Brahmamudi Serial Today Episode: పబ్లిషర్స్ ఆఫీసులో జరిగిన విషయం మొత్తం చెప్తాడు కళ్యాణ్. దీంతో అప్పు.. కొత్తగా కథ వెతుక్కోవడం దేనికి మీ ఇంట్లో జరుగుతున్న దాన్నే కథగా రాయి అని చెప్పి తర్వాత వంట చేస్తాను తిందాము అంటుంది. అప్పు వంట చేసిన తర్వాత కల్యాణ్ తిని అదోలా చూస్తాడు. ఎట్లుంది అని అప్పు అడిగితే.. బాగానే ఉందంటాడు కల్యాణ్. అప్పు తిని.. ఇదేంద్రా ఇట్లుంది. బాగుందని చెప్పావేంటీ అని అప్పు అడగ్గానే బాగాలేదని చెబితే ఇవన్ని పడేస్తావేమోనని బాగుందన్నాను అంటాడు కళ్యాణ్. తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ముద్దు పేర్లతో పిలుచుకోవాలని డిసైడ్ అవుతారు. కల్యాణ్ పొట్టి అని పిలుస్తానంటే.. అప్పు కూచి అని పిలుస్తాను అంటుంది. మరోవైపు కనకం, మూర్తిని తిడుతుంది. కన్న కూతురు ఎలా ఉందో పట్టించుకోరా? మీరు అంటూ అడుగుతుంది. ఇంతలో బంటి వచ్చి అప్పు అక్క వాళ్లు నా రూంలోనే ఉన్నారని చెప్తాడు. అయితే ఏలా ఉన్నారని అడుగుతారు కనకం, మూర్తి మరోవైపు టీ పట్టుకుని రాజ్ నిద్రలేవడం కోసం ఎదురుచూస్తుంది కావ్య. రాజ్ లేచి
రాజ్: ఏంటే అలా నిల్చున్నావ్. ముందు ఆ టీ ఇవ్వు
కావ్య: వంద రూపాయలు ఇవ్వండి.. ఇస్తాను.
రాజ్: వందేంటే నీ బొంద
కావ్య: నేను మీ ఆస్తి కోసం వెంపర్లాడుతున్న అన్నారు కదా. ఇన్నాళ్లు నా కష్టానికి ఒక్క రూపాయి అయినా వచ్చిందా? లేదు కదా. నాకు ఏమైనా ఆస్తి రాసిచ్చారా? చిన్నిల్లు రాసిచ్చారా? అందుకే ఇలా నేను చేసే ప్రతిదానికి మూల్యం చెల్లించాల్సిందే..!
రాజ్: ఓసేయ్ ఇగో ఒక్క వందేంటి ఖర్మ తీసుకో ఇదంతా నీకే..
కావ్య: ఇలా రోజూ సంపాదించి నేను త్వరలోనే కోటీశ్వరురాలిని అవుతాను. అలాగే ప్రతిదానికి లెక్క ఉంది. కానీ, టర్మ్స్ అండ్ కండీషన్స్ అప్లై. కింద టిఫిన్ రెడీ చేస్తాను. భారీ మూల్యం చెల్లించుకోవాలి.
రాజ్: అదేంటే.. ఈ మూల్యం గోల..
కావ్య: కిందకు వచ్చి అరవండి. అందరూ వచ్చి నిలబడి పంచాయితీ పెడతారు. సరే ఐరన్ ఏమైనా చేయాలా?
రాజ్: ఐరన్ వద్దు స్టీలు వద్దు పో..
కావ్య: అయినా అవసరం ఏముందిలే ఇప్పుడు పనిపాట ఏం లేదు కదా. తాతయ్య గారు మీ పోస్టింగ్‌ను ఊస్టింగ్ చేసేశారు కదా
అంటూ సెటైర్లు వేస్తుకుంటూ కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు ఉల్లిగడ్డలు కోస్తూ అప్పు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో కళ్యాణ్ వస్తాడు.
కల్యాణ్: ఏయ్ పొట్టి నీకో సర్‌ప్రైజ్... ఆ మిగిలిన 3 వేలు పెట్టి నీకు బట్టలు తెచ్చాను.
అప్పు: అదేంద్రా భయ్ ఉన్న డబ్బు పెట్టి బట్టలు ఎందుకు తెచ్చావ్. ఇప్పుడు సరుకులు ఎలా కొనాలి.
కళ్యాణ్: అదేంటీ ఇంకా మూడు వేలు ఉన్నాయి. వాటితో కొందాం..
అని కళ్యాణ్ చెప్పగానే లోపలికి వెళ్లి అప్పు కవర్ తీసుకొస్తుంది. ఏంటిది అని కల్యాణ్ అడిగితే.. నువ్వు ఎలాగు సరుకులు తీసుకొస్తావ్ కదా అని నేను నీకోసం బట్టలు తీసుకొచ్చాను అని అప్పు చెప్పగానే కళ్యాణ్ షాక్ అవుతాడు. మరోవైపు కావ్యను ఇందిరాదేవి కాఫీ ఇవ్వమని అడుగుతుంది. సరేనని తీసుకురావడానికి వెళ్తున్న కావ్య, రాజ్‌ను చూసి కాఫీకి వంద రూపాయలు అమ్మమ్మగారు అని చెప్తుంది. దీంతో అక్కడున్న అందరూ షాక్ అవుతారు. ఏవరేం చెప్పినా వారికి రేట్లు చెప్తుంది కావ్య. టిఫిన్స్ కు ఒక రేటు.. భోజనానికి ఒక రేటు.. టీ, కాఫీలకు ఒక రేటు అని కావ్య చెప్పడంతో అందరూ ఆశ్యర్యంతో చూస్తుండిపోతారు. దీంతో రాజ్, కావ్యను బయటకు తీసుకెళ్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని నిలదీస్తాడు. దీంతో నేను మీ ఆస్తుల కోసం ఆశపడ్డానా? అంటూ ధాన్యలక్ష్మీ, రుద్రాణి లాగా నేనేం ప్రవర్తించలేదు కదా అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.