"మా అత్తగారి సంతోషం కోసమైనా ఘనంగా జరిపిస్తాం.. మీరేం టెన్షన్‌ పడకండి" అంటుంది అపర్ణ. దీంతో కావ్య వాళ్ల అమ్మ "నేను పుట్టింటి నుంచి తీసుకురావాల్సింది ఏమైనా ఉందా చెప్పండి..  ఏ లోటు లేకుండా తీసుకువస్తాను. ఆయన తీసుకోస్తా అన్నార"ని చెప్తుంది కనకం. అప్పుడు బామ్మగారు కనకం నువ్వేం తీసుకురాలేదని మేమేమీ అనుకోం..ఇది మా  ఇంట్లో జరిగే శుభకార్యం..అది ఏ ఆటంకం లేకుండా ఘనంగా జరిగితే చాలు అంటుంది. వెంటనే కలుగజేసుకున్న కావ్య వాళ్ల చిన్నత్త ధాన్యలక్ష్మీ వీలైతే ఓ 5 బంగారు అరిసెలు, ఓ 5 వెండి లడ్డూలు తీసుకురండి చాలు అని ఆటపట్టిస్తున్నట్లు.. ధాన్య లక్ష్మీ మాటలకు కనకం కంగారుపడినట్లు చూసేసరికి.. సర్ది చెప్తున్నట్లుగా కావ్య వాళ్ల అత్తగారు అవి రుద్రాని కోసం అనగానే అందరూ హాపీగా నవ్వుకుంటారు. దూరం నుంచి మెట్లపై నిల్చుని అందరి మాటలు వింటున్న కావ్య టెన్షన్‌ పడుతూనే పుట్టబోయే బిడ్డ మీద అమ్మమ్మగారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో నేను వెళ్లి వాళ్ల ఆనందాన్ని నేను ఎలా పాడు చేయాలి. అమ్మతో అందరూ కలిసిపోయి సంతోషంగా మాట్లాడుతుంటే ఇప్పడెళ్లి ఏ గొడవ పుట్టించాలి అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తుంది.  


రుద్రాని బయట గార్డెన్‌లో నిలబడి టాబ్లెట్‌ చూస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న రుద్రాని కొడుకు ఏంటి మామ్‌ ఏదో ఇంపార్టెంట్‌ మాటర్‌ అని చెప్పి ఇందాకటి నుంచి ఆ టాబ్లెట్‌ చూస్తూ ఉండిపోయావ్‌ అని అడుగుతాడు. మన ప్లాన్‌ పక్కాగా అమలవుతుందని తెలిసినా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా ఆలోచించాలి అని చెప్తుంది రుద్రాణి. అర్థం అవ్వలేదు మామ్‌ అని కొడుకు అడగ్గానే ఇవి అబార్షన్‌ అయ్యే టాబ్లెట్స్‌.. మన డాక్టర్‌ శ్రీదేవి పంపించింది అని రుద్రాని చెప్పగానే కొంచెం అర్థమయ్యేట్లు చెప్పు మామ్‌ అంటూ కొడుకు అడుగుతాడు. దీంతో మనం స్వప్న చేత ఈ టాబ్లెట్‌ వేసుకునేలా చేస్తే అప్పుడు స్వప్నకు అబార్షన్‌ అవుతుంది. స్వప్న కు అబార్షన్‌ కావడానికి కారణం ఫుడ్‌ పాయిజన్‌ అని నమ్మిద్దాం.. ఇంట్లో వంట చేసేది కావ్య కాబట్టి అప్పుడు మనల్ని ఎవ్వరూ అనుమానించరు అని రుద్రాని తన కొడుకు రాహుల్‌ కు తన ప్లాన్‌ మొత్తం చెప్పేస్తుంది. వెంటనే రాహుల్‌ టాబ్లెట్‌ తీసుకుని వెళ్లబోతుంటే రుద్రాని ఆపి ఇప్పుడు కాదు రాత్రికి భోజనం అయ్యాక అంటూ రాహుల్‌ ను ఆపుతుంది.


కావ్య కృష్ణుడి విగ్రహాన్ని చూస్తూ... ఏంటి కృష్ణా చిద్విలాసంగా నవ్వుకుంటున్నావు.  నీ లీలలు మా ఇంట్లో కూడా మొదలు పెట్టావా? ఆపద్దర్మంగా అబద్దం చెప్పడం నీకు అలవాటైనట్లు నాకింకా కాలేదు. జగన్నాటక సూత్రధారివి కదా నీకు నాకు మనస్సు అర్థం అయ్యి ఉండాలి. కాకపోతే నేను కవాలని అబద్దం చెప్పలేదు. కాకపోతే నిజం దాచిపెట్టాను. అక్క కాపురం నిలబెట్టాలా..? అందరిలోనూ ఆనందం పొగొట్టాలా? అర్థం కాక బుర్ర పగిలిపోతుంది. ఏదైతే అది జరుగుతుంది. నువ్వైతే నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇదంతా నువ్వు నేర్పిన విద్యే నీరాజాక్ష అని కృష్టుడితో తన కష్టాలు చెప్పుకుంటుంది కావ్య.


 కిచెన్‌లో వంట చేస్తున్న కళ్యాణ్‌ ను చూసిన అప్పు అనామిక ఇంటికొచ్చి నువ్వు వంట చేస్తున్నావేంటి వాళ్ల అమ్మ లేదా?  అని అడుతుంది. లేదు బ్రో వాళ్ల పేరేంట్స్‌ పెళ్లికి వెళ్లారు. అందుకే నన్ను పిలిచింది అంటాడు కళ్యాణ్‌. నీకు వంట చేయడం రాదు అన్నావు కదా మరెలా చేస్తున్నావ్‌ అని అప్పు అడగగానే.. అందుకే నాకు హెల్ఫ్‌ చేస్తావని నిన్ను పిలిచాను. కానీ నువ్వు లేటుగా వచ్చావ్‌.. దీంతో నేనే ఆన్‌లైన్‌ లో చూసి చేశాను అంటాడు కళ్యాణ్‌. మరి ఆవిడకు రాదా వంటా అని అడుగుతుంది అప్పు. రాదు అప్పు అనుకుంటూ అక్కడికి వస్తుంది అనామిక.. కళ్యాణ్‌ వంట రెడీ అని డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చి నా వంట రుచి చూసి చెప్పు అని అనామికకు చెప్తాడు. అనామిక నువ్వు కూడా తిని అప్పు అంటుంది. అప్పు నేను ఇప్పుడు తినను నువ్వే తినెసెయ్‌ అంటుంది. అనామిక కొంచెం తిని ఇది వంట అంటారా..? బాగాలేదు. అని కళ్యాణ్‌ను తిడుతుంది. దీంతో అప్పు సీరియస్‌గా వంట చేయడం చేతగాని వాళ్లు వంట బాగాలేదని పేర్లు పెట్టకూడదని చెప్తుంది. అప్పుడు ఏదైనా చెప్తేనే కదా తెలిసేది అని అనామిక అనడంతో కళ్యాణ కూడా అవును మన లోపాలేంటో తెలుసుకుంటే నెక్ట్‌ మరింత మంచిగా చేయొచ్చు అంటాడు.


రుద్రాణి, రాహుల్‌ ఇద్దరూ కలిసి జూస్‌ చేసి అందులో అబార్షన్‌ టాబ్లెట్‌ కలుపుతారు. రాహుల్‌ ఆ దేవుణ్ని మొక్కుకుని వెళ్లి జూస్‌ స్వప్నకు తాగించు అంటుంది రుద్రాణి. మనమేనన్న మంచి పని చేస్తున్నామా..మమ్మీ దేవుడికి మొక్కడానికి అంటూ జూస్‌ తీసుకుని బెడ్‌రూంలోకి వెళ్తాడు రాహుల్‌. స్వప్న దగ్గరకు వెళ్లిన రాహుల్‌ తానే జూస్‌ స్వయంగా చేశానని పుట్టబోయే బిడ్డ కోసం జూస్‌ తాగమని రాహుల్‌ స్వప్నకు చెప్తాడు. అప్పుడు జూస్‌ అంటే తనకు నచ్చదని.. తాను తాగనని చెప్తుంది స్వప్న. రాహుల్‌ బలవంతం చేస్తుంటే.. బయట నుంచి స్వప్న వాళ్ల అమ్మ కనకం వస్తుంది. లోపలికి వచ్చిన కనకం నీకు ఇష్టం ఉన్నా లేకున్నా.. జూస్‌ తాగాల్సిందే.. అని బలవంతంగా స్వప్నకు జూస్‌ తాగించి కనకం వెళ్లిపోతుంది. బయటి నుంచి అంతా గమనిస్తున్న రుద్రాణి హ్యాపీగా వవ్వుకుంటుంది.


కావ్య బెడ్‌ రూంలోకి వెళ్లి జండూబామ్‌ పట్టుకున్న తన భర్తను చూసి.. ఏవండి మొన్న నడుము నోప్పి వచ్చినందుకు జండూబామ్‌ రాయమన్నాను. అంతే కానీ ఇవాళ ఏ నొప్పి లేదు. అయినా మిమ్మల్ని నేను అడగక ముందే ఇలా జండూబామ్‌ తో రెడీ అయిపోతే ఎలా... అయినా నన్ను మూడు నెలల ఆగమన్నారు. ఇంకా రెండు నెలల టైం ఉంది. అప్పుడే మీరిలా తొందర పడితే ఎలా అంటూ రొమాంటిక్‌గా భర్తను చూస్తుంది. అప్పుడు నాకు తలనొప్పిగా ఉంది అందుకే జండుబామ్‌ తీసుకున్నాని చెప్తాడు కావ్య భర్త. అవునా అంటూ బామ్‌ తీసుకుని భర్త తలకు బామ్‌  పెడుతుంది కావ్య.      


నిద్రపోతున్న స్వప్నను చూస్తూ.. టాబ్లెట్‌ పనిచేయలేదా..? ఇది దున్నపోతులా నిద్రపోతుంది. కడుపులో ఏమీ అవ్వడం లేదా? లేక నిద్రలో తెలియడం లేదా అనుకుంటూ స్వప్నను నిద్రలేపుతాడు రాహుల్‌. కోపంగా నిద్ర లేచిన స్వప్న చిరాకుగా ఏంటి అని అడుగుతుంది. నీకేమైనా కావాలా? అని అడగ్గానే ఒక డైమండ్‌ నెక్లెస్‌ కావాలి తీసుకొస్తావా? అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లు నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నారు కదా అందుకే అడిగాను అంటాడు రాహుల్‌. సరే నువ్విచ్చిన జూస్‌ ఇష్టం లేకపోయినా తాగాను. బాగా నిద్రపట్టింది ఇక పడుకో అంటుంది స్వప్న.. దీంతో షాక్‌గా చూస్తుండిపోతాడు రాహుల్‌..


దీంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ అయిపోతుంది.