Prema Entha Madhuram July 14th: ఆర్య ఇంటికి వెళ్లిన పద్దు, సుబ్బు అను గురించి చెప్పుకుంటూ బాగా కుమిలిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లిందో.. కనీస మనకి ఏమి చెప్పకుండా పిల్లలతో ఎక్కడ ఉందో బాధపడుతూ ఉంటారు. ఇక పద్దు సుబ్బు గురించి చెబుతూ.. ఈయన అను గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు అని.. ఇప్పుడు వస్తుంటే కూడా రోడ్డుపై కళ్ళు తిరిగి కింద పడ్డాడు అని అను లేకపోయేసరికి ఉండలేకపోతున్నాడు అని.. అంతేకాకుండా మొన్న సైకిల్ తీసుకొని అనుని వెతకడానికి సిద్ధమయ్యాడు అని.. కానీ వెళ్తుండగాని కింద పడిపోయాడు అని చెబుతుంది.
ఇక ఆ మాటలు విని ఆర్య వాళ్ళు బాధపడతారు. ఇక అంజలి ధైర్యం ఇస్తుంది. అను ఎక్కడ ఉన్న తిరిగి వచ్చేస్తుంది అని.. ఆర్య సార్ వెతుకుతున్నాడు అని.. మీరు ఏమి బాధపడకండి అని ధైర్యం ఇస్తూ ఉంటుంది. ఇక ఆర్య కూడా మీకు నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంటూ.. కానీ అనుని మాత్రం కచ్చితంగా తీసుకువస్తాను అని అంటాడు. మరోవైపు అను తన ఇంటిని శుభ్రం చేస్తూ ఉండగా ఆ సమయంలో ఓటర్ సర్వే చేసిన వ్యక్తి అక్కడ పడేసిన పాంప్లెట్ తీసుకుంటుంది.
అందులో చూసేసరికి ఆర్య ఫోటో ఉండటంతో ఆర్య సార్ ఫోటో ఉంది ఏంటి అని ఆశ్చర్య పడుతుంది. ఇక బిజినెస్ కి సంబంధించిందేమో అనుకొని ఆ ఫోటోపై చెయ్యి పెడుతుంది. దీంతో ఆర్య చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఫోటోపై అను చెయ్యి పెట్టడం వల్ల తన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయి తన అడ్రస్ తెలుస్తుంది. వెంటనే ఆ విషయం ఆర్య కు తెలియటంతో వెంటనే ఆర్య.. సంతోషంలో అను అడ్రస్ దొరికింది అని అనటంతో అందరూ సంతోషపడతారు.
ఇప్పుడే వెళ్లి అనుని తీసుకొస్తాను అని జెండే ను తీసుకెళ్తాడు. ఇక మాన్సీ కూడా ఆ పాంప్లెట్ చూసి ఎక్కడిది అని ఇంట్లో పని మనిషిని అడగటంతో.. ఓటర్ సర్వే చేసే వ్యక్తులు ఇది ఇచ్చి వెళ్లారు అని అంటుంది. దాంతో వాళ్లు ఇదెందుకు పంచారో అనుకొని మళ్లీ లైట్ తీసుకుంటుంది. అప్పుడే లాయర్ ఫోన్ చేసి డీటెయిల్స్ పంపియమని అనడంతో.. తన ఫోన్ కి ఫ్లాష్ అవ్వడం వల్ల పాంప్లెట్ మీద ఉన్న చిన్న బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ కనిపించడంతో.. ఇదంతా అనుని వెతకడం కోసం ప్లాన్ చేశాడు అని తెలుసుకుంటుంది.
ఇక వెంటనే అను అడ్రస్ తెలిసిపోతుంది అని అనుని అక్కడి నుంచి లేకుండా చేయాలి అని రౌడీలోకి ఫోన్ చేసి అక్కడ అను తో పాటు ఆ ఇల్లు లేకుండా చేయాలి అని అంటుంది. మరోవైపు ఆర్య వాళ్ళు లొకేషన్ చూసుకుంటూ వెళ్తారు. ఇక అను రేష్మ ఇంటికి వెళ్లగా అక్కడికి ప్రీతి కూడా వస్తుంది. ఇక ముగ్గురు కూర్చుని సరదాగా మాట్లాడుతుంటారు.
ఇక అను ఇంటి దగ్గరికి రౌడీలతో పాటు మాన్సీ వచ్చి అదే ఇల్లు అని చూపించి ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే కరెక్టు కాదు అని వెళ్ళిపోతుంది. ఇక రౌడీలు ఆ ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటిస్తారు. అప్పుడే ఆర్య కూడా ఆ లొకేషన్ కి చేరుకోగా అక్కడ తగలబడుతున్న ఇల్లుని చూసి అను అంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఆర్య అను అని అనటంతో ఆ మాటలు విన్న అను ఆర్య సర్ అని అనుకుంటుంది.
ఇంటి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇల్లు తగలబడిపోతుంది. ఇక ఆర్య మంటల్లో లోపలికి వెళ్తాడు. అనుకూడా అక్కడ నుంచి ఆర్య దగ్గరికి వెళ్లాలని ప్రయత్నించగా రేష్మ.. వెళ్తే ఆర్య సార్ నిన్ను చూస్తాడు అని చెబుతుంది. దాంతో అను అక్కడే ఉండిపోతుంది. ఇక జెండే ఆర్య ని బయటికి తీసుకుని వస్తాడు. లోపల అను పిల్లలు లేరు అని.. మళ్లీ తనకు దూరం కావాలి అని ఎక్కడికో వెళ్లిపోయింది అని బాధపడతాడు. ఇక ఆర్యను అలా చూసి అను కూడా చాలా బాధపడుతుంది. ఆర్య ఇప్పుడు ఇంటికి వెళ్లి సుబ్బు వాళ్లకు ఏం చెప్పాలో అని బాధపడతాడు. తర్వాత జెండే ఆర్యను అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇక ప్రీతి అనుని తీసుకెళ్తుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial