Meghasandesam Serial Today Episode: నడుం నొప్పితో బాధపడుతున్న నక్షత్రకు ఏదో తన చేతులతో ట్రీట్‌మెంట్ చేసినట్టు చేస్తుంది సుజాత. ఇప్పుడెలా ఉంది నక్షత్ర అని అడగ్గానే.. నక్షత్ర కోపంగా సుజాతను తిడుతుంది.

Continues below advertisement

నక్షత్ర: నా నడుం నొప్పిని పోగోట్టినట్టు ఫోజు కొట్టకు చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేయించావు అంతే..

సుజాత: అది కరెక్టేలే.. కీలెరిగి వాత పెట్టాలి అన్నట్టు నడుం నొప్పికి చేతులు ఒత్తితే ఎలా అన్నట్టు.. నడుం వంచాలి. ఏదీ నీ నడుం కాస్త వంచు..

Continues below advertisement

నక్షత్ర: అమ్మో గోరింటాకు.. ఈ నడుం నొప్పితో నిలబడటమే కష్టంగా ఉంది. ఎలా వంగడం..

సుజాత: వంచాలి బేబీ నడుం వంచితేనే నొప్పి లొంగుతుంది.   

నక్షత్ర: అమ్మా నా వల్ల కాదు.. అసలు కాదు..

అని బాధపడుతుంటే.. సుజాత అతి బలవంతంగా నక్షత్ర నడుమును కిందకు వంచేస్తుంది. నక్షత్ర కిందకు వంగి అలాగే ఉండిపోతుంది. దీంతో నక్షత్ర అమ్మా గోరింటాకు ఇలా వంచేశావేంటి..? అంటూ బాధపడుతుంది.

సుజాత: అదేంటి బేబీ నువ్వు మా అమ్మాయిని మమ్మీ అని కదా పిలుస్తావు. ఇప్పుడు అమ్మా అని పిలుస్తున్నావేంటి..?

నక్షత్ర: నోరు మూయ్‌ గోరింటాకు. నడుం పట్టేసి నొప్పితో తట్టుకోలేకపోతున్నాను.

సుజాత: తట్టుకోలేకపోతే లేచి నిలబడు బేబీ.. నేను ఏమైనా ఇలాగ నొప్పి భరించుకుంటూ ఉండమంటున్నానా..? ఏంటి..?

నక్షత్ర: ఓసేయ్‌ గోరింటాకు నొప్పి భరించలేకపోతున్నాను.. నడుం పట్టేసిందే.. లేవలేకపోతున్నానే..

సుజాత: అమ్మో అలాగా.. ఇప్పుడెలా..?

నక్షత్ర: ఎలా అని నన్ను అడుగుతావేంటే..? ఏదో ఒకటి చేయవే..?

సుజాత: డాక్టర్‌కు ఫోన్‌ చేయనా..?

నక్షత్ర: డాక్టర్‌ వచ్చే వరకు నేను ఇలాగే ఉండాలా..?

సుజాత: పోనీ డాక్టర్‌ వచ్చే వరకు స్టూల్‌ ఏమైనా ఇవ్వనా..?

అని చెప్పగానే.. నక్షత్ర కోపంగా సుజాతను తిడుతుంది. ఇంతలో అక్కడికి చెర్రి వస్తాడు.

చెర్రి: ఏమైంది గోరింటాకు.. ఎందుకు నక్షత్ర అలా వంగింది..? చిన్న పిల్లలకు స్కూల్‌ లో పనిష్‌మెంట్‌ ఇచ్చినట్టు నక్షత్రను ఇలా వంచేశావేంటి..?

సుజాత: అయ్యో కావాలని వంచలేదు బాబు.. తేరీ మేరీ కాఫీలో భాగంగా వంచాను.

చెర్రి: అయ్యో గోరింటాకు.. అది తేరీ మేరీ కాపీ కాదమ్మా.. ఫిజియో థెరప్పి

సుజాత: అ అదే అనుకో.. నక్షత్ర నడుం పట్టేసి తను బాధ తట్టుకోలేక అల్లాడి పోతుంది. బాబు నువ్వు ఏదైనా చేయగలవా..?

చెర్రి: ఏం చేయాలి..?

సుజాత: అదే బాబు నొప్పి పోవడానికి ఏదైనా చేయాలి..

చెర్రి: నొప్పి పోవడానికి చేయాలి.. ఏం చేయాలి.. నొప్పిని పోగోట్టడం నడుంని నిలబెట్టడం నాకు చిటికెలో పని. కానీ నేను చేయను కదా..?

సుజాత: ఎందుకు చెయ్యవు బాబు..

చెర్రి: ఎందుకంటే.. నక్షత్రకు నేను చేయాల్సిన పిజియో నువ్వు చేశావు కనుక. నా నుంచి నక్షత్రను తప్పించాలని నువ్వు అనుకున్నావు కనుక.

సుజాత: నేను తప్పించలేదు. తను నీ నుంచి తప్పించుకోవడానికి నన్ను జాయింట్‌ వెంచర్‌ లా కలుపుకుంది. ఈసారి కలవమన్నా కలవను బాబు.. బాబు కాస్త సాయం చేయ్‌.. నీకు పుణ్యం ఉంటుంది. లేకపోతే అపూర్వ నీకు అన్నం కూడా పెట్టదు.

చెర్రి: అయినా గోరింటాకు మనసు ఒప్పడం లేదు.. ఎవరికి నొప్పి ఉందే వాళ్లే బతిమిలాడాలి.. నువ్వు బతిమిలాడటం వల్ల లాభం లేదు.

సుజాత: బేబీ చెర్రి బాబును కాస్త బతిమిలాడు..

అని చెప్పినా నక్షత్ర పలకదు. దీంతో చెర్రి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో సుజాత చెప్పడంతో నక్షత్ర చెర్రిని పిలుస్తుంది. చెర్రి రాగానే కాస్త నడుం చూడు చెర్రి అంటుంది. చెర్రి వచ్చి నక్షత్ర నడుం నొప్పిని తగ్గించి వెల్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!