రాహుల్ ప్లాన్ ఫెయిల్ అయ్యి స్వప్న తిరిగి ఇంటికి వస్తుంది. కిడ్నాప్ చేసిన వాడిని పోలీసులకి పట్టించామని కావ్య చెప్తుంది. ఇక కిడ్నాప్ చేయించిన వాడిని తిడుతుంటే రుద్రాణికి కాలుతుంది. స్వప్న కడుపు పెరగడం చూసి ధాన్యలక్ష్మి డౌట్ గా అడుగుతుంది. నాలుగో నెలకి ఆ మాత్రం కూడా ఉండదా? అనేసి వెళ్ళిపోతుంది. ప్లాన్ ఫెయిల్ అయినందుకు రుద్రాణి కోపంగా కొడుకు చెంప పగలగొడుతుంది.


రుద్రాణి: విగ్రహాల విషయంలో అలా చేశావ్ ఇప్పుడు స్వప్న విషయంలో ఇలా చేశావ్. నిన్ను అందలం ఎక్కించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కుదరడం లేదు. నీకు చాలా సార్లు చెప్పాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయమని


రాహుల్: ఆఅ మైఖేల్ గాడి వల్ల ప్లాన్ ఫెయిల్ అయ్యింది


రుద్రాణి: ఇలాగే అయితే నువ్వు కంపెనీకి రాజువి కావడం కాదు బంటువి కూడా కాలేవు


రాహుల్: ఈసారి నేను ప్లాన్ చేసి ఎలాగైనా దెబ్బకొడతాను


ALso Read: ఓ వైపు రిషి పెళ్లి పనులు- మరోవైపు జగతి చావుకి ముహూర్తం పెట్టిన శైలేంద్ర


రుద్రాణి: మనకి ఎక్కువ టైమ్ లేదు. స్వప్న కడుపుతో ఉంది తను డెలివరీ అయితే పాపని బాబుని తెచ్చి చేతిలో పెడుతుంది. ఇంకొక అవకాశం కూడ చూడకూడదు. ఏదో ఒకటి చేసి స్వప్నని వదిలించుకోవాలి


కావ్య స్వప్న కిడ్నాప్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్క దొరికిన సంతోషం కంటే అనుమానమే ఎక్కువగా ఉందని కావ్య తన అనుమానాన్ని రాజ్ తో పంచుకుంటుంది. వాడిని పోలీసులకు పట్టించడం కాదు వాడి వెనుక ఎవరు ఉన్నారో కూడ తెలుసుకోవాలని చెప్తుంది. అప్పుడే కాంట్రాక్టర్ శ్రీనివాసరావు వస్తాడు. పని పూర్తయిందని చెక్ ఇచ్చి వెళ్దామని చెప్పి వచ్చినట్టు చెప్తాడు. కావ్య చేతికి డబ్బుల చెక్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అది చూసి చాలా సంతోషపడుతుంది. మొత్తానికి అనుకున్నది సాధించావని రాజ్ కంగ్రాట్స్ చెప్తాడు. కావ్య ఎమోషనల్ గా కన్నీళ్ళు పెట్టుకుంటూ రాజ్ ని హగ్ చేసుకుంటుంది. మీకు ఎన్ని సార్లు చెప్పినా కృతజ్ఞతలు తప్పులేదు. ఈ చెక్ కూడా మీకే ఇస్తాను. వాటిని వడ్డీ వాడికి ఇచ్చి ఇంటి పత్రాలు మీరే తీసుకుని మా వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది.


ఇదంతా తన మీద ప్రేమతో చేశానని అనుకుంటుంది. తాతయ్యకి ఇచ్చిన మాట కోసం చేశానని తెలిస్తే ఏమనుకుంటుందో ఏమోనని రాజ్ మనసులో అనుకుంటాడు. అనామిక తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పేద్దామని కళ్యాణ్ తో అంటుంది. పండుగ రోజు తన తల్లిదండ్రులని తీసుకొచ్చి పెళ్లి గురించి మాట్లాడేద్దామని ధైర్యం చెప్తుంది. దీంతో సరే అంటాడు. స్వప్న కిడ్నాప్ విషయం ఇంట్లో చెప్పేసరికి అప్పు కనకం మీద కసురుతుంది. టైమ్ కి బావ, అక్క వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే పెళ్లి అవుతుంటే చూస్తూ కూర్చునే దానివి కదా అంటుంది.


కనకం: కూతురు జీవితం నాశనం అవుతుంటే ఎలా ఊరుకుంటాను. ప్రాణాలకి తెగించి కాపాడేదాన్ని


అప్పు: నా భయం కూడ అదే నీకు ఏమైనా అవుతుందని


కనకం: నువ్వు గొడవలకి వెళ్ళినప్పుడు మా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అది అర్థం చేసుకో


Also Read: ముకుంద తిక్క కుదర్చడానికి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ- దూరం దూరం అంటోన్న కృష్ణ


కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. మళ్ళీ చేస్తాడు లిఫ్ట్ చేసి అసలు మాట్లాడేది కూడా వినిపించుకోకుండా వాయించేస్తుంది.  కావ్య తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇంట్లో అందరం సంతోషంగా ఉన్నామని చెప్తుంది. పండగకి ఇంటికి వస్తున్నారా లేద అంటుంది. ఇంటి పత్రాలు ఆయన చేతి మీదుగా ఇస్తున్నామని చెప్పాం కదా రాకుండ ఎలా అంటుంది. కానీ కనకం మాత్రం వెనకాడుతుంది. అపర్ణ ఏమైనా అంటుందోనని చెప్తుంది. అత్త పిలిస్తే వస్తావా అని అంటుంది. మా అత్తతో ప్రేమగా పిలిపిస్తానని మాట ఇస్తుంది. ఏం చేస్తే ఆమె పిలుస్తుందా అని ఆలోచనలో పడుతుంది. అందరూ తింటూ ఉండగా అపర్ణకి అది కావాలా? ఇది కావాలా అని కావ్య అడుగుతుంది. వద్దని కఠినంగా సమాధానం చెప్తుంది.


కావ్య: ఆయన్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళి వస్తాను అత్తయ్య


రాజ్: ఇందులో నాకేం సంబంధం లేదు అసలు విషయం కూడా నాకు తెలియదు


అపర్ణ: ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నావ్. కాంట్రాక్ట్ పూర్తయిందని చెప్పావ్ ఇక వెళ్ళే అవసరం లేదని చెప్పావ్ కదా


కావ్య: కాంట్రాక్ట్ మీ అబ్బాయి వల్లే వచ్చింది కదా ఇంటి పత్రాలు ఆయన చేతి మీదుగా ఇప్పించాలని వెళ్తున్నా. త్వరగానే వచ్చేస్తాను


అపర్ణ: మొన్న అలాగే చెప్పావ్. కుదరదు


కావ్య: అమ్మని ఇక్కడికి రమ్మంటే రాను అంటుంది. మీరు పంపించను అంటున్నారు


అపర్ణ: కనకాన్ని పిలిస్తే ఎందుకు రాదు