాడు. దీంతో నేను మీ ఆస్తుల కోసం ఆశపడ్డానా? అంటూ ధాన్యలక్ష్మీ, రుద్రాణి లాగా నేనేం ప్రవర్తించలేదు కదా అంటుంది. నాకు డబ్బు పిచ్చి పట్టిందా, ఆస్తులు కావాలని అనుకుంటున్నానా అని రాజ్‌తో కావ్య గొడవ పడుతుంది. ఉదయం 5 గంటలకు లేచినప్పటి నుంచి ఇంటి ముందు ముగ్గులు, వివిధ రకాలైన టిఫిన్స్, వాటి వేరే వేరే చట్నీ, మధ్యాహ్నాం ఒక్కొక్కరికి కావాల్సిన వంట అని తను చేసే పనుల లిస్ట్ చెబుతుంది కావ్య. సరే నువ్ చెప్పినదానికి ఒప్పుకుంటున్నాను అని కావ్య పనులను, గొప్పతనాన్ని గుర్తించినట్లు పొగుడుతాడు రాజ్.


కావ్య: సరే కానీ కవి గారు ఇంటికి రావడం నాకు ఇష్టం లేదన్నారు. ఎందుకు?


రాజ్‌:  అవును, అందులో డౌటే లేదు. అందుకే వాడు వెళ్లేటప్పుడు నువ్ ఆపలేదు. అయినా పర్వాలేదు. నేను వాడిని తీసుకొస్తాను.


 అని చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు. మరోవైపు  డబ్బులు ఎలా సంపాదించాలని కళ్యాణ్‌, అప్పు ఆలోచిస్తుంటారు. ఇంతలో భుజంగం అనే వ్యక్తి వచ్చి తికమక మాట్లాడుతుంటాడు. మీరు కొన్న బట్టలు లక్కీ డ్రా తీస్తే అందులో 5 లక్షలు తగిలాయని చెప్తాడు. అయితే ఇదంతా రాజ్‌ ఆడిస్తున్న నాటకం అని కనిపెట్టిన కళ్యాణ్‌ తెలివిగా రాజ్‌ను పిలుస్తాడు. కింద ఉన్న రాజ్‌ పైకి వస్తాడు.


రాజ్: నేను ఎలా డబ్బు ఇచ్చినా తీసుకోవు. అందుకే ఇలా చేశాను.


కళ్యాణ్‌: అన్నయ్యా నేను అంత అసమర్థుడిలా కనిపిస్తున్నానా?  నా భార్యను నేను పోషించుకోలేనా..?  నువ్ నా వ్యక్తిత్వాన్ని, నన్ను అనుమానిస్తున్నావు.


రాజ్‌: ఛీ ఊరుకో నువ్ ఆ కళావతిలో మాట్లాడకు. ఆ రాక్షసి ఇలా మాట్లాడే వాళ్ల పుట్టింటికి హెల్ప్ చేస్తానన్న ఒప్పుకోలేదు. దాన్ని అనాలి.


 అంటూ రాజ్‌ కావ్యను తిడుతుంటే మరోవైపు  కావ్యకు పొలమారుతుంది. అపర్ణ వచ్చి నీళ్లు ఇస్తుంది.


కావ్య: మీ అబ్బాయి గారు నా గురించి చాలా గొప్పగా పొగుడుతున్నట్లున్నారు అత్తయ్య. చాలా గట్టిగా తలుచుకుంటున్నట్లు ఉన్నారు.


అపర్ణ: నా కొడుకు అంటే నీకు ఎప్పుడు వెటకారమే. వాడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు.


కావ్య: బూత్ బంగ్లాలో శోభనం ఏర్పాటు చేశారు. దాన్ని రాక్షస ప్రేమ అంటారు. కోపం చూపిస్తూ ప్రేమించే మీకు, మీ కొడుకుకు శతకోటి వందనాలు  


  ఇంతలో  స్వప్న వస్తుంది ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. స్వప్న హాస్పిటల్‌ కు వెళ్దాం అనగానే కావ్య సరేనని వెళ్తుంది. తర్వాత రాజ్‌ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటాడు. ఇందిరాదేవి వచ్చి పలకరిస్తుంది. కల్యాణ్ , అప్పుల గురించి మాట్లాడుకుంటారు. ఎల్లుండి శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈసారి కొత్త కోడలితో వ్రతం చేయించాలని నేను కండిషన్ పెడతానని ఇందిరాదేవి అంటుంది. దాంతో అప్పు కల్యాణ్ వస్తారని రాజ్ సంతోషిస్తాడు. హ్యపీగా బెడ్‌రూంలోకి వచ్చిన రాజ్‌ ను చూసిన కావ్య మీకు ఏదో అయ్యిందని అడుగుతుంది.


రాజ్‌: నాకు నిజంగానే ఏదో అయ్యింది. అది సంతోషం అనే జబ్బు తగులుకుంది.


కావ్య: అయితే డాక్టర్‌కు కాల్ చేయమంటారా?


రాజ్: నా తమ్ముడు ఇంటికి రాడు అన్నావు.. వాళ్లను శాశ్వతంగా ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ దొరికింది. ఎల్లుండి..


  అని చెప్పబోయిన రాజ్ దీనికి నిజం తెలిస్తే వాళ్లు రాకుండా ప్లాన్ చేస్తుంది. అసలే దీనికి వాళ్లు రావడం ఇష్టం లేదు అని చెప్పడం ఆపేస్తాడు రాజ్‌.  ఈయన ఏదో చేస్తున్నాడు. అదేంటో తెలుసుకోవాలి అని కావ్య అనుకుంటుంది. తర్వాత  ఇందిరాదేవి ఇంట్లో వాళ్లందరిని పిలిచి వరలక్ష్మీ వ్రతం గురించి చెబుతుంది. కొత్తజంట అయిన కళ్యాణ్‌, అప్పులతో వ్రతం చేయించాలనుకున్నట్లు ఇందిరాదేవి చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.