Prema Entha Madhuram August 21th: ఆర్య వెనుకడుగు వేసినట్లే వేసి ముందుకు అడుగు వేసి ఛాయాదేవి గీసిన గీత దాటుతాడు. అది చూసి మరింత షాక్ అవుతారు ఛాయాదేవి, మదన్. వెంటనే ఛాయ వాట్ అని అనగా.. ఇక ఆర్య నేను వెళ్లి టెండర్ వేస్తే నా ఫ్యామిలీ జోలికి వస్తానని బెదిరించడం నాకు ఒక ఆఫర్ లాటింది అని అంటాడు. అను, పిల్లలు ఎక్కడున్నారో తెలియదు.. కాబట్టి నీ వల్ల పట్టుకుంటాను అంటాడు. ఈ క్షణం నుంచి నా మనషులు నెట్వర్క్ ని ఫాలో అవుతాయని వెళ్తాడు. ఇక జిండే కూడా వారికి పొగరుగా డైలాగ్ చెప్పి అక్కడ నుండి వెళ్తాడు.


తరువాత మాన్సీ ఛాయకు ఫోన్ చేసి ఆర్య పట్టుదల గురించి చెబుతుంది. ఆయన అంచనాలకు అందని వ్యక్తి అని.. టెండర్ విషయంలో ఆయనను ఎంత బెదిరించిన వేస్ట్ అని ఆర్య గురించి గొప్పగా చెప్పి జాగ్రత్తగా ఉండమని అంటుంది. దానికి ఛాయా సరే అని ఇక మనం ఎప్పుడు కలుసుకుందాం అనటంతో నేను నేరుగా కలవను ఫోన్లోనే మాట్లాడుతాను. కొన్ని రోజుల వారి కంట పడకపోవటమే మంచిది అని అంటుంది.


ఇక టెండర్ ఆఫీస్ అను వాళ్ళ అమ్మ చేతి వంట ఫుడ్ ఆర్డర్ చేయటంతో.. అన్ని ఏర్పాట్లు చేస్తారు అను, మాన్సీ. వాళ్ళ దగ్గరికి మేనేజర్ ప్రసాద్ వచ్చి అమ్మ చేతి వంట కాన్సెప్ట్ గురించి పొగుడుతాడు. కాసేపట్లో టెండర్ వేయటానికి బిజినెస్ మాన్ లు అందరు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళుకు ఏం కావాలో దగ్గరుండి చూసుకోమని అంటాడు.


మరోవైపు ఆర్య, అను ల ఛాలెంజ్ లు, వారి మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతుంది. అసలు వాళ్లు నా గురించి ఏమనుకుంటున్నారు అనటంతో వెంటనే మదన్.. మీరు మాటలకు తప్ప చేతలకు పనికిరారు అని అనటంతో ఛాయ అతడిపై కోపంగా అరుస్తుంది. దాంతో మదన్ నా మీద అరవటం కాదు వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచించమని అంటాడు. విడిగా ఉంటేనే ఇంత అర్థం చేసుకుంటున్నారు కలిసి ఉంటే మనల్ని కబడీ ఆడుకునే వాళ్లని అనటంతో ఛాయ ఆలోచనలో పడుతుంది.


ఇక టెండర్ కోసం వచ్చిన బిజినెస్ ఉమెన్స్ కాఫీ బాగుంది అనటంతో అక్కడికి మేనేజర్ ప్రసాద్ వచ్చి అమ్మ చేతి వంట నుండి క్యాటరింగ్ ఇచ్చాము అంటూ వారికి వాళ్ల గురించి గొప్పగా చెబుతాడు. అప్పుడే ఆర్య వాళ్ళు ఆ మాటలు విని అక్కడున్న అను వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మొత్తానికి బిజినెస్ లోకి బాగా దూసుకెళ్తున్నారు అని అనటంతో ఇదంతా మీ వల్లే అని అను అంటుంది.


ఇక అను మీరు కూడా టెండర్ వేశారట కదా మీకే టెండర్ వస్తుంది అని నమ్మకంతో చెబుతుంది. ఆర్య థాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక ఆర్య డల్ గా ఉన్నాడని గమనించిన ప్రీతి సర్ డల్ గా ఉన్నాడు కదా అనడంతో.. ఏం లేదు అలా అని ఆలోచిస్తారు కానీ ఆయన భయపడడు. ఆయన ప్లాన్స్ అయనకు ఉంటాయని ఆర్య గురించి చెబుతుంది.


దీంతో ప్రీతి కచ్చితంగా ఆర్య టెండర్ గెలుచుకుంటాడు. ఎందుకంటే పక్కన నువ్వు ఉన్నావు కదా అని అంటుంది. ఆ తర్వాత కొందరు బిజినెస్ మాన్స్ ఫుడ్  బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మేనేజర్ ప్రసాద్ వచ్చి అవును అని అమ్మ చేతి వంట ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడికి అను, ప్రీతిని తీసుకువచ్చి వారిని వాళ్లతో పరిచయం చేస్తాడు.


ఇక వెంటనే ఆ బిజినెస్ మాన్స్ మీరు మా కంపెనీ తో టయ్యప్ అవుతారా అనటంతో తమకు ఆల్రెడీ స్పాన్సర్స్ ఉన్నారు అని ప్రీతి అంటుంది. కానీ వాళ్ళు మాత్రం వారి కంటే ఎక్కువగా అందిస్తాము అని అనగా వెంటనే అను ఈ ఫుడ్ యాప్ ను సొసైటీకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాము అని అంటుంది. అక్కడే ఉన్న ఆర్య, ఛాయ అను మాటలు వింటారు.


అన్ని కంపెనీలు ఇలాగే ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి చాలా వచ్చాయని.. అన్ని పబ్లిసిటీవే అని కానీ ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ తమ ఆలోచనలు సపోర్ట్ చేస్తూ తమకు స్పాన్సర్ చేయడానికి వచ్చారని చెప్పటంతో ఆ కంపెనీ పేరు విని ఆర్య ఒకేసారి అనువైపు చూస్తాడు. అందరూ ఆర్య వర్ధన్ గొప్పతనానికి అభినందనలు తెలుపుతారు.  ఇక ఛాయ బాగా కోపంతో రగిలిపోతుంది.


ఆ తర్వాత బయటికి వచ్చిన అనుని ఛాయ పక్కకి లాక్కెల్లి ఆర్య టెండర్ గురించి బెదిరిస్తుంది. ఇక అను నేనే లొంగనప్పుడు ఎందుకు బెదిరిస్తున్నావు అని ధైర్యంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా తన భర్త టెండర్ గెలుస్తాడని ఇక్కడికి వచ్చాను అని పొగరుగా సమాధానం ఇస్తుంది. అంతేకాకుండా తనకు కోపం వచ్చే విధంగా మాట్లాడే అక్కడి నుంచి వెళ్తుంది.


ఆ తర్వాత ఛాయా ఆర్య దగ్గరికి వెళ్లి టెండర్ గురించి విత్డ్రా చేసుకోమని బెదిరిస్తుంది. దాంతో ఆర్య తను భయపడుతుంది అని కనిపెట్టి తనకు వార్నింగ్ ఇస్తాడు. రిజల్ట్ వచ్చేవరకు ఎదురుచూడు అని చెప్పి లోపలికి వెళ్తాడు. దాంతో ఛాయాదేవి చిరాకు పడి మదన్ కి ఫోన్ చేస్తుంది. దాంతో అతడు టెండర్ ఎలాగైనా ఆర్యనే గెలుస్తాడు అక్కడుండి ఇన్సెల్టగా ఫీల్ అవ్వడం ఎందుకని వెళ్లిపోయాను అని అంటాడు.


దాంతో ఛాయా కు మరింత కోపం వస్తుంది. ఇక తను కూడా లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత బిజినెస్ మాన్స్ ఆ టెండర్ ఛాయాదేవికి చెందింది అని చెప్పటంతో ఛాయా తెగ సంతోషంగా కనిపిస్తుంది. అప్పుడే మరొక టెండర్ ఉందని చెక్ చేయమని అనటంతో ఆ బిజినెస్మేన్ ఇది లీస్ట్ టెండర్ అని ఆర్యవర్ధన్ ఇండస్ట్రీ గురించి చెబుతాడు. దాంతో ఛాయా కోపంగా రగిలిపోతుంది. అందరూ సంతోషంగా క్లాప్స్ కొడతారు. ఇక ఆర్య దగ్గరికి వచ్చి అందరూ అభినందనలు తెలుపుతారు. అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఛాయా.


also read it : Prema Entha Madhuram August 19th: భార్య పిల్లలను చంపేస్తానంటూ ఆర్యకు ఛాయాదేవి బెదిరింపులు-తిరిగి షాకిచ్చిన ఆర్య?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial