Brahmamudi Serial Today Episode: రాజ్‌కు బాగా ఆకలి వేస్తుంటే కిచెన్‌లోకి వెళ్లి పాలు వేడి చేసుకుని తాగబోతుంటే పాల గిన్నె కిందపడిపోతుంది. దీంతో రాజ్‌ చేయి కాలుతుంది. ఇంతలో కావ్య వచ్చి చేయి కాలిందా? అంటూ సెటైర్లు వేస్తుంది. తర్వాత మీకు ఆకలిగా ఉంటే వడ్డిస్తాను పదండి అటుంది. నీ చేతి వంట తిననని ముందే చెప్పానుగా అంటాడు రాజ్‌ దీంతో మీరు నా చేతి వంట తినరని తెలిసే సాయంత్రం పనిమనిషి శాంతతో  వండించాను అంటుంది. దీంతో సరే అని రాజ్‌ వెళ్లి స్వయంగా వడ్డించుకుని తింటాడు. ఆ వంటను మెచ్చుకుంటూ తింటాడు రాజ్. ఇంతలో అపర్ణ వచ్చి రాజ్ అన్నం తినడం చూసి హ్యాపీగా ఫీలవుతుంది.


అపర్ణ: ఎవరో అన్నం తినను అని చెప్పి రాక్షసుడిలా అర్థరాత్రి తింటున్నాడు.


రాజ్‌: మామ్ ఇది పనిమనిషి శాంత చేసిన వంట. నేను మెనూ ఇస్తాను రోజు నాకోసం ఇలాగే స్పెషల్‌గా చేయించమను.


అపర్ణ: సరే వారం రోజుల దాకా శాంత రాదు. వచ్చాకా చెబుతాను.


రాజ్‌ భోజనం చేసి వెళ్లిపోతాడు.


అపర్ణ: వాడు ఆకలికి ఉండలేడు ఎలా అని భయపడ్డాను. కానీ, నీ చేతి వంటను శాంత వంట అని చెప్పి తినిపించావ్.


కావ్య: ఈ టెక్నిక్ ఓసారి మీ దగ్గర కూడా వాడాను. మీరు తిననంటే మావయ్యతో పంపించాను.


అపర్ణ: అమ్మనా కోడలా.. ఎంత గడుసుదానివి


   అంటూ ఇద్దరూ మాట్లాడుకుని వెళ్లిపోతారు. మరోవైపు రూంలో పడుకున్న రాజ్‌కు నిద్ర పట్టక కళ్యాణ్‌ గురించి ఆలోచిస్తుంటాడు. నాకు నిద్ర పట్టడం లేదు. ఇది మాత్రం దున్న పోతులా నిద్రపోతుంది అనగానే నేనేం నిద్ర పోలేదు అంటుంది కావ్య. కళ్యాణ్‌ గురించి ఇద్దరి మధ్య ఫన్నీగా గొడవ జరుగుతుంది. రాజ్‌, కళ్యాణ్‌కు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని అడుగుతాడు. కళ్యాణ్‌ రాలేనని నా సంతోషం కోరుకునే వాడివే అయితే నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. దీంతో కావ్య సెటైర్లు వేస్తుంది. ఇప్పుడు నేను దున్నపోతులా. మీరు మేకపోతులా పడుకోండి అటుంది.  మరోవైపు అప్పు ఫ్రెండ్స్ బయట చలిలో ఇబ్బంది పడుతూ పడుకోవడం చూస్తాడు కళ్యాణ్‌.


అప్పు: ఏమైంది..? వాళ్లను అలా చూస్తున్నవేంటి కవి.


కళ్యాణ్‌: వాళ్లను చూడు మనకు ప్రైవసీ ఇవ్వాలని చెప్పి నీ ఫ్రెండ్స్ బయట చలిలో పడుకున్నారు. వాళ్ల రూమ్‌లో వాళ్లు పడుకోలేకపోయారు. ఈ రాత్రికి తప్పలేదు. ఇంకా ఇక్కడ ఉంటే తప్పు అవుతుంది. ఏదోటి చేద్దాం.  కానీ, ఇంత మంచి ఫ్రెండ్స్‌ కు మన వల్ల ఇబ్బంది రాకూడదు. వీళ్లు రోజుకో అబద్ధం చెప్పి ఇలాగే కష్టపడుతుంటారు. కాబట్టి మనం వేరే దారి చూసుకుందాం.


అప్పు: నీ ఇష్టం నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. వాళ్లను ఎక్కువ కష్ట పెట్టడం నాకు ఇష్టం లేదు.


 మరుసటి రోజు ఉదయం అప్పు ఫ్రెండ్స్ లేస్తారు. మనం ఇక్కడ పడుకున్నామని తెలిస్తే వాళ్లు ఫీల్ అవుతారు. మనం మన ఫ్రెండ్ రూమ్‌లో పడుకుని వచ్చామని చెబుదామని రూంలోకి వస్తారు.


కళ్యాణ్‌: హాయ్‌ సినిమా ఎలా ఉంది.


కిరణ్‌: చాలా బాగుంది.


కళ్యాణ్‌: అవును సినిమా అయిపోయాక ఎక్కడికి వెళ్లారు. రాత్రి రూంకు  ఎందుకు రాలేదు.


ఫ్రెండ్‌: సినిమా చూశాక లేట్ అయింది. అందుకే ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లి పడుకున్నాం.


 అని తమ ఫ్రెండ్స్‌ అబద్దం చెప్పడంతో అప్పు, కళ్యాణ్‌ మనసులో ఎమోషనల్‌ గా ఫీలవుతారు. ఇక మేము వెళ్తాము  అని అప్పు చెప్పే సరికి ఫ్రెండ్స్‌ అందరూ ఎందుకు ఏమైందని అడుగుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.