Brahmamudi Serial Today Episode: కావ్య కూడా రాజ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. దీంతో నువ్వు కూడా నా నిర్ణయాన్ని  కాదంటున్నావా? అంటూ రాజ్‌ అడగ్గానే.. మీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కాదు. మీ గౌరవం పోకూడదని ఇలా మాట్లాడుతున్నాను. ఆ బాబు తల్లి ఎవరో తీసుకురా అప్పుడు నేనే తప్పుకుంటాను అని కావ్య చెప్తుంది. అపర్ణ కూడా కావ్య మాటలను సమర్థిస్తుంది. దీంతో రాజ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ నా రక్త సంబంధాన్ని వదులుకునే ప్రసక్తే లేదని లాయర్‌తో పేపర్స్‌ తీసుకుని సంతకాలు చేయబోతుంటే.. రాజ్‌ వాళ్ల తాతయ్య అడ్డుపడతాడు.


తాతయ్య: నీకంతా ఏం వయసైందని నీకేం అవసరం వచ్చిందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావు రాజ్‌. ఇది పద్దతి కాదు. ఈ కుటుంబానికి అండగా ఉన్న ఆస్థి మన కంపెనీ. మన కంపెనీకి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. నువ్వు చేసే ఈ ఒక్క సంతకం వల్ల ఎంత అనర్థం జరుగుతుందో ఆలోచించావా? కళ్యాణ్‌కు అంత అనుభవం లేదు. ఏదో ఒక కారణం చేత నీ బాధ్యతలను త్యాగం చేసే హక్కు నీకు లేదు.


కళ్యాణ్‌: అవును అన్నయ్యా నా అభిరుచి వేరు నా మనస్తత్వం వేరు. నీ స్థానానికి ఉన్న విలువ వేరు. నువ్వు ఆ సీట్లో కూర్చుంటే ఆ టీవే వేరు. నా అన్నయ్య శాసించే స్థాయిలో ఉండాలి. వదిన కోరుకున్నట్టే నీ స్థానం పడిపోకూడదు. దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అన్నయ్య.


రుద్రాణి: అయితే ఒక్కటే పరిష్కారం. బిడ్డ ఎవరికి పుట్టాడో.. ఎందుకు పుట్టాడో.. అవన్నీ అనవసరం.. ఆ బిడ్డను వదిలేసి రావాలి. అప్పుడే రాజ్‌ ఈ ఇంటి వారసుడిగా గుర్తింపు పొందుతాడు.


రాజ్‌: అది జరగని పని..


రుద్రాణి: అయితే ఇది కూడా ఇలాగే జరుగుతుంది.


అపర్ణ: వాడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. తప్పు చేసినా సరిదిద్దుకోలేని వాడు నా దృష్టిలో మూర్ఖుడి కిందే లెక్క.


అంటూ ఎవరెన్ని చెప్పినా రాజ్‌ వినడు నాకు ఆస్థికన్నా అధికారం కన్నా ఆ బిడ్డే నాకు ముఖ్యం అంటూ రాజ్‌ పేపర్స్‌ పై సంతకాలు పెడతాడు. పేపర్స్‌ తీసుకెళ్లి కళ్యాణ్‌ చేతిలో పెడతాడు. కంపెనీని ఎలా నడపాలో చెప్తాడు. ఇప్పటి వరకు నిన్ను నమ్మని వాళ్లకు ఇకనుంచి నమ్మకాన్ని కలిగించు అంటూ చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు. అనామిక,ధాన్యలక్ష్మీ హ్యాపీగా ఫీలవుతుంటారు. తర్వాత కావ్య ఎవరికో ఫోన్‌ చేసి వెన్నెల గురించి అడుగుతుంది. వెన్నెలతో కలిసి చదువుకున్న వాళ్ల పేర్లు ఫోన్‌ నెంబర్లు ఇవ్వమని అడుగుతుంది. ఆయన కావ్య మొబైల్‌ కు లిస్ట్‌ ఫార్వార్డ్‌ చేస్తాడు.


లిస్టులో శ్వేత నంబర్‌కు కావ్య ఫోన్‌ చేస్తుంది.


కావ్య: శ్వేత నువ్వు రాజ్‌ ఫ్రెండ్‌ శ్వేతవేనా?


శ్వేత: అవును మీరెవరు?


కావ్య: శ్వేత నేను కావ్యను రాజ్‌ వైఫ్‌ ను


శ్వేత: కావ్య నువ్వా నీకు ఈ నెంబర్‌ ఎలా తెలుసు..?


కావ్య: శ్వేత అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నిన్ను కలవాలి.


శ్వేత: తప్పకుండా నన్ను ఇంటికి రమ్మంటావా?


కావ్య: అయ్యోయో వద్దు నేనే నిన్ను కలుస్తాను. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి.


శ్వేత: ఎంటది?


కావ్య: వచ్చాకా చెప్తాను. కానీ నేను వస్తున్నట్లు మా ఆయనకు చెప్పకండి.


శ్వేత: అసలేమైంది. ఎందుకిలా కంగారు పడుతున్నావు.


అనగానే వచ్చాకా అన్ని చెప్తాను. మీ మొబైల్‌ నంబర్‌కు ఎక్కడ కలవాలో లొకేషన్‌ షేర్‌ చేస్తాను. అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు కళ్యాణ్‌, రాహుల్‌ ఆఫీసుకు వెళ్తారు. రాజ్‌ సీటు చూసి కళ్యాణ్‌ ఎమోషనల్‌ అవుతాడు. కళ్యాణ్‌ చైర్‌లో కూర్చో అని రాహుల్‌ అనగానే ఈ చైర్‌ ఎప్పటికీ అన్నయ్యదే నేను ఈ చైర్‌లో కూర్చోను. అంటూ పక్కన ఉన్న చైర్‌ తీసుకుని కూర్చుంటాడు. రాహుల్‌ కూడా ఇవాళే జనరల్‌ మేనేజర్‌గా జాయిన్‌ అయ్యాడు. అతను చెయ్యాల్సిన వర్క్‌ అతనికి చెప్పండి అని కళ్యాణ్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: డియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఐశ్వర్యారాజేష్ | ABP