Ammayi garu Serial Today Episode రూప ప్లాన్‌కి బోల్తా పడ్డ కోమలి సూర్యప్రతాప్‌, విరూపాక్షిల పెళ్లి రోజు వేడుకకు ఏర్పాట్లు చేస్తుంది. విజయాంబిక, దీపక్‌లు మాకు చెప్పకుండా ఇలా ఎందుకు చేస్తున్నావ్.. మనం వాళ్లని విడదీయాలి అంటే ఇలా కలిపేస్తున్నావ్ ఏంటి అని అడుగుతారు. 


కోమలి విజయాంబికతో నేను ఇదంతా చేయకపోతే రూప, రాజులు చేసి మార్కులు కొట్టేస్తారు అంటుంది. ఇలా చేస్తే నీకే ప్రాబ్లమ్ అని విజయాంబిక హెచ్చరించినా వినకుండా కోమలి గెస్ట్‌లు వస్తున్నారు. నాతో మాట్లాడొద్దు అమ్మానాన్నల్ని తీసుకురావాలి అని చెప్పి వెళ్తుంది. కోమలి హడావుడి చూసి రూప, రాజులు నవ్వుకుంటారు.


కోమలి సూర్యప్రతాప్‌ దగ్గరకు వెళ్లి డ్రస్‌లో సూపర్‌గా ఉన్నారు నాన్న అని అంటుంది. మీకో సర్‌ఫ్రైజ్ అని చెప్పా కదా అని కళ్లు మూసుకొని కిందకి తీసుకెళ్తుంది. కిందకి తీసుకొచ్చిన తర్వాత సూర్యప్రతాప్‌ మొత్తం చూసి హ్యాపీగా ఫీలవుతాడు. కోమలి అరుస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాన్న అని అంటుంది. దానికి సూర్యప్రతాప్‌ సర్‌ఫ్రైజ్‌లు మనం హ్యాపీగా ఫీలయ్యేలా ఉండాలి ఇలా అసహ్యంగా ఉండకూడదు.. కోపంతో రగిలిపోకూడదు అని అంటాడు. విరూపాక్షి రెడీ అయి వచ్చి కంగారు పడుతుంది. కోమలి షాక్ అవుతుంది. సూర్యప్రతాప్‌ కోమలితో నా జీవితంలో పెళ్లి రోజు అనేది ఓ పీడ కల అలాంటిది నువ్వు సెలబ్రేట్ చేయాలి అనుకోవడం ఏంటి.. ఈ రోజే ఆ మహా తల్లి నిన్ను నన్ను గాలికి వదిలేసి పోయింది.. ఈ ఇంటి పరువు బజారున ఈడ్చేసింది. నన్ను ప్రాణాలతో ఉన్న శవాన్ని చేసింది. ఇలాంటి రోజు నీకు సెలబ్రేట్ చేయాలి అని నీకు ఎలా అనిపించింది. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే నిన్ను కూతురి అని కూడా చూడను అని కోపంగా వెళ్లిపోతాడు. రూపా ఇలా ఇరికించేశావేంటే అని కోమలి అనుకుంటుంది. 


సూర్యప్రతాప్‌ వెళ్తూ వెళ్తూ విరూపాక్షిని కోపంగా చూస్తాడు. విరపాక్షి బాధ పడుతూ వెళ్లిపోతుంది. ఇప్పుడు కోమలి తిక్క కుదిరిందని విజయాంబిక, దీపక్ అనుకుంటారు. రూప బాధ పడుతుంటే రాజు రూపతో ఈ పెళ్లి రోజు నేను మీ కోసం జరిపిస్తాను అని సూర్యప్రతాప్‌ని ఒప్పిస్తానని చెప్పి విరూపాక్షిని బాధ పడొద్దని చెప్పమంటాడు. రూప మనసులో బాబా నాన్న రాజుని తిట్టుకుండా ఒప్పుకునేలా చేయమని కోరుకుంటుంది. 


విజయాంబిక కోమలితో ఇప్పుడు అర్థమైందా ఎందుకు నిన్ను ఆపాలి అనుకున్నామో.. ఇది నా తమ్ముడి దృష్టిలో రూప చేసింది కాబట్టి నిన్ను వదిలేశాడు లేదంటే చంపేసేవాడని అంటుంది. కోమలి విజయాంబికతో రాజు, రూపలే ఇలా నన్ను బుక్ చేశారని అంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని దీపక్ చెప్తాడు. రూప తల్లితో బాధ పడొద్దని చెప్తుంది. 


రాజు సూర్యప్రతాప్‌తో అమ్మాయి గారు చాలా బాధ పడుతున్నారు. మిమల్ని హ్యాపీగా ఉంచాలని ఇలా చేశారు. అమ్మాయి గారు గెస్ట్‌లను కూడా పిలిచేశారు. అందరూ తప్పుగా అనుకుంటారు. మిమల్ని ఎవరూ ఏం అన్నా నేను భరించలేను. మీరేం సెలబ్రేట్ చేసుకోవద్దు వచ్చిన వాళ్ల ముందు నవ్వుతూ నిల్చొండి చాలా అంటాడు. నా వల్ల కాదు అని సూర్యప్రతాప్‌ అంటాడు. దానికి రాజు సరే పెద్దయ్య నేను వెళ్లి వచ్చిన వాళ్లని పంపేస్తాను.. డెకరేషన్ తీయించేస్తాను కానీ ఎందుకు ఆగిపోయిందని అడిగితే ఏం చెప్పాలో అర్థం కావడం లేదని అంటాడు. రాజు మాటలకు సూర్యప్రతాప్‌ ఈ కుటుంబ పరువు కోసం ఈ ఒక్క సారికి ఒప్పుకుంటున్నా అని అంటాడు 


రాజు సూర్యప్రతాప్‌ని తీసుకొస్తే రూప విరూపాక్షిని తీసుకొస్తుంది. బంటీ తాతయ్య, అమ్మమ్మల చేయి పట్టుకొని తీసుకొస్తాడు.  అందరూ శుభాకాంక్షలు చెప్తారు. ఇక కోమలి లవర్ అశోక్ మారు వేషంలో సూర్యప్రతాప్‌ ఇంటికి వస్తాడు. కోమలికి కాల్ చేస్తూనే ఉంటాడు. పెద్ద గడ్డం పెట్టుకొని పెద్దాయనలా రెడీ అయి నువ్వు ప్రమాదంలో ఉంటే రక్షిస్తా నన్ను అవాయిడ్ చేస్తే మాత్రం చంపేస్తా ఆ క్లారిటీ కోసమే వచ్చానని అనుకుంటాడు. గిఫ్ట్ పట్టుకొని పంజాబీ వ్యక్తిలా గెస్ట్‌లతో కలిసి పార్టీకి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.