Nindu Noorella Saavasam October 6th: ఈరోజు ఎపిసోడ్ అరుంధతి: అలా అనకండి మిస్టర్ గుప్తా నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి.


చిత్రగుప్తుడు : ఒక నిమిషం కూడా ఉండకూడదు అంటే మళ్ళీ ఇలా అడుగుతావేంటి బాలిక.


అరుంధతి: నా మాట వినండి మిస్టర్ గుప్తా, మీరు మంచివారని నాకు తెలుసు అని బ్రతిమాలుతూ ఉంగరం తీయటానికి ప్రయత్నిస్తుంది.


చిత్రగుప్తుడు: నేనేమీ చేయలేను, నా చేయి వదులు అని బలవంతంగా చేయి విడిపించుకుంటాడు.


ఆ సమయంలో ఉంగరం అరుంధతి చేతికి వచ్చేస్తుంది. కానీ అది చిత్రగుప్తుడు గమనించడు. అప్పుడు ప్రకృతి కంపించినట్లుగా అవుతుంది.


చిత్రగుప్తుడు : చూసావా ప్రకృతికి విరుద్ధంగా మాట్లాడితే ప్రకృతి ఎలా పలుకునో.. సమయం మించిపోతుంది పదా వెళదాం.


అరుంధతి: సరే వస్తాను కానీ నాకు ఒక్క ఆఖరి కోరిక ఉంది తీర్చండి.


చిత్రగుప్తుడు : నేను ఎలాంటి కోరిక తీర్చలేను.


అరుంధతి: చనిపోయే వాడికి కూడా ఆఖరి కోరిక తీరుస్తారు.


చిత్రగుప్తుడు: జాలిగా నీ కోరిక చెప్పు వీలైతే తీరుస్తాను.


అరుంధతి: ఒక్కసారి మా ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్ళందరినీ చూసి అప్పుడు మీతో వచ్చేస్తాను.


చిత్రగుప్తుడు : అది కుదరని పని, నువ్వు ఇంటికి వెళితే మళ్ళీ నాతో రావడానికి ఇష్టపడవు.


అరుంధతి : నా బాధని అర్థం చేసుకోండి. ఒక్కసారి ఇంటికి వెళ్లి వెంటనే పైకి వెళ్ళిపోదాం అంటూ బ్రతిమాలుతుంది.


చిత్రగుప్తుడు: సరే బ్రతిమాలుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్తాను ఇంట్లో వాళ్ళని చూస్తాను అంటే కుదరదు.


అందుకు అరుంధతి ఒప్పుకోవటంతో ఇద్దరూ ఇంటి వైపు బయలుదేరతారు. మరోవైపు మిస్సమ్మ ఇంటికి వస్తుంది కానీ లోపలికి రావడానికి భయపడుతుంది.


మిస్సమ్మ: నేరుగా వెళ్లి తాళాలు ఇచ్చేసి సారీ చెప్పి ఏం చేసైనా సరే ఆయనతో సంతకం పెట్టించాలి అనుకుంటుంది. కొంత దూరం వెళ్ళిన తరువాత ముందుకు వెళ్లడానికి భయపడుతుంది. అమర్ తో ముందే పరిచయం ఎందుకు పెట్టాలి, పెట్టిన వాడివి గొడవ ఎందుకు సృష్టించాలి అంటూ దేవుడిని తిట్టుకుంటుంది. ఇక తప్పదు అనుకొని ముందుకు వెళ్లి భయంగా నిల్చుంటుంది.


Also Read: రాజ్ కి ముద్దు పెట్టిన కావ్య- ప్రెగ్నెంట్ నాటకానికి చెక్ పెట్టబోతున్న స్వప్న!


మనోహరి: ఏంటమ్మా మాతోపాటు కారు ఎక్కాలి కదా, నీకోసం అందరం ఇలా వెయిట్ చేయాలా..


పనమ్మాయి : కిస్ నాకైనా ఇవ్వాల్సింది. చూసావా అందరూ ఎలా బయట వెయిట్ చేస్తున్నారో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు.


తడబడుతూనే చూసుకో లేదండి అని చెప్పి తాళాలు రాథోడ్ కి ఇస్తుంది మిస్సమ్మ.


ఆ గొంతు విని అలర్ట్ అవుతాడు అమరేంద్ర. ఎవరా అని వెనక్కి తిరిగే లోపు అది గమనించిన మిస్సమ్మ తను వెనక్కి తిరిగిపోతుంది.


అమర్: వెనక్కి తిరుగు.


మిస్సమ్మ : గుర్తుపట్టేసాడా.. నా పని అయిపోయినట్లే దేవుడా ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చెయ్యు.


అమర్: తిరగమంటుంది మిమ్మల్నే, మీ వాయిస్ ఎక్కడో విన్నట్లుగా ఉంది. ఒకసారి తిరగండి.


అమర్ తండ్రి : కేర్ టేకర్ ని మేము సెలెక్ట్ చేస్తే నీకు ఎలా తెలుస్తుంది.


అమర్: లేదు నాన్న, ఈ గొంతు బాగా విన్నట్లుగా ఉంది. ఇన్ఫాక్ట్ రోజు వింటున్నట్లుగా ఉంది. అంటే ఆ అమ్మాయి నాకు బాగా తెలిసినట్టే.


Also Read: రిషి విశ్వరూపం - వసు వార్నింగ్ - వణికిపోయిన దేవయాని , శైలేంద్ర!


మనోహరి : వీళ్ళిద్దరూ బయట కలుస్తున్నారా అని కంగారుగా అనుకుంటుంది.


మిస్సమ్మ: నాది ఏమైనా శ్రేయ ఘోషల్ గొంతా..మర్చిపోవచ్చు కదాసార్ అనుకుంటుంది. ఇక తప్పక భయంగా వెనక్కి తిరుగుతుంది.


మిస్సమ్మ మొహాన్ని చూసిన అమర్ కోపంతో రగిలిపోతూ తీక్షణంగా ఆమెనే చూస్తూ ఉంటాడు.


మిస్సమ్మ : గన్ తో కాదు చూపులతోనే చంపేసేలా ఉన్నాడు అనుకుంటుంది.


ఏమి మాట్లాడకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు అమర్.


అమర్ పేరెంట్స్, రాథోడ్ కూడా లోపలికి వెళ్ళిపోతారు.


అమర్ కూతురు : మేము ఎన్నో ప్లాన్ చేసి నిన్ను బయటికి పంపించేద్దాం అనుకున్నాము కానీ ఇకపై మేము ఏ ప్లాన్స్ వెయ్యక్కర్లేదు. మా డాడీ మాకు ఆ ఛాన్స్ ఇచ్చే లాగా లేరు. ఆయనే నిన్ను తరిమేస్తారు అనుకుంటూ పిల్లలందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు.


మనోహరి: నీ గొంతు బాగా తెలుసు అంటున్నాడు మీరిద్దరూ బయట కలుసుకుంటున్నారా?


మిస్సమ్మ: నేను షాక్ లో ఉన్నాను నన్నేమీ అడగకండి.


అలా అనడంతో మనోహరి వాళ్లు లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిస్సమ్మ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్లిన అమర్ కోపంగా రాథోడ్ ని పిలుస్తాడు.


రాథోడ్: ఈయన ఇంత కోపంగా పిలుస్తున్నాడు ఏంటి అంత తప్పు నేనేం చేశాను అనుకుంటూ లోపలికి వెళ్తాడు.


అమర్ తల్లి : వీళ్ళిద్దరికీ ఏముందే పరిచయం ఉందా.. వెళ్లి ఆ అమ్మాయిని అడుగుదామా..


అమర్ తండ్రి : వద్దు, అసలు విషయం తెలుసుకోకుండా పెద్దరికం చూపిస్తే బాగోదు.


పిల్లలు: డాడీ అంత కోపంగా ఉన్నారంటే వాళ్ళ ఇద్దరికీ ముందు పరిచయం ఉందా..


మనోహరి: వీళ్ళిద్దరికీ కచ్చితంగా బయట ఏదో సంబంధం ఉంది.


ఇలా ఎవరి గదిలో వాళ్లు,ఎవరి మటుకు వాళ్లు వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది అనుకుంటారు.


భయంగా అమర్ గదిలో అడుగుపెడతాడు రాథోడ్.


Also Read: కన్నీళ్లు పెట్టిస్తున్న అరుంధతి కోరిక - చిత్రగుప్తుడికి ఎసరు పెట్టేసిన అరు!


అమర్: ఆ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది అని కోపంగా అడుగుతాడు.


రాథోడ్: నేనే తీసుకుని వచ్చాను అంటే కాల్చి చంపేస్తాడేమో అని మనసులో అనుకొని, పేపర్లో యాడ్ చూసి వచ్చినట్టు ఉంది సార్ అని అమర్ కి చెప్తాడు.


అమర్: ఆమెని ఎవరు సెలెక్ట్ చేశారు


రాథోడ్: అందరం కలిసి సెలెక్ట్ చేసాం సార్. ఆ విషయం మీకు కూడా చెప్పామ్ కదా. ఆ అమ్మాయే ఈ అమ్మాయి.