Telugu Classic Amrutham Serial Is Back : 'అమృతం' సీరియల్... ఇప్పటి జనరేషన్‌కు ఈ సీరియల్ అంటే తెలియకపోవచ్చు. కానీ '90s కిడ్స్'కు మాత్రం ఈ సీరియల్ హార్ట్ ఫేవరెట్. 'ఒరేయ్ ఆంజనేలూ... తెగ ఆయాస పడిపోకు చాలు. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు...' అనే టైటిల్ సాంగ్ వినిపిస్తేనే అలర్ట్ అయిపోయేవాళ్లం. ప్రతీ ఆదివారం 8:30 అయితే చాలు అందరూ టీవీలకు అతుక్కుపోయేవాళ్లం.
ఇప్పటికీ ఈ సీరియల్ అందరికీ స్ట్రెస్ బస్టర్ అంటుంటారు. అంజి, అమృతం చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ మొత్తం వీరి అల్లరి చూసి తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. మరోసారి 'అమృతం' సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అమృతం' ఈజ్ బ్యాక్
తెలుగు టాప్ ఫేవరెట్ సీరియళ్లలో ఒకటైన ఈ సీరియల్‌ను మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది టీం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదకగా వెల్లడిస్తూ ఓ స్పెషల్ ట్రైలర్ సైతం రిలీజ్ చేసింది. ఈ నెల 24 నుంచి యూట్యూబ్‌లో ప్రతీ రోజూ 2 ఎపిసోడ్స్ ప్రీమియర్ కానున్నాయి. 'అమృతం సీరియల్' అంటూ ఓ స్పెషల్ యూట్యూబ్ ఛానల్‌లోనే ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఆరేళ్లు ఏకధాటిగా...
ఈ సీరియల్ ఏకధాటిగా ఆరేళ్లు ప్రసారమైంది. అమృతంగా శివాజీ రాజా ఫస్ట్ ఎపిసోడ్స్‌లో నటించగా... ఆ తర్వాత నరేష్ కొన్ని ఎపిసోడ్స్... ఫైనల్ ఎపిసోడ్స్ వరకూ హర్షవర్ధన్ నటించారు. ఆంజనేయులుగా గుండు హనుమంతరావు, ఆయన భార్యగా రాగిణి, ఇంటి ఓనర్ అప్పాజీగా నారిపెద్ది శివన్నారాయణ, సర్వంగా వాసు ఇంటూరి నటించారు. ప్రతి రోల్ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కామెడీ సీరియళ్లలోనే ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించింది అమృతం. ఆ తర్వాత రెండో సీజన్ వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. మళ్లీ 'అమృతం' ప్రసారం కానుండడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : 10 దోసెలు... 10 ఇడ్లీలు - మహానటి తర్వాతే అంతా... హెల్త్‌పై కీర్తి సురేష్ ఏమన్నారంటే?