Madhuranagarilo July 18th: శ్యామ్ రాధ తో నీ ప్రవర్తన చాలా మంచిది కాబట్టి నీతో ప్రేమలో పడ్డాను అని అంటాడు. దాంతో రాధ నేను ప్రవర్తించిన విధానం వల్ల మీరు నాపై మనసు చూపించారు.. నేనేమైనా మీ పట్ల ప్రేమ పుట్టించే విధంగా ప్రవర్తిస్తే సారీ అని చెబుతోంది. నువ్వెందుకు సారీ చెబుతున్నావు నేను సారీ చెప్పాలి.. నడి రోడ్డుపై నిన్ను అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని సారీ చెప్పి కాసేపు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్తారు.


చీకటి పడటంతో గన్నవరం, గోపాల్ మందు తాగుతూ ఉండగా అప్పుడే అక్కడికి డబ్బులతో ఇబ్బంది పడుతున్న నెల్సన్ అక్కడికి వచ్చి తన బాధని చెప్పకుంటాడు. తన భార్య పాత చీరలు అమ్మిన వాళ్లను బాగా తిట్టుకుంటూ ఉంటాడు. దాంతో గన్నవరం అలా తిట్టొద్దు అని మందు పోస్తాడు. ముగ్గురు కలిసి మందు తాగుతూ బోనాల గురించి మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే మధుర బోనం చేస్తూ ఉంటుంది.


ఇక అక్కడికి రాధ రావడంతో తనని కూడా బోనం ఎత్తుకోవచ్చు కదా అనడంతో.. రాధ తన మనసులో పండు ఆరోగ్యం కుదుటపడాలి అంటే పండు తండ్రి తిరిగి రావాలని కోరుకుంటున్నాను అని బోనం ఎత్తుకోవటానికి సరే అంటుంది. ఇక పండు ఆరోగ్యం కోసం ఎత్తుకుంటాను అని అనటంతో శ్యామ్ అప్పుడే వచ్చి బోనం ఎత్తుకుంటే వారికి సమర్పించే వరకు మధ్యలో దింపొద్దు అని.. నువ్వు పండు ఆరోగ్యం గురించి మొక్కావని నాకు తెలుసు.. మన ఇద్దరి కోరికలు తీరుతాయి అని అంటాడు.


అప్పుడే అక్కడికి వచ్చిన సంయుక్త, అపర్ణ వారిద్దరి కోరికలు ఏంటి అని అనుకుంటారు. అంతేకాకుండా సంయుక్త తన తల్లితో శ్యాం ప్రపోజ్ చేసిన కూడా రాధ ఒప్పుకోను అన్నావు కానీ తనను చూస్తే అలా లేదు అని అనుమానం పడుతుంది. ఎలాగైనా తను బోనం అమ్మవారికి సమర్పించకుండా చూడాలి అని వాళ్ళ మమ్మీకి చెబుతుంది.


ఇక మధుర సంయుక్తను పలకరించి నైవేద్యం చేయమని అంటుంది. అపర్ణ కూడా సంయుక్త ని లోపలికి వెళ్లి నైవేద్యం చేయమని భయపడుతూ చెబుతుంది. ఇక తనకు నైవేద్యం చేయటం రాదు కదా అని లోపలికి వెళ్తుంది సంయుక్త. ఆ తర్వాత మధురవాళ్ళు నైవేద్యం పూర్తయిందా అని సంయుక్తను అడగటంతో ఇంకా మొదలుపెట్టలేదు అని ఇబ్బంది పడితే చెబుతుంది.


వెంటనే పండు ఆంటీకి నైవేద్యం చేయటం రాదేమో అని అనడంతో.. ఇన్ని రోజులు ఫారెన్ లో ఉన్నాను కదా మర్చిపోయాను అని అంటుంది సంయుక్త. దాంతో మధుర రాధ ను ప్రసాదం చేయమని చెబుతుంది. ఇక రాధ ప్రసాదం చేసి టేబుల్ పై పెట్టి సంయుక్తకు చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది. నువ్వు చేసిన ప్రసాదం అమ్మవారికి అందకూడదు అని ఆ పాత్ర పట్టుకుంటుండగా చెయ్యి కాలుతుంది.


వెంటనే అందరూ వచ్చి చెయ్యి కాలింది భోజనం ఎలా పట్టుకుంటావో అనటంతో పర్వాలేదు అని చెబుతుంది. తర్వాత అందరూ బోనం ఎత్తుకోగా డప్పు శబ్దాలతో డ్యాన్స్లతో తీసుకెళ్తుంటారు. శ్యామ్ తో తన పెళ్లి జరగాలి అని.. రాధ కోరుకున్న కోరిక తీరకూడదు అని మొక్కుతుంది సంయుక్త. ఇక తన తల్లికి ఏదో ఒకటి చేయమని అనటంతో వెంటనే అపర్ణ.. ఒకావిడ పట్టుకున్న నిప్పురవ్వలను కింద పడే విధంగా చేస్తుంది.


ఇక నిప్పులపై రాధ కాలు పెట్టడంతో తన కాళ్లు కాలిపోతుంది. శ్యామ్ వచ్చి ఏం జరిగింది అని అంటాడు. బోనం పక్కకు దించు చూస్తాను అనడంతో నేను దింపను అని అంటుంది రాధ. అయితే నేను ఎత్తుకుంటాను అని అనటంతో.. వద్దు బోనం నేనే ఎత్తుకోవాలి అని అంటుంది రాధ. కోరిక తీరాలి అంటే కచ్చితంగా బోనం ఎత్తుకుంటాను అని మొత్తానికి అమ్మవారికి బోనం సమర్పిస్తుంది.


అదే సమయంలో పక్కన ఒక ఆవిడ ఒంటిమిదికి అమ్మవారు పూనటంతో.. జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను అని అంటుంది. ఆవిడని చూసి రాధ ఆవిడ దగ్గరికి వెళ్లాలని అనుకుంటుంది. తర్వాయి భాగంలో రాధ కాళ్ళను పట్టుకొని శ్యామ్ వెన్నుపూస పూయడానికి ప్రయత్నించడంతో కాళ్లు పట్టుకోవద్దు అని అంటుంది. తప్పు చేసినప్పుడే కాళ్లు పట్టుకుంటారా అయితే నేను నీ విషయంలో తప్పు చేశాను కదా నన్ను పట్టుకొనివ్వు అని అంటాడు శ్యామ్.


also read it : Madhuranagarilo July 17th: ‘మధురానగరిలో’ సీరియల్: శ్యామ్ ను కాపాడిన రాధ.. బోనాల వేడుకలో అపర్ణ చేయనున్న కుట్ర?



Join Us on Telegram:  https://t.me/abpdesamofficial