Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు పాము రూపంలో వచ్చి కాలాను చంపేసి వెళ్లిపోయిన తర్వాత రణవీర్ ఇంటికి వెల్లిపోతారు చంభా, మనోహరి. అక్కడ కాలా చనిపోయిందని బాధపడుతూ చంభా ఏడుస్తూ ఉంటుంది.
మను: ఇంకా పుట్టని ఆ పిండమే అంత చేస్తే మనం ఎంత చేయాలి చంభా
చంభా: మనం ఏం చేసినా దాన్ని గెలవలేము నాకు అర్థం అయిపోయింది మనోహరి
రణవీర్: అలా నిరాశ చెందకు చంభా ఏదో ఒక మార్గం ఉంటుంది ఆలోచించు చంభా
చంభా: ఏ మార్గం లేదు రణవీర్ దాన్ని చంపడం ఆ కాలా వల్లే కాలేదంటే ఇంకెవరి వల్ల కాదు
మను: ప్రతి దానికి కచ్చితంగా ఒక పరిస్కారం ఉంటుంది అదేదో ఆలోచించు
చంభా: అన్ని అలోచించే కాలాను రప్పించాను.. నా చేతులారా నేనే నా తమ్ముణ్ని చంపుకున్నాను
మను: అబ్బా ఇంక ఆపుతావా..?
చంభా: నాకు ఇంకే దారి కనిపించడం లేదు
రణవీర్: భాగీని బయటకు రప్పిస్తే నేను ఏదో ఒకటి చేస్తాను మనోహరి. మీరు ఎలాగోలా బాగీని బయటకు తీసుకురాలేరా..? ఇన్నాళ్లు ఆస్థి కోసం పాప కోసం ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నా ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. అనవసరంగా నీకు సాయం చేసి నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. ముగ్గురం ఇరుక్కుపోయాము.. ఇందులోంచి మనం ఎలాగైనా బయట పడాలి. మన ప్రాణాలు కాపాడుకోవాలి
చంభా: మన పని అయిపోయింది రణవీర్.. మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు
మను: చంభా నువ్వు అలా మాట్లాడకు.. రణవీర్ భాగీని బయటకు రప్పించడానికి ఒకటే దారి ఉంది..
చంభా: ఏ దారి ఉంది చెప్పు మనోహరి.. ఇంతకీ ఏ దారి ఉందో చెప్పు
మను: భాగీని ఊరికి తీసుకెళ్లి అక్కడ దానికి సీమంతం చేయాలని వాళ్లు అనుకుంటున్నారు కదా
రణవీర్: అందుకు అమర్ ఒప్పుకున్నాడా..?
మను: లేదు నెలలు నిండిన భాగీని అంత దూరం పంపించలేను అని చెప్పాడు.
రణవీర్: అయితే ఏదో ఒకటి చేసి అమర్ ను కన్వీన్స్ చేయలేవా..? భాగీని అక్కడికి వచ్చేలా చేయలేవా..?
చంభా: సొంత మామ అడిగితేనే ఒప్పుకోలేదు అమరేంద్ర మనోహరి అడిగితే అంగీకరిస్తాడా… రణవీర్
రణవీర్: మనోహరి టాలెంట్ నీకు తెలియదు చంభా మనోహరి అనుకుంటే ఎవరినైనా కన్వీన్స్ చేయగలదు.. ఏం మనోహరి అమర్‌ను ఒప్పించగలవా..?
మను: అదే ఆలోచిస్తున్నాను
రణవీర్: ఎలాగైనా ఒప్పించు మనోహరి. ఇది మన ముగ్గురి ప్రాణాల సమస్య.. మనం అంటూ బతికి ఉంటే ఏమైనా చేయగలం.. భాగీని బయటకు రప్పిస్తే నేను కచ్చితంగా చంపేస్తాను
మను: సరే నేను ప్రయత్నిస్తాను
రణవీర్: ప్రయత్నించడం కాదు.. మనం బతికి ఉండాలంటే భాగీ తన బిడ్డ చావాలి.. ముందు మన ప్రాణాలే ముఖ్యం మనోహరి
అంటూ రణవీర్ చెప్పగానే.. మనోహరి సరే ఓకే అంటూ చంభాను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మనోహరి అమర్‌ను కన్వీన్స్ చేస్తే భాగీకి సీమంతం జరిగే చోట బాంబు పెట్టాలని అనుకుంటాడు రణవీర్. అందుకోసం ఒక బాంబు కొని మనోహరికి ఇస్తాడు. అయితే రణవీర్‌కు బాంబు అమ్మిన వ్యక్తిని మిలటరీ వాళ్లు పట్టుకుని విచారిస్తుంటారు. అదే విషయం రణవీర్ మనోహరి కాల్ చేసి చెప్పగానే.. మనోహరి బయపడుతుంది. అమర్ బాంబు అమ్మిన వ్యక్తిని విచారిస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!