కావ్య గుడిలో ఉందనే విషయం తెలుసుకుని సీతారామయ్య దంపతులు మాట్లాడుతూ ఉండగా రాజ్ వచ్చి తన మీద అరుస్తాడు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావ్ అంటూ తిడతాడు. గుడిలో నిద్ర చేస్తానని మొక్కుకుందట అందుకే వచ్చిందని సీతారామయ్య అబద్ధం చెప్తారు.


కావ్య: మీరు నన్ను ప్రేమగా చూసుకోవడం నిజం కాదా?


రాజ్: నిజమే అబద్ధమని నేను ఎప్పుడు అన్నాను


సీతారామయ్య: అయితే అదే ప్రేమతో ఇంటికి తీసుకెళ్లు నీ పెళ్ళాన్ని


రాజ్: ఈ కళావతి ఇక్కడ ఉందని మీకి ఎవరు చెప్పారు.


సీతారామయ్య: మేము ఇక్కడ ఉన్నామని నీకు ఎవరు చెప్పారు.


Also Read: ఒకే గదిలో రాత్రంతా గడిపిన విక్రమ్, జానూ - షాక్​లో దివ్య


రాజ్: ఇంట్లో ఒక్కడినే  ఉండేసరికి కళావతి ఎటు వెళ్ళిందా అని భయమేసి వెతుక్కుంటూ వచ్చాను. బయట మీ కారు కనిపించింది ఇక్కడే ఉన్నారని వచ్చాను. మీకు ఎవరు చెప్పారు?


సీతారామయ్య: పూజారి చెప్పాడు.


రాజ్: ఇప్పటి దాకా చేసిన ఘనకార్యం చేసింది చాలు పద ఇంటికి అని కావ్యని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళతాడు. ఇంటి దగ్గర అందరూ టెన్షన్ పడుతూ ఉండగా కనకం కూతురు కోసం వెతుక్కుందాం రమ్మని అంటుంది.


కనకం: బావులు, చెరువులు, రైలు పట్టాలు వెతుకుదాం.


అపర్ణ: చాలా దారుణంగా మాట్లాడుతున్నావ్.


రుద్రాణి: అంటే ఏంటి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని అంటున్నారా? లేదంటే ఈ ఇంట్లో వాళ్ళే హత్య చేసి శవాన్ని మాయం చేశారనా?


కనకం: మీకోక దండం కూతురు కనిపించకపోతే మీ అందరినీ మేం అనుమానించాలి అని అంటుండగా కావ్య ఇంటికి వస్తుంది. కూతుర్ని చూడగానే కనకం, స్వప్న వెళ్ళి ప్రేమగా కౌగలించుకుంటారు. ప్రాణాలతో మళ్ళీ కనిపిస్తావని అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళావ్ అని వరుస పెట్టి ప్రశ్నలు వేస్తారు.


కావ్య: మీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి?


రుద్రాణి: ఏముంది నువ్వు పరలోకానికి చేరావని అంటున్నారు. మమ్మల్ని హంతకులు కింద లెక్కగట్టారు. మీ ఆయన్ని అయితే ఏం చేశావ్ నా కూతుర్ని అని నిలదీశారు.


కావ్య: నా కుటుంబాన్ని అనుమానించారా?


కనకం: నువ్వు ఏమైపోయావో తెలియక..


కావ్య: మీ అర్థం లేని అపోహలతో అవమానించారా? సంస్కారాన్ని మర్చిపోయారు. మీ వల్ల నేను కూడ దోషిని అయ్యాను. మీరు ఎందుకు అలా మాట్లాడారు? అసలు నా కుటుంబాన్ని నిలదీయడానికి మీరెవరు? అత్తగారింట్లో ఆడపిల్ల అదృశ్యమైతే ఇలాగే దోషులని చేస్తారా?


రుద్రాణి: బాగుంది నీ నాటకం. వాళ్ళు మమ్మల్ని అన్నారంటే దానికి కారణం నువ్వు కదా..


అపర్ణ: నువ్వు ఎక్కడికి వెళ్ళావ్ ఎందుకు వెళ్ళావ్? ఇంట్లో ఎవరితో ఏం గొడవ జరిగిందని వెళ్ళావ్ చెప్పు. నీ తల్లిదండ్రుల ముందే నిజం చెప్పు. నీ తప్పుకి మేం  ఎందుకు మాటలు పడాలి.


సీతారామయ్య: నేను చెప్తాను. ఇందులో కావ్య తప్పు లేదు తన కాపురం కుదుట పడితే గుడిలో ఒక రాత్రి నిద్ర చేస్తానని మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళింది. ఉదయం పూజారి చెప్తే మేం వెళ్ళి తీసుకొచ్చాం.


అపర్ణ: మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళిందా? ఇంట్లో భర్తకి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వెళ్ళిందా?


ఇంద్రాదేవి; మరి ఇంకేమైనా కారణం ఉందేమో నువ్వు చెప్పు. మాట్లాడింది గుడిలో నా మనవరాలు ఏ తప్పు చేయలేదు. మనకి విషయం తెలియక కంగారుపడ్డాం.


అపర్ణ: రాజ్ నువ్వు కూడ ఈ చర్యని సమర్తిస్తున్నావా?


రాజ్: నేను సమర్థించలేదు అలాగని తప్పు పట్టలేదు.


Also Read: శైలేంద్ర గురించి రిషికి క్లారిటీ ఇచ్చిన వసుధార - దేవయానిని వణికించిన మహేంద్ర!


కావ్య: క్షమించండి.. ఈ మొక్కు గోప్యంగా ఉంచాలని పంతులు చెప్తే దాచి పెట్టాను. అందరూ ఇలా కంగారుపడతారని మా వాళ్ళ మాటలు పడతారని ఊహించలేదు.


కనకం దుగ్గిరాల ఇంటి వాళ్ళని నిలదీయడాన్ని ఇంద్రాదేవి వాళ్ళు సమర్ధిస్తారు. మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళిందని చెప్పిన  మాటలు నిజంగా నమ్ముతున్నావా అని ధాన్యలక్ష్మి రాజ్ ని అడుగుతుంది. నమ్ముతున్నానని అంటాడు.


రాజ్: ఎవరు తప్పు లేదని చెప్పడానికి నానమ్మ వాళ్ళు సాక్ష్యం ఉంది.


కనకం: మా తప్పు ఉంది ఇందులో కానీ మాట్లాడింది కనకం కాదు ఒక అమ్మ. కన్న కూతురు కనిపించకపోయే సరికి స్థాయి తప్పి మాట్లాడాము.


కావ్య: దయచేసి ఈ సంఘటనని అందరూ మర్చిపోండి ఈ గాయానికి కారణం నేనే. ఇక నుంచి నా ప్రవర్తన వల్ల ఎవరికీ మాట రాకుండా నడుచుకుంటాను.


కనకం వాళ్ళు క్షమాపణలు చెప్తారు.


రాజ్: మీ అమ్మాయి ఎప్పటికీ క్షేమంగానే ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి చాలు.


అందరూ వెళ్ళిపోయిన తర్వాత రుద్రాణి మాత్రం కావ్య చెప్పిన మాటలు నమ్మదు. ఏదో కారణం ఉంది దాన్ని దాచిపెడుతున్నారు అదేంటో తెలుసుకోవాలని కొడుకుతో అంటుంది. అప్పు తలనొప్పితో నిద్రలేచి కళ్యాణ్ ని తిట్టుకుంటుంది. తన గురించి ఆలోచించడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటుంది.


తరువాయి భాగంలో..


స్వప్న కడుపు డ్రామాకి చెక్ పెట్టడం కోసం మెట్ల మీద నుంచి కింద పడేందుకు ట్రై చేస్తుంటే కావ్య సమయానికి వచ్చి పట్టుకుంటుంది. స్వప్నకి ఏమైందా అని అందరూ కంగారుపడతారు. తర్వాత కావ్య గదిలోకి కుంటుతూ వచ్చి పడిపోబోతుంటే రాజ్ పట్టుకుంటాడు. కాలు బెణికిందని కావ్య చెప్పేసరికి రాజ్ తన కాలు పట్టుకుని మందు రాస్తాడు.