Ammayi garu Serial Today Episode రాజు ఏం తప్పు చేయలేదని రూప తండ్రికి సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తుంది. సూర్యప్రతాప్ నమ్మే టైంలో విజయాంబిక పుల్లలు పెడుతుంది. దీంతో రాజు ఎంత చెప్పినా సూర్యప్రతాప్ రాజుని నమ్మడు. ప్రమాదం ఏం జరగలేదు కదా ఏం జరిగినా ఆ భగవంతుడికే తెలుసని ఏం జరిగిందో తాను ఎంక్వైరీ చేయిస్తానని అందరినీ పడుకోమని సూర్యప్రతాప్ చెప్తాడు. రాజు సూర్యప్రతాప్‌కి జాగ్రత్త చెప్పి వెళ్లిపోతాడు.
విజయాంబిక: మనం అనుకున్నది ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి.
దీపక్: నేను ముందే చెప్పాను కదమ్మా వాడు వస్తే మనం అనుకున్నది జరగదు అని వాడు మామయ్యని చావనివ్వలేదు. మామయ్యకి వాడూ దూరం అవ్వలేదు.
విజయాంబిక: ఆ జీవన్ గాడు రాజు గాడిని కూడా ఏదో ఒక కుర్చీకి కట్టి పడేసుంటే బాగుండేది. ఆ రాజు గాడు మన ఆశల మీద నీళ్ల చల్లేశాడు. ఈ రాత్రిని మనకు కాలరాత్రిగా మార్చాడు.
జీవన్: అసలేం జరిగింది అక్కడ.
విజయాంబిక: మన ప్లాన్ పోయింది. కానీ మన అదృష్టం ఏంటి అంటే ఇదంతా మనమే చేశాం అని తెలీలేదు.
దీపక్: జీవన్ అలా అని మనం రిలాక్స్ అవ్వడానికి వీళ్లేదు. ఉదయం లేచి ఇదంతా ఎవరు చేశారని ఎంక్వైరీ చేయిస్తారు.
జీవన్: చేయించని దీపక్. ఆ ఎంక్వైరీలో మనమే ఇదంతా చేశాం అని అనుమానం వచ్చే లోపు మీ మామయ్యని లేపేస్తా.
దీపక్: టెన్షన్‌తో చస్తున్నాం ముందు ఆ పని చేయ్.
విజయాంబిక: దీపక్ ఆ జీవన్‌ని నమ్ముకొని మనం ఊరికే ఉండకూడదు. ఈ ప్లాన్ మనం వేశామని తెలిస్తే ముందు మనల్ని చంపేస్తారు. కాబట్టి మీ మామయ్యని చంపాల్సిన అవసరం ఆ జీవన్ కంటే ఎక్కువ మనకే ఉంది.
సూర్యప్రతాప్: చంద్ర నాకేం అర్థం కావడం లేదు రూప చెప్పింది నమ్మాలా విజయాంబిక చెప్పింది నమ్మాలా.
చంద్ర: రాజు అలాంటి వాడు కాదు అన్నయ్య. అపోజేషన్ వాళ్లు అయింటారు.
రూప: మనసులో రాత్రి మందారం ఇచ్చిన పాలు, టీ తాగిన వాళ్లంతా మత్తులోకి వెళ్లారు. మందారం కూడా మత్తులోకి వెళ్లిపోయింది అంటే మందారానికి అడిగితే ఏదైనా క్లూ దొరుకుతుందేమో.
ముత్యాలు ఇంటికి శ్వేత, తన అన్నయ్యతో పాటు కొంతమంది ముత్తయిదువులు వస్తారు. పంతులు కూడా వస్తారు. అక్కడే ఉన్న ముత్యాలు భర్త, కూతురు వరాలు ఏంటి ఇదంతా అని అడిగితే రాజుకి, శ్వేతకి పెళ్లి ముహూర్తం పెట్టడానికి వచ్చారని అంటుంది.
ఇక రూప మందారం దగ్గరకు వచ్చి రాత్రి ఏం జరిగిందని అడుగుతుంది. దాంతో విజయాంబిక, దీపక్ రాత్రి వచ్చారని జరిగింది చెప్తే ఇదంతా విజయాంబిక, దీపక్ ప్లాన్ అని మొత్తం రూప జరిగింది గెస్ చేస్తుంది. మరోవైపు రాజు కిందకి వచ్చి వాళ్లు ఎందుకు వచ్చారని కోప్పడతాడు. పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నానని అంటుంది. శ్వేత కూడా సూర్యప్రతాప్ గురించి తప్పుగా చెప్తే రాజు కోప్పడి వాళ్లని వెళ్లిపోమని అంటాడు.
శ్వేత: ఏంటి రాజు ఇది నీకు పెళ్లి అయిందని తెలిసి నాన్ను చూడ్డానికి వచ్చావ్. నీకు పెళ్లి అయిందని తెలిసి నాతో నిశ్చితార్థం చేసుకున్నావ్. పెళ్లి వరకు వచ్చి చివరకు ఆ రూప ప్రెగ్నెంట్ అని తెలిసి నన్ను వదిలేశావ్. మన గురించి అందరికీ తెలిసిపోయింది మరి నేను ఏమైపోవాలి రాజు. నాకు ఎంత అవమానంగా జరిగిందో ఆలోచించావా. ఇదే మీ అక్కకో చెల్లికో జరిగితే ఊరుకుంటావా.
రాజు: చూడు శ్వేత అప్పుడు నీకు నిజం చెప్పకపోవడం నా తప్పే కానీ కానీ పెళ్లి చూపులు, నిశ్చితార్థం మా అమ్మ చనిపోతా అంటే చేసుకున్నా.
ముత్యాలు: ఇప్పుడు అదే చెప్తున్నా ఈ పెళ్లి అవ్వకపోతే నేను చస్తా. పంతులు గారు మీరు ముహూర్తం పెట్టండి ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తా.
రూప విజయాంబిక, దీపక్‌ల దగ్గరకు వచ్చి రాత్రి మత్తు మందు కలిపింది మీరే అని నాకు క్లారిటీ వచ్చిందని అంటుంది. మందారం కూడా అందరికీ పాలు, టీ ఇచ్చిన వరకు వీళ్లు ఉన్నారని చెప్తుంది. రూప వెళ్లిపోయిన తర్వాత రాఘవని కిడ్నాప్ చేసిన రౌడీలు విజయాంబికకు కాల్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేసి మళ్లీ దొరికాడని అంటుంది. తల్లీకొడుకులు రాఘవ దగ్గరకు వెళ్లడానికి బయల్దేరుతారు. వాళ్ల మాటలు రూప వినేస్తుంది..
మరోవైపు రాజు తాంబూలం పల్లెం విసిరేసి చెప్తే అర్థం కావడం లేదా అని కోప్పడతాడు. ఇక రూప తల్లీకొడుకుల్ని ఫాలో అవుతుంది. రూప రాజుకి కాల్ చేస్తుంది. కానీ రాజు తల్లితో గొడవ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేయడు. శ్వేతని రాజు ఇంట్లో వాళ్లు తరిమేస్తారు. మరో వైపు రూప తల్లికి కాల్ చేసి విజయాంబిక అత్తయ్య రాఘవని దాచిందని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.