Ammayi garu Serial Today Episode శ్వేత, జీవన్, విరూపాక్షి, రాజు, రూప అందరూ సీఎం డౌన్ డౌన్ అంటూ వచ్చి గొడవ చేస్తారు. సీఎం సూర్యప్రతాప్ బయటకు వస్తాడు. విషయం ఏంటి అని అడుగుతాడు. దానికి విరూపాక్షి తన మీద కోపం తన మీదే చూపించాలని తన మీద కోపాన్ని పిల్లల మీద చూపించడం ఏంటని ప్రశ్నిస్తుంది.


సూర్యప్రతాప్: దేని గురించి మాట్లాడుతున్నారు.
శ్వేత: అక్రమం అని మీరు కూల్చివేసిన కట్టడాలు గురించి.
సూర్యప్రతాప్: అక్రమంగా కూల్చడం లేదు అక్రమంగా కట్టారని కూల్చుతున్నాం.
విరూపాక్షి: ఆర్ఆర్ కంపెనీ అక్రమంగా కట్టామనీ మీకు ఎవరు చెప్తారు.
ఆఫీసర్: ఆర్ ఆర్ కంపెనీ 20 శాతం బఫర్ జోన్‌లో ఉంది. 
విరూపాక్షి: 20 శాతం బఫర్ జోన్‌లో ఉంటే అంత మేరకే కూల్చాలి కదా మొత్తం కూల్చేయడం ఏంటి. ఆ కంపెనీ మీద ఆధారపడి చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. వాటి పరిస్థితి ఏంటి. వాళ్లని రోడ్డు మీదకు లాగారు. ఇదేనా మీ ప్రజాన్యాయం.
శ్వేత: మీ పర్సనల్ ఇష్యూల వల్ల ఆ కంపెనీలో బఫర్ జోన్‌లో లోని 80 శాతంలో నాకు వాటా ఉంది. నేను ఇప్పుడు నష్టపోయాను మీరు నాకు న్యాయం చేయాలి. అప్పుడు నా పెళ్లి విషయంలో ఇప్పుడు నా కెరీర్ విషయంలో నష్టం చేస్తున్నారు.
రూప: నాన్న రాజు ఎంతో కష్టపడి నిలబెట్టిన కంపెనీ నాన్న అది. మనం రోడ్డు మీద ఉన్నప్పుడు మనకు అన్నం పెట్టిన కంపెనీ నాన్న ఇలా కూల్చేయడం కరెక్ట్ కాదు.
సూర్యప్రతాప్: అందరినీ నా మీకు పంపి ఇలా సైలెంట్‌గా ఉన్నట్లు నటిస్తావేంట్రా. నువ్వు మాట్లాడు.
రాజు: అదేం లేదు పెద్దయ్య నాకు ఆ కంపెనీ అమ్మలాంటిది. మీరు పిలిచి రేయ్ రాజు కంపెనీ బఫర్ జోన్లో ఉందిరా అని ఒక్క మాట చెప్పి ఉంటే నేను కూల్చేసే వాడిని పెద్దయ్య. మీరు ఇలా మాటలు పడటం నలుగురిలో నిలబడి ఒకరికి సమాధానం ఇవ్వడం నాకు ఇష్టం లేదు.
విరూపాక్షి: నువ్వు అయినా ఎలా కూల్చేస్తావ్ రాజు అది 20 శాతం మాత్రమే బఫర్ లో ఉంది. అదే ఆయన గారి ఇళ్లు అలా ఉంటే కూల్చేసేవారా.
సూర్యప్రతాప్: నేను ప్రజానేతని నిజంగా నా ఇళ్లే అలాంటి స్థితిలో ఉంటే కూల్చేయండి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రూప నీకు ఎన్ని సార్లు చెప్పాలి ఇలాంటి వాళ్లతో తిరగొద్దని పద..


ముత్యాలు ఇంట్లో అందరూ టీవీలో సూర్యప్రతాప్ మీడియాతో మాట్లాడింది చూస్తుంటారు. ముత్యాలు కోపంతో రగిలిపోతుంది. రాజు వస్తే విషయం తెలుస్తుందని ముత్యాలుతో భర్త చెప్తాడు. ముత్యాలు భర్తతో మన ఇంటిని కూడా తప్పుడు కాగితాలతో కూల్చేస్తాడని అంటుంది. రాజు శ్వేతని పెళ్లి చేసుకుంటే అలాంటి వంద కంపెనీలు కడతానని ముత్యాలు అంటుంది. ఇక మందారం హాస్పిటల్‌లో హారతి దగ్గర కూర్చొంటుంది. మందారంతో తాను మొదటి సారి ప్రెగ్నెంట్ అయ్యానని తనకు చాలా సంతోషంగా ఉందని మాటా మాటా కలుపుతుంది. పెళ్లి  కాకుండానే తల్లి అయ్యానని హారతి అంటే మందారం మనసులో దీపక్ ఒక్కడే అలా అనుకున్నా ఇప్పుడు అలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడా అనుకుంటుంది.( హారతిని ప్రెగ్నెంట్ చేసింది దీపక్ అని తెలియక, మందారం దీపక్ పెళ్లి చేసుకొని ఉంటారు) 



మరోవైపు దీపక్ రాఘవ దగ్గర వెళ్లి ఈరోజే నీకు ఆఖరి రోజు అని అనుకుంటాడు. రాజు వాళ్లు కూడా హాస్పిటల్‌ దగ్గరకు వస్తుంటారు. డాక్టర్ రాఘవ దగ్గరకు రాబోతే మందారం పిలిచి ఎలా ఉందని అడుగుతుంది. ఇక రాఘన గుడ్ బాయ్ రాఘవ అని చెప్పి ఆక్సీజన్ తీసేస్తాడు. ఇంతలో డాక్టర్, మందారం రావడంతో దీపక్ దాక్కుంటాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని హడావుడిగా హారతిని తీసుకొని వెళ్లిపోతాడు. దీపక్ వెళ్లడం రాజు వాళ్లు వస్తారు. ఇక కంగారులో హారతి రిపోర్ట్స్ మర్చిపోతుంది. అది మందారం చూసి వెళ్లేటప్పుడు ఇచ్చి వెళ్తానని చెప్తుంది.  ఇక రూప ఇంట్లో కూర్చొని జరిగిన దాని గురించి ఆలోచిస్తుంది. 


రాజు ఇంటికి రావడంతో ఇలా జరిగిందేంటి రాజుని తండ్రి అడుగుతారు. ముత్యాలు సీఎంని తిడితే రాజు ఆయనేం చేయలేదని అంటాడు. సూర్యప్రతాప్ మనల్ని రోడ్డు మీదకు లాగేలోపు ఆయనకు మనం అందనంత ఎత్తు ఎదగాలని అంటుంది. అందుకు శ్వేతని పెళ్లి చేసుకోమని రాజుతో అంటుంది. రాజు చేసుకోను అంటే నేను నిర్ణయం తీసుకున్నానని నువ్వు పెళ్లి చేసుకోవాలని అంటుంది. శ్వేతని చంపి అయినా ఈ పెళ్లి ఆపుతానని రాజు అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్యని నిలదీయనున్న విరూపాక్షి.. ముత్యాలుని రెచ్చగొట్టిన జీవన్, రాఘవని చంపే పనిలో దీపక్!