Trinayani july 25th: విశాల్ సుమనతో సీమంతానికి డబ్బులు నేను ఇస్తాను అని అనటంతో వద్దు బావ.. మళ్లీ మా అక్క తిడుతుంది అయినా నాకు ఎవరి సొమ్ము అవసరం లేదు. నా తాళి అమ్ముకొని మరి సీమంతం చేసుకుంటాను అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే నయని తాళిబొట్టు ఎప్పుడూ తీస్తారో తెలుసా అని అనటంతో మొగుడు చచ్చినప్పుడు ఆయన నాకు మొగుడు ఉన్నా లేకున్నా ఒకటే అని అనడంతో వెంటనే అందరూ షాక్ అవ్వగా తిలోత్తమా లాగి చెంప పగలగొడుతుంది.


ఇంకొకసారి నా చిన్న కొడుకు గురించి తప్పు చేసి మాట్లాడితే బాగుండదు అని ఫైర్ అవుతుంది. గాయత్రి అక్క గురించి ఆలోచిస్తూ ఉంటే నీ పాడు ఆలోచనలతో నా మైండ్ అంతా డిస్టర్బ్ చేసావు అని అంటుంది. ఇక నయని దంపతులు అవసరం లేదు గాయత్రి అమ్మ సజీవంగానే ఉంది అని డైలాగులు చెప్పి అక్కడ నుంచి వెళ్తారు.


గాయత్రి పాపను ఎత్తుకొని ఉన్న విశాల్ బ్యాంకు కి వెళ్లి నీ ఫింగర్ ప్రింట్ తో సీజ్ చేయించాను కాబట్టి సరిపోయింది. లేదంటే అమ్మ అన్ని డబ్బులు ఖర్చు పెట్టేది అని చెబుతూ ఉంటాడు. అప్పుడే నయని వచ్చి కూతురితో ఏమో మాట్లాడుతున్నావు అనటంతో.. నా బాధలు చెప్పుకుంటున్నాను అని అంటాడు. కాసేపు మాట్లాడిన తర్వాత నయని అసలు గాయత్రి అమ్మగారిని బ్యాంకుకు ఎవరు తీసుకెళ్లారు అనటంతో విశాల్ కంగారు పడినట్లు కనిపిస్తాడు.


నాకెందుకో అమ్మగారు రౌడీలకంటపడిందేమో.. అంత డబ్బుంది కదా ఎవరో ఒకరు కన్ను వేస్తారు అని అనటంతో విశాల్ అలా ఎవరు ఉండరు అంటూ అమ్మ వచ్చిందని సంతోషంగా ఉంది అని అంటాడు. వెంటనే నయని నీలో ఆ సంతోషం కాకుండా కంగారు ఎక్కువ కనిపిస్తుంది అని అనటంతో విశాల్ కవర్ చేసుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే హాసిని, నయని హాల్లోకి వచ్చి ఇంట్లో వాళ్లందర్నీ పిలుస్తారు.


ఇక ఇప్పుడు వచ్చేది పద్మిని మాసం అని శ్రీకృష్ణునికి పూజలు చేయాలి అనగా వెంటనే సుమన ఈ పూజ ఎప్పుడు చేసినట్లు నాకైతే గుర్తుకు రావడం లేదు అని అంటుంది. ఈ పండుగను మూడు సంవత్సరాల ఒక్కసారి చేస్తారు అని ఆ పండుగ గురించి వివరిస్తుంది నయని. అంతేకాకుండా అందరూ ఫ్రెష్ గా స్నానం చేసి పూజ చేయాలి అనడంతో ఇప్పుడే స్నానం చేసి మళ్లీ చేయలేము అని అంటాడు వల్లభ.


కానీ హాసిని స్నానం కచ్చితంగా చేయాలి అనటంతో అందరం చేస్తామంటారు. అది కూడా ఆవు పేడ పూసుకొని చేయాలి అనటం తో తిలోత్తమా ఛీ అంటూ చీదరగొడుతుంది. నేను చెయ్యను అని మొండి చేస్తుంది. వెంటనే ఎద్దులయ్య తిలోత్తమా చీరకు శ్రీకృష్ణుని ఆయుధమైన శంఖం ఉందని నయనిని చూడమని అనడంతో చీరకు శంఖం ఉంటుంది. అసలు ఇది నా చీరకు ఎలా వచ్చింది అని తిలోత్తమా ఆశ్చర్యపడుతుంది.


వెంటనే ఎద్దులయ్య అలా ఎందుకు వచ్చిందో మీరే పసిగట్టాలి అనటంతో.. విక్రాంత్ నువ్వు.. శ్రీకృష్ణుడి  పూజ చేయనందుకు సాక్షాత్తు ఆ దేవుడే అలా వచ్చి ఆ రూపంలో చెప్పాడు అని అనటంతో సరే చేస్తాను అని అంటుంది తిలోత్తమా. ఇక స్నానానికి ఏర్పాట్లు గార్డెన్ లో పెట్టమని హాసిని విక్రాంత్ కు చెబుతుంది.


also read it : Krishnamma kalipindi iddarini July 24th: ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సీరియల్: ఆదిత్య ప్రేమ గుట్టు బయట పెట్టడానికి ప్లాన్ చేసిన సౌదామిని, మొదటి రోజే అత్తతో అవమానపడ్డ అఖిల


Join Us on Telegram: https://t.me/abpdesamofficial