Ammayi garu Serial Today Episode పింకీ మన దగ్గర ఏదో విషయం దాస్తుందని సూర్యప్రతాప్‌ చంద్ర, సుమలకు చెప్తాడు. పింకీ, జీవన్‌లకు పెళ్లి జరగనట్లు అనిపిస్తుందని అంటాడు. జీవన్‌ని అలా వదిలేస్తే ఇంకా చాలా దారుణాలు చూడాల్సి వస్తుందని చంద్ర అంటాడు. ఇక జీవన్ బ్యాగ్రౌండ్ చూస్తే ప్రేమ పెళ్లి ఇలాంటి మైండ్ సెట్ వాడిది కాదని ఎలక్షన్లో నేను గెలిచానని ఇలా చేస్తున్నాడని అనుమానంగా ఉందని అందుకే ఎంక్వైరీ చేస్తున్నానని  చెప్తాడు. ఇక రాజు కూడా ఈ విషయం చూసుకుంటాడని సూర్యప్రతాప్‌ చెప్తాడు. 


సూర్యప్రతాప్‌: ఏ చిన్న ఆధారం దొరికినా వాడి అంతు చూస్తా చంద్ర మీరు పింకీని దగ్గరకు తీసుకోండి. మీరు దూరం పెడితే పింకీ తట్టుకోలేదు. పింకీ తప్పు చేయడం లేదు అని నమ్ముతున్నప్పుడు తనని దూరం పెట్టడంలో అర్థం లేదు. కనీసం అలా అయినా పింకీ నిజం చెప్తుందేమో చూద్దాం. 
సుమ: సరే బావగారు.
విజయాంబిక: జీవన్ ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అందరికీ మనస్శాంతి లేకుండా చేసేశాడు దీపక్ కాస్తో కూస్తో మనస్శాంతిగా ఉంది మనమే దీపక్. 
దీపక్: అవును మమ్మీ. 


ఇంతలో దీపక్ కోసం బిడ్డను తీసుకొని హారతి ఇంటికి వస్తుంది. అది దీపక్, విజయాంబిక చూస్తారు. మన కొంప ముంచేలా ఉందని దీపక్ అంటే హారతిని ఇంట్లోకి రానివ్వకుండా ఆపు అని విజయాంబిక  అంటే దీపక్ పరుగులు తీస్తాడు. ఇంతలో హారతి ఇంట్లోకి వచ్చేస్తుంది. సార్ సార్ సూర్యప్రతాప్‌ గారు అని పిలుస్తుంది. విజయాంబిక, దీపక్ ఎంత ఆపినా హారతి ఆగదు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు.


సూర్యప్రతాప్‌: అరే దీపక్ ఈ అమ్మాయిని ప్రేమించిన వాడు నీ ఫ్రెండ్ అన్నావు కదా వాడితో మాట్లాడి ప్రాబ్లమ్ క్లియర్ చేస్తా అన్నావు కదా. నువ్వు ఆ మాట చెప్పకుండా ఉంటే నేను పరిష్కరించే వాడిని కదా. అప్పుడే ఈ అమ్మాయి సమస్య పరిష్కరించేవాడిని మళ్లీ అమ్మాయి వచ్చింది కాబట్టి ఇదంతా నీ తప్పే. వాడు ఎవడో గంటలో నా ముందు ఉండాలి. 
హారతి: సార్ ఆ రోజు దీపక్ మీకు అబద్ధం చెప్పాడు. నన్ను ప్రేమించినట్లు నటించి అమ్మని చేసింది ఎవరో కాదు సార్. ఈ బిడ్డకు తండ్రి అని చెప్పుకోవడానికి నన్ను భార్యగా అంగీకరించడానికి అయిష్టం చూపిస్తుంది ఈ దీపక్‌నే సార్. 
మందారం: ఏం మాట్లాడుతున్నావ్ హారతి దీపక్ బాబు నా భర్త. 
హారతి: ఏంటి ఏంటి దీపక్ నీకు ఆల్రెడీ పెళ్లి అయిందా. 
మందారం: పెళ్లి అవ్వడమే కాదు హారతి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. 
హారతి: ఇవన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదు దీపక్ ఇంత మంచి మందారంగారిని ఎందుకు మోసం చేశావ్.
సూర్యప్రతాప్‌: అడుగుతుంది కదరా సమాధానం చెప్పు.
మందారం: చెప్పండి దీపక్ బాబు హారతి కావాలి అనుకున్నప్పుడు నేను గుర్తుకురాలేదా మన మణిదీప్‌ గుర్తుకురాలేదా. 
హారతి: బంగారం లాంటి భార్యని పెట్టుకొని నాలుగేళ్ల కొడుకుని పెట్టుకొని ఎలా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావ్ దీపక్ ఇప్పుడు నీ వల్ల నలుగురి జీవితాలు అన్యాయం అయిపోయాయి.
జీవన్: సీఎం మేనల్లుడి అయిండి అందరికీ న్యాయం  చేయాల్సిన మీరు ఇలా చేయడం బాలేదు.
సూర్యప్రతాప్‌: అక్క అప్పుడు మందారం విషయంలో ఇలా చేస్తే పెళ్లి చేసి న్యాయం చేశా ఇప్పుడేం చేయాలి. ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే మందారం అన్యాయం అయిపోతుంది. మందారానికి న్యాయం చేస్తే ఈ అమ్మాయి అన్యాయం నాశనం అయిపోతుంది. 
దీపక్: నేను హారతితో చనువుగా ఉన్న మాట వాస్తవమే కానీ ఈ బిడ్డకు తండ్రిని మాత్రం నేను కాదు. 


విజయాంబిక హారతి డబ్బు కోసం ఇలా చేస్తుందని సూర్యప్రతాప్‌తో చెప్తుంది. నిన్ను నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావ్ అని హారతి అని మీ ఇంటి ఆడపిల్ల ఈ స్థానంలో ఉంటే ఏం న్యాయం చేస్తారో అదే చేయండి అని న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదలను అని నట్టింట్లో కూర్చొంటుంది. దీపక్‌ని బాగా ఇరికించేసిందని విజయాంబిక అంటుంది. నేనేం తప్పు చేయలేదు అని దీపక్ అంటే విజయాంబిక చెంప మీద కొట్టి చంపేస్తా అంటుంది. ఇక సూర్యప్రతాప్‌ నీకు ఎలా న్యాయం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. నీకు న్యాయం చేయాలి అంటే మందారానికి అన్యాయం చేయాలి అంటాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని హారతి ఏడుస్తుంది.


మందారంలాగే నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వండని హారతి అంటుంది. పెద్దయ్య గారికి కొంచెం టైం ఇవ్వు అంత వరకు నీ బాగోగులు మేం చూసుకుంటాం అని రాజు అంటాడు.ఇక మందారం డీఎన్‌ఏ టెస్ట్ చేయిద్దామని అంటుంది. ఏ టెస్ట్‌కి అయినా నేను రెడీ అని హారతి అంటుంది. సూర్యప్రతాప్‌ దీపక్‌కి అడిగితే దీపక్ కూడా సరే అంటాడు. దీపక్‌ తండ్రి అని తేలితే దీపక్ని చంపేస్తా అని సూర్యప్రతాప్‌ అంటాడు. డీఎన్‌ఏ  టెస్ట్ జరిగే వరకు ఈ ఇంట్లోనే ఉంటానని హారతి అంటుంది. అందరూ న్యాయం చేస్తాం ఇంటికి వెళ్లు అంటే హారతి ఒప్పుకోదు. ఇక హారతి మీరు న్యాయం చేస్తారనే నమ్మకంతో వెళ్లున్నా అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: బెడిసికొట్టిన అంబిక ప్లాన్.. విహారిని కాపాడిన లక్ష్మీ.. చీర కొంగు చింపి మరీ..!