దుగ్గిరాల ఇంట్లో జరిగే ఫంక్షన్ కి కావ్య కుటుంబం వస్తుంది. అయితే ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఎంట్రీ పాసులు ఉండాలి. ఆ ఫంక్షన్ లో ఎలాగైనా దుగ్గిరాల వారసుడు రాజ్ ని బుట్టలో వేసుకోమని సలహా ఇస్తుంది కావ్య తల్లి కనకం స్వప్నకి చెప్తుంది. అందరూ చక్కగా రెడీ అయిపోయి ఫంక్షన్ కి వెళతారు కానీ ఇంట్లోకి వెళ్లేందుకు కావాల్సిన పాస్ లు మర్చిపోతారు. వాటిని తీసుకొచ్చి కావ్య ఇస్తుంది. ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే..


Also Read: గోవిందరాజులు నడిచేలా చేసిన జానకి, రామా- సంతోషంలో జ్ఞానంబ


కావ్య తన అక్క స్వప్నకి భరతనాట్యం నేర్పిస్తూ ఉంటుంది. తెర చాటున ఉండటం వల్ల కేవలం నీడ మాత్రమే రాజ్ కంట పడుతుంది. అది చూసి లవ్ లో పడిపోతాడు. బ్యూటీఫుల్ సాంగ్ వేసి ఆ సీన్ సూపర్ అనిపించారు. కానీ డాన్స్ వేస్తుంది కావ్య అనే విషయం మాత్రం రాజ్ కి తెలియదు. ఫంక్షన్ లో డాన్స్ వేస్తుంది కావ్య అక్క స్వప్న అని తెలుసుకున్న రాజ్ ఏం అంటాడో తెలియాలంటే ఈరోజు పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు వేచి చూడాల్సిందే.


డబ్బున్న వాళ్ళు అంటే కావ్యకి అసలు పడదు. కానీ రాజ్ తమ్ముడు కళ్యాణ్ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని ఆహ్వానిస్తూ ఎంట్రీ పాస్ లు కావ్యకి ఇస్తాడు. అక్కడ రాజ్ ని ఎలాగైనా బుట్టలో వేసుకుని ఆ ఇంటి కోడలు అయిపోవాలని కనకం తన పెద్ద కూతురు స్వప్నకి చెప్తుంది. కానీ కావ్య మాత్రం ఆ ఫంక్షన్ కి రాదు. ఎంట్రీ పాసులు ఇంట్లోనే మర్చిపోయి వెళ్లడంతో సెక్యూరిటీ వాళ్ళు కనకం కుటుంబాన్ని గేటులోనే ఆపేస్తాడు. వాళ్ళు అక్కడ గొడవ పడటం రాజ్ చూస్తాడు. వాళ్ళని తిట్టడానికి వెళ్లబోతుంటే సెక్యూరిటీ ఆపి తాము చూసుకుంటామని చెప్తారు. సరిగా అప్పుడే కావ్య వచ్చి ఎంట్రీ పాస్ లు ఇచ్చి సెక్యూరిటీని తిడుతుంది.


Also Read: మనసు భారమైన వేళ జ్ఞాపకాలు బరువయ్యాయి- రిషిధారని కలిపిన కాగితపు పడవలు


కనకం వాళ్ళు లోపలికి వెళ్లిపోగానే కావ్య అక్కడి నుంచి వెళ్లబోతుంటే కళ్యాణ్ వచ్చి ఆపుతాడు. ఇక్కడి దాకా వచ్చి ఫంక్షన్ కి రాకపోవడం ఏంటి అని స్వయంగా ఆహ్వానించి మరీ లోపలికి తీసుకుని వెళ్తాడు. స్వప్నని ఎలాగైనా రాజ్ కి దగ్గర చేయడం కోసం కనకం అక్కడ సాంస్కృతిక కార్యక్రమంలో డాన్స్ చేసే అమ్మాయి కిందపడిపోయేలా చేస్తుంది. తను డాన్స్ చేయలేనని అనడంతో కనకం కూతురు స్వప్నకి ఆ గెటప్ వేస్తుంది. కానీ స్వప్న తనకి భరతనాట్యం రాదు కదా అని బిక్క మొహం వేస్తుంది. అప్పుడే కావ్య వాళ్ళకి కనిపిస్తుంది. వెంటనే సమయానికి వచ్చావ్ వెంటనే తనకి నాట్యం నేర్పించమని తల్లి కనకం బతిమలాడుతుంది. ఇంతమందిలో ఎలా నేర్పించాలని కావ్య అనేసరికి అక్కడే ఉన్న తెర దించుతుంది కనకం. దానికి కొనసాగింపే పైనున్న ప్రోమో.