Prema Entha Madhuram August 30th: స్కూల్ డెవలప్మెంట్ కోసం ఆర్య ఆ చుట్టుపక్కల ఉన్న ఛాయాదేవి ల్యాండ్ ను కావాలని అడగటంతో ఛాయాదేవి ఆ ల్యాండ్ అమ్మను అని అనటంతో.. ఆ డీల్ కుదిరించడానికి వచ్చిన ఎమ్మెల్యే షాక్ అవుతాడు. అంతేకాకుండా స్కూల్ ఉన్న స్థలం కూడా తనదే అని అనటంతో వెంటనే ప్రిన్సిపాల్ లేదని తనుకు ఒక వ్యక్తి అమ్మాడని డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి కావాలంటే చూపిస్తాను అని అంటుంది.


అప్పుడే మాన్సీ మధ్యలో కలగజేసుకొని.. ఇన్నాళ్లు ఛాయాదేవి గారు అమెరికాలో ఉన్నారు. దాంతో కొందరు తన భూములను అక్రమంగా అమ్ముకున్నారని అంటుంది. ఇక జిండే వెంటనే ఫైర్ అవ్వటంతో ఛాయాదేవి మాత్రం మరొక కండిషన్ పెడుతుంది. ఈ స్కూల్ ఉన్న ల్యాండ్ కూడా తనదే కాబట్టి స్కూల్ ని తీసేయాలి అని.. తన ల్యాండ్ తనకు ఇచ్చేయాలి అని డిమాండ్ చేస్తుంది. దాంతో ప్రిన్సిపాల్ కంగారు పడటంతో వెంటనే ఆర్య ఆయనను కూల్ చేసి ఛాయాదేవితో.. ల్యాండ్ అమ్ముతారా అమ్మరా అని మర్యాదగా అడుగుతాడు.


దాంతో ఛాయాదేవి అమ్మను అని.. మరో వారం రోజుల్లో స్కూల్ మొత్తం ఖాళీ చేయాలి అని.. లేదంటే స్కూల్ కూలగొట్టేస్తాను అని బెదిరిస్తుంది. ఇక ఆర్య కూడా తనతో ఎక్కువగా వాదించకుండా తనకు కూడా ఆ స్కూల్ ఖాళీ చేసేది లేదని.. అంతేకాకుండా స్కూల్ డెవలప్ చేస్తాను అని ప్రిన్సిపాల్ కి కూడా మాటిచ్చి ఛాయాదేవికి ఛాలెంజ్ చేస్తాడు. దాంతో ఛాయాదేవి ఛాలెంజ్ చేస్తున్నావా అనటంతో.. నేను ఛాలెంజ్ చేయను ఏదైనా ఛాలెంజింగ్ గా చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు.


దాంతో ఛాయాదేవి బాగా ఫైర్ అవుతుంది. ల్యాండ్ కోసం తనని బ్రతిమాలుతాడని అనుకున్నాను కానీ నాకే సవాల్ విసిరాడు అని కోపంగా అంటుంది. ఆ తర్వాత అను పిల్లలను తీసుకెళ్లి ఆర్య బ్యానర్ ఉన్న పక్కన నీడలో కూర్చోబెడుతుంది. దాంతో అక్షర తన తల్లితో.. ఈ బ్యానర్ నీడ ఉందని ఇక్కడికి తీసుకొచ్చావు కదా అనడంతో.. దాంతో అను.. ఆయన దగ్గర లేకున్నా ఆయన నీడలోనైనా ఉందామని మనసులో అనుకుంటుంది.


ఇక అప్పుడే ఆర్య వాళ్ళు బయటికి వచ్చి నిలబడగా.. ఛాయాదేవి, మాన్సీ అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతారు. అను పిల్లలతో భోజనం చేయించిన తర్వాత స్వీట్స్ ఇస్తుంది. ఇక అక్షర ఆర్య ని చూసి ఆ స్వీట్ బాక్స్ తీసుకెళ్లి తనకు మోటివేషన్ చేసినందుకు థాంక్స్ అని ఆర్యకు చెప్పి స్వీట్ తీసుకోమని అంటుంది.  ఇక అను అక్షర, ఆర్యను అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక తన తల్లి స్వీట్స్ చేసింది అని చెప్పటంతో మీ అమ్మగారు ఎక్కడ అని ఆర్య అడగటంతో వెంటనే అను అక్కడి నుంచి పక్కకు వెళుతుంది.


ఇక ఆర్య చూసేసరికి అను అక్కడ ఉండదు. అభయ్ కాస్త కోపంగా చూస్తున్నట్లు కనిపించడంతో.. మీ అన్నయ్య ఏంటి కోపంగా చూస్తున్నాడు అని అడుగుతాడు ఆర్య. దాంతో తను మా అన్నయ్యకి ఒకటే స్వీట్ ఇచ్చాను అందుకే కోపంగా ఉన్నాడు అని అంటుంది అక్షర. ఇక ఆర్య ఆ స్వీట్ టేస్ట్ చేసిన తర్వాత అచ్చం అను చేసినట్లు అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఇక స్వీట్ బాగుంది అని అంటాడు. ఇక తనకు ఒక గిఫ్ట్ కావాలి అని ఆర్య అడగటంతో.. వెంటనే అక్షర తనకు కిస్ ఇస్తుంది. అది చూసి అను మురిసిపోతుంది.


ఆ తర్వాత అక్షర ఆర్యతో కాసేపు మాట్లాడి తన అన్నయ్య దగ్గరికి రాగా అభయ్ కాస్త సీరియస్ గా ఉంటాడు. నాకు కాకుండా థర్డ్ పర్సన్ కి స్వీట్ ఎందుకు ఇచ్చావు అంటూ కాస్త గొడవ చేస్తాడు. దాంతో అక్షర సారీ చెప్పి స్వీట్ ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా అదే సమయంలో ఒక రౌడీ తమను ఫాలో అవుతాడు. వెంటనే అను అది గమనించి వెంటనే అక్కడి నుంచి అతడికి కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఆ రౌడీ కి మాన్సీ ఫోన్ చేసి అను అడ్రస్ దొరికిందా.. వారి పిల్లలని చూసావా అని అడగటంతో వాళ్ళు మిస్ అయ్యారు అని చెబుతాడు. దాంతో తను అతనిపై ఫైర్ అవ్వటంతో.. కచ్చితంగా వెతుకుతాను అని అంటాడు ఆ రౌడీ. ఇక మాన్సీ ఎలాగైనా అనుని, పిల్లలను పట్టుకొని వదిలేది లేదు అని పొగరుగా అనుకుంటుంది.


also read it : Ennenno Janmala Bandham August 29th: భార్యపై ఫైరైన యష్.. వేదను ఆక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించిన అభి?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial