Prema Entha Madhuram July 21th: బర్త్డే కేక్ లో మాన్సీ విషం కలుపుతుంది. మరోవైపు ఆర్య పిల్లల సర్ప్రైజ్ చూసి సంతోషపడుతాడు. ఇక నీరజ్ మరో సర్ప్రైజ్ ఉందని ఫోటో దగ్గరికి తీసుకెళ్లి అది ఓపెన్ చేయమని అంటాడు. ఇక ఓపెన్ చేశాక అందులో తన ఫోటో అను ఫోటో చూసి తనని మిస్ అయినందుకు బాధపడుతూ. అను కూడా ఆ ఫోటో చూసి తను కూడా కాస్త బాధపడినట్లు కనిపిస్తుంది.
అప్పుడే ప్రీతి వచ్చి కేక్ కట్ చేయమని పిలుస్తుంది. ఇక నీరజ్ క్యాండిల్ వెలిగించడం ఆ తర్వాత ఆర్య కేక్ కట్ చేయడం.. ఇక అందరూ ఆర్యకు కేక్ తినిపించడం.. ఆ తర్వాత ఆర్య అక్కడి నుంచి పక్కకు వెళ్లి రక్తం కక్కుకోవడం అంతేకాకుండా కన్ను మూయడం కూడా జరుగుతుంది కానీ ఇది మాన్సీ ఊహించుకుంటుంది. ఆ తర్వాత తేరుకొని ఇదంతా కలనా అనుకొని కాసేపట్లో ఇదే నిజం జరుగుతుంది అని అనుకుంటుంది.
ఇక ఆర్య కేక్ కట్ చేస్తున్న సమయంలో క్యాండిల్స్ లేకపోవటంతో వెంటనే అను క్యాండిల్స్ కోసం వెళ్లగా అక్కడ విషం బాటిల్ కనిపిస్తుంది. అది కేకులో కలిపే విషం అని తెలుసుకుంటుంది. ఇక ఆర్య పిల్లలతో కలిసి కేక్ కట్ చేయిస్తూ ఉండగా అప్పుడే అను వచ్చి ఆ కేకును పక్కకి పడేస్తుంది. అందరూ షాక్ అవ్వగా అందులో విషం ఉందని విషం బాటిల్ చూపిస్తుంది. వెంటనే జెండే ఇది ఎక్కడ దొరికింది అనడంతో కిచెన్ లో దొరికింది అని అక్కడ డ్రాప్స్ కూడా పడ్డాయి అని అంటుంది.
వెంటనే అన్ని డోర్లు క్లోజ్ చేసి అనుమానం గా ఉన్న వారిని పట్టుకోమని ఆర్య చెప్పటంతో అందరి దగ్గరికి వెళ్లి గమనిస్తుంటారు. టెడ్డీబేర్ ముసుగులో ఉన్న మాన్సీ దగ్గరికి వెళ్లి నీరజ్ ముసుగు తీయమని అనడంతో అప్పుడే ప్రీతి తను మా టీంలో నరేష్ అని చెబుతుంది. దాంతో ఆర్య వదిలేయమని అంటాడు. ఇక మాన్సీ బతికిపోయాను అని ఊపిరి పీల్చుకుంటుంది.
ఆ తర్వాత ఆర్య అనుకి థాంక్స్ చెప్పటంతో పాటు ప్రీతి టీం కి కూడా థాంక్స్ చెబుతాడు. ఇక అందర్నీ భోజనాలు చేయమని అంటాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు దూరంగా ఉన్నా కూడా దగ్గరలో ఉన్నట్లు అనిపిస్తుంది అని అంటాడు. మరోవైపు అను కూడా ఆర్యను తలుచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య దగ్గరికి సీతాకోకచిలుక వచ్చి వాలుతుంది. ఇక అది ఎగురుకుంటూ ముందుకు వెళుతున్న కొద్ది ఆర్య దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు.
అప్పుడే అను దగ్గరికి ప్రీతి వాళ్ళు వచ్చి ఆర్య సార్ మెచ్చుకున్నందుకు సంతోషంగా ఉన్నావా అని అడుగుతారు. అప్పుడే తమ టీం కేక్ తీసుకొని వచ్చి మీ బర్త్ డే అంట కదా మేడం ఇవాళ అని అనటంతో ఎవరు చెప్పారు అనటంతో వెంటనే రేష్మ నా కడుపులో మాట ఆగదు అంటూ నేనే చెప్పాను అని అంటుంది. ఇక అప్పుడే ఆర్య కూడా అటువైపు వస్తూ ఉంటాడు.
also read it : Rangula Ratnam July 20th: దేవ్ రాకతో మంచి జరగనుందా.. వర్ష కళ్ళే తన కళ్ళు అని తెలుసుకొని షాకైన శంకర్ ప్రసాద్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial