Krishnamma kalipindi iddarini July 11th: అఖిల.. ఈశ్వర్ గౌరీ పై ఉన్న ప్రేమ గురించి చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని మండి పడుతుంది. గౌరీ సంతోషంగా ఉందని జీర్ణించుకోలేకపోతోంది. ఏదో ఒకటి చేసి గౌరీని బాధపెట్టాలి అని అనుకొని తనని బాధ పెట్టాలి అని అక్కడి నుండి కోపం గా వెళ్తుండగా వెంటనే భవాని ఆపి నువ్వు ఇప్పుడు వెళ్లి గౌరి ని బాధ పెడితే నీ పెళ్లి కాదు అని అంటుంది.


ఎందుకు అని అనడంతో పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాన్ని గుర్తుకు చేస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్లి గౌరీని ఏమైనా అన్నావో గౌరీ కోపంతో వెళ్లి విషయం మొత్తం చెబుతుంది. అప్పుడు మొదటికి వస్తుంది నీ పెళ్లి కూడా ఆగిపోతుంది. పెళ్లి అయ్యాక గౌరీ పని చేయు అని ఉచిత సలహాలు ఇస్తుంది. మరోవైపు గౌరీ ఈశ్వర్ తనతో మాట్లాడిన మాటలు సంతోషంలో కనిపిస్తుంది.


అప్పుడే అక్కడికి ఈశ్వర్ వచ్చి గౌరీ కి గిఫ్ట్ ఇస్తాడు. ఇప్పుడే ఇక్కడే తీయమని అనటంతో గౌరీ ఆ గిఫ్ట్ చూసి చాలా మురిసిపోతుంది. ఈశ్వర్ మరోసారి తనలో ఉన్న ప్రేమను బయట పెడుతూ ఉంటాడు. ఇక గిఫ్ట్ లో ఉన్నది మనమే అని అంతేకాకుండా ఎటువంటి దాపరికాలు ఉండకూడదు అని ప్రత్యేకంగా డిజైన్ చేయించాను అని అంటాడు.


అప్పుడే అఖిల వారిద్దరిని చూసి తట్టుకోలేక పోతుంది. ఆదిత్య తనతో ఇలా ఉండటం లేదు కోపంగా రగిలిపోతుంది. ఈశ్వర్ మన మధ్య ఎటువంటి విషయాలు దాచుకోకూడదు అని.. దాచుకుంటే నమ్మకం కోల్పోయినట్లే అని అనటంతో గౌరీ పాతిక లక్షల విషయం చెప్పలేకపోతున్నాను అని చాలా బాధపడుతుంది. మరోవైపు అమృత ఆదిత్య ను తలచుకొని చాలా బాధ పడుతుంది.


నువ్వు లేకుంటే నేను ఉండలేను ఆదిత్య నాకు చావు ఒకటే మార్గం అని ఏడుస్తుంది. నువ్వు మీ అన్నయ్య కోసం మన ప్రేమ త్యాగం చేశావు కానీ నా బాధ అర్థం చేసుకోవడం లేదు అని.. ఇక ఎలాగైనా మన ప్రేమ విషయం మీ అన్నయ్యకు చెబుతాను అని అనుకొని వెంటనే ఈశ్వర్ ఫోన్ కి ఫోన్ చేస్తుంది. ఇక ఈశ్వర్ ఫోన్ గదిలో ఉండగా అప్పుడే అక్కడికి సునంద వచ్చి ఈశ్వర్ 
ని పిలుస్తుంది. ఫోన్ వస్తుంది అని ఈశ్వర్ ఎక్కడ అని చూస్తుంది.


పదే పదే ఫోన్ రావడంతో అర్జెంట్ కాల్ అని లిఫ్ట్ చేయగా వెంటనే అమృత ఈశ్వర్ గారు అంటూ ఏడుస్తూ మీ తమ్ముడు, నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం అని.. కానీ మీ కోసం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడని.. ఆదిత్య అంటే నా ప్రాణం, సరస్వం.. ఆదిత్య దూరమైతే నేను బ్రతకలేను సర్ అంటూ ఏడుస్తుంది. ఆ మాటలు విని సునంద షాక్ అవుతుంది.


దయచేసి మీ ఇంట్లో వారితో ఒప్పించి మా పెళ్లి చేయండి అని లేదంటే చావే గతి అని అంటుంది. నేను ఇంత చెప్తున్న కూడా ఏం మాట్లాడట్లేరు సర్ అని అనడంతో వెంటనే సునంద మాట్లాడటంతో నేనే ఈ విషయం గురించి మీకు చెప్పాలనుకున్నాను ఆంటీ అని మళ్లీ తన ప్రేమ విషయాన్ని చెబుతుంది. ఆదిత్య లేకుంటే ఉండలేను అని అంటుంది. ఈ విషయం నువ్వు ముందే చెబితే ఎలాగో అలా చేసేదాన్ని అని.. కాని తెల్లారితే పెళ్లి అని ఈ సమయంలో నేను ఏమి చేయలేను అని అంటుంది.


కానీ అమృత మాత్రం ఎలాగైనా చెయ్యండి అనటంతో ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే నలుగురు ప్రాణాలు పోతాయి అని.. చెబితే అర్థం కావట్లేదా.. ఆదిత్యను మర్చిపో.. నువ్వు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచు అని కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. దాంతో అమృత చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సునంద అన్ని విషయాలు తెలుసుకుని నాకోసం నా చిన్న కొడుకు ప్రేమను త్యాగం చేశాడు అని బాధపడుతుంది.


Also Read: Madhuranagarilo July 11th: ‘మధురానగరిలో’ సీరియల్: రాధ కోసం రిస్క్ చేస్తున్న శ్యామ్, నెల్సన్ వాళ్లను భర్తతో కొట్టించిన వాసంతి?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial