Ammayi garu Serial Today Episode తన భార్య అయిన రేణుకని గౌతమ్ పెళ్లి చేసుకున్నాడని గొర్రె వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తుంది. గొర్రె కంప్లైంట్‌ని పోలీసులు తీసుకోమని అంటే గొర్రె వదలదు మొత్తానికి ఎస్ ఐ కంప్లైంట్ తీసుకుంటాడు. మరోవైపు రాజు తన తల్లిదండ్రులు గురించి ఆలోచిస్తాడు. రూప వచ్చి మాట్లాడుతుంది. తల్లిదండ్రులకు దూరం అయినందుకు బాధగా ఉందని ఎవరూ కాల్ చేయడం లేదని రాజు అంటే నువ్వు చేశావా అని అడుగుతుంది. వాళ్లు మాట్లాడకపోతే నువ్వే ప్రయత్నించాలి అని అంటుంది. ఇక రూప కాల్ చేస్తుంటే రాజు ఆపేస్తాడు. తానే తప్పు చేయలేదు అని తెలిసినప్పుడు వాళ్లే మాట్లాడుతారు అంటాడు. అయినా రూప కాల్ చేస్తే ఫోన్ కట్ చేస్తారు. దాంతో రూప ఇంటికి వెళ్దామని అంటుంది. రూప ఉదయం రాజుని తీసుకొని అత్తారింటికి వెళ్తుంది. రాజు రాను అని అన్నా బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది. 


ముత్యాలు: ఆగు.. ఇంకా ఏం కావాలమ్మా. 
రూప: అదే ఏమైంది అని అడుగుతున్నా అత్తయ్య నన్ను రానివ్వలేదు అంటే అర్థముంది కానీ రాజుని ఎందుకు రానివ్వడం లేదు రాజు ఏం తప్పు చేశాడు. రాజుకి బులెట్ తగిలి హాస్పిటల్‌లో ఉన్నా మీరు రాలేదు అంత తప్పు రాజు ఏం చేశాడు. 
ముత్యాలు: మనసులో మీరు రాజు దగ్గరవ్వాలి అనే మా మనసు చంపుకొని ఇలా చేశాం. వాడికి మీరు పెద్దయ్య గారు తప్ప మేం అవసరం లేదు. ఎప్పుడు చూసినా పెద్దయ్య గారు అమ్మాయిగారు ఇదే వరస. వాడికి మేం అవసరం లేనప్పుడు మేం ఎందుకు.
రూప: అదేంటి అత్తయ్య అలా అంటున్నారు రాజుకి మీరందరూ అన్నా ప్రాణం ముఖ్యంగా మీరు. మా అందరి కంటే మీరు అంటే రాజుకి ప్రాణం అది మీకు తెలుసు.
అప్పలనాయుడు: అవన్నీ మాటలే అమ్మగారు మొన్న మీకు ప్రమాదం జరిగినప్పుడు కనీసం మా గురించి ఆలోచించలేదు ప్రాణాలకు తెగించాడు. 
రూప: ఇంతేనా మామయ్య రాజుని మీరు అర్థం చేసుకున్నది పాపం మామయ్య రాజు తనకి ఇష్టమైన నేను నాన్న తన చుట్టూ ఉన్నా తను మాత్రం ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నాడు. మా నాన్న రాజుని అల్లుడిగా అంగీకరించారు మామయ్య. రాజుని ఇంటికి తెచ్చి ఇంటి అల్లుడి స్థానంలో ఈ ఇంట్లోనే ఉంటాడని చెప్పారు. ఇంకేం ప్రాబ్లమ్ లేదు అందరం సంతోషంగా ఉన్నాం అనుకునే టైంలో మీరు ఇలా ఎందుకు అత్తయ్య కావాలంటే ఇదే మాట మా నాన్నని తీసుకొని వచ్చి చెప్పిస్తా. నువ్వు అయినా చెప్పు అమ్మ.
విరూపాక్షి: ఇప్పటికే నా వల్ల చాలా జరుగుతున్నాయి రూప నేను మీ విషయంలో కలుగజేసుకోం.
రాజు: నేను చెప్పాను కదా అమ్మాయి గారు వాళ్లు ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారు. కారణం మాత్రం తెలీడం లేదు.
రూప: రాజు వీళ్లు ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా మన గురించి ఆలోచించుకుందాం. మనం కూడా ఇక్కడే ఉందాం. మనం ఇంటికి వెళ్లకపోతే నాన్నే ఇక్కడికి వస్తారు. అప్పుడు వీళ్లకి అర్థమవుతుంది. 
ముత్యాలు: మీకు ఈ ఇంట్లో స్థానం  లేదు కాదు కూడదు అని వస్తే మేం ఇంటి నుంచి వెళ్లిపోతాం
రాజు: వద్దమ్మా మీరు వెళ్లొద్దు మీ మనసు నొచ్చుకునే పని మేం చేయం మీ సంతోషమే మాకు కావాలి.
ముత్యాలు: మేం సంతోషంగా ఉండాలి అంటే మీరు వెంటనే వెళ్లిపోండి అని డోర్ వేసేస్తుంది.


రాజు రూపని తీసుకొని వెళ్లిపోతాడు. ముత్యాలు చాలా ఏడుస్తుంది. ఇక హారతి బిడ్డని తీసుకొని సీఎం ఇంటికి వస్తాడు. విజయాంబికకి అత్తయ్య అని హారతి పిలుస్తుంది. ఇంట్లో స్థానం ఇచ్చినా ఇవ్వకున్నా తాళి కడితే చాలు అని హారతి అంటుంది. దీపక్ వల్ల తప్పు జరిగితే ముందే చెప్పు దీపక్ డీఎన్ఏ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే అస్సలు క్షమించను తల్లీకొడుకుల్ని వదలను అని అంటాడు. జీవన్ చంపేస్తా అనడం ఆపి హారతి అన్నట్లు ఆవిడ మెడలో తాళి కట్టమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: 'త్రినయని' సీరియల్: త్రినేత్రి బదులు నయనికి యాక్సిడెంట్.. విశాల్ కళ్లెదుటే ఘోరం.. బతకడం కష్టమే!