Madhuranagarilo July 11th: పార్క్ నుండి ఇంటికి రాగానే పండు శ్యామ్ కు థాంక్స్ చెబుతాడు. రాధ కూడా శ్యాంకు ప్రపోజ్ చేసినందుకు థాంక్స్ చెబుతుంది. ఎందుకు థాంక్స్ చెప్పావు నువ్వు అని అంటాడు. ఆ తర్వాత వాళ్లు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు. ఇక రాదా పండుకో హోమ్ వర్క్ చేయిస్తూ ఉంటుంది. శ్యామ్ మాత్రం ఫోన్ లో పార్కులో దిగిన ఫోటోలు చూస్తూ ప్రపోజ్ చేయకున్నా కూడా ఇదొక తీపి జ్ఞాపకంగా ఉందని అనుకుంటాడు.


ఇక పండు హోంవర్క్ చేస్తుండగా మాథ్స్ టెక్స్ట్ బుక్ లేదని అనడంతో శ్యామ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను అని అంటాడు పండు. ఇక బుక్ తీసుకురమ్మని తన రాధక చెబుతాడు. ఇక రాధ వెళ్ళగానే అక్కడ శ్యామ్ రాత్రి చూసి ఆశ్చర్యపోతాడు. పండు టెక్స్ట్ బుక్ మర్చిపోయాడట అని రాధ వెతుకుతుంది. వెంటనే శ్యామ్ ఇదే మంచి సమయం అనుకొని ప్రపోజ్ చేయాలని గదిలోకి వెళ్లి హార్ట్ షేప్ లో ఉన్న బెలూన్ తీసుకొని వస్తాడు.


వెళ్తున్న రాధను ఆపి బెలూన్ చూపించడంతో రాధ కాస్త భయపడుతూ కనిపిస్తుంది. ఇక తన మనసులో మాట చెబుతున్న సమయంలో అప్పుడే అక్కడికి మధుర దంపతులు చేరుకుంటారు. చేతిలో ఆ హాట్ సింబల్ తో ఉన్న బెలూన్ ఏంటి రాధకి ఎందుకు ఇస్తున్నావు అని మధుర దంపతులు ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. పండు కోసం తీసుకొచ్చాను అని పండు కి ఇవ్వమని రాధకు ఇస్తున్నాను అని అనటంతో సరే ఇచెయ్యు అని అంటారు.


గన్నవరం డబ్బులు రావడంతో ఫుల్ జోష్ లో కనిపిస్తాడు. తన భార్యకు డబ్బులు ఇచ్చి మంచి వంటలు చేయమని చెబుతాడు. అంతేకాకుండా ఆ సమయంలో నెల్సన్, గోపాల్ వచ్చి వాసంతితో గన్నవరం కొట్టించాలి అని చూస్తారు. కానీ వాసంతి తిరిగి గన్నవరంకు వారిని కొట్టమని పరిమిషన్ ఇస్తుంది. దాంతో గన్నవరం మరింత పగ తీర్చుకుంటాడు.


ఆ తర్వాత మధుర ఫ్యామిలీ తినడానికి కూర్చోగా రాధ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వెంటనే రాధ ని తీసుకొస్తాను అని అనగా అప్పుడు రాధ అక్కడికి వస్తుంది. నేనే మిమ్మల్ని పిలవడానికి వస్తున్నాను మీరు వస్తారని నేను వచ్చాను అని రాధ అంటుంది. ఆ తర్వాత మధుర శ్యామ్ టైం కి భోజనం చేశాడా అని అడుగుతుంది. అంతేకాకుండా ఏమేమి వంటకాలు చేశావు అని కూడా అడుగుతుంది.


ఇక శ్యామ్ రాధ వంటలు అద్భుతంగా చేసింది అంటూ.. ఈ ప్రపంచంలో ఎవరు చేయరు అని వెటకారంగా చెబుతూ ఉంటాడు. రాధకు గతంలో తన ఉప్పు కారం ఎక్కువ చేసిన వంటలు గుర్తుకొస్తాయి. దాంతో మధుర.. అయితే సంయుక్తకు నువ్వే వంటలు నేర్పించాలి అని రాధతో అంటుంది. వెంటనే నేను కూడా వంటలు నేర్చుకుంటాను అని.. నా భార్యకు ఉప్పు కారం మంచిగా వేసి చేస్తాను అని అంటాడు.


ఇక రేపు టెంపుల్ కి వెళ్లాలి గుర్తుంది కదా అని మధుర రాధ తో అంటుంది. గుర్తుంది అని రాధ అనటంతో అయితే రేపు ఎలాగైనా ప్రపోజ్ చేయాలి అని అనుకుంటాడు శ్యామ్. మరుసటి రోజు అందరూ గుడికి వెళ్లగా అక్కడ మధుర సంయుక్త, శ్యామ్ పేర్లతో పూజా చేయించమని అనడంతో వెంటనే శ్యామ్ పెళ్లి కాక ముందుకు చేయకూడదు అని కొన్ని డైలాగ్ లు చెప్పటంతో పూజారి కూడా అదే కరెక్ట్ అని అంటారు. ఇక తరువాయి భాగంలో రాధ పుట్టలో పాలు పోస్తుండగా రింగు అందులో పడిపోతుంది. తన అక్క ఇచ్చిన రింగ్ అని బాధపడుతుంది. ఇక అందరూ అక్కడి వెళ్ళగా శ్యామ్ పుట్టలో చెయ్యి పెట్టటంతో రాధ చూసి షాక్ అవుతుంది. 


Also Read: Prema Entha Madhuram July 11th: మోసపోయానని తెలుసుకున్న మాన్సీ, అను నిజజీవితం గురించి తెలుసుకున్న ప్రీతి?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial