Ammayi garu Serial Today Episode  దీపక్ విజయాంబిక దగ్గరకు పరుగున వెళ్లి రాఘవని కోమా నుంచి మేలుకొలిపే స్పెషల్ ఇంజక్షన్‌ తీసుకొస్తున్నారని.. రాఘవ లేచేస్తాడని ఎలా అయినా రాఘవకి ఆ ఇంజక్షన్ వేయకుండా ఆపాలని అంటాడు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని కోమలి తన ప్లాన్ చెప్తుంది. 

Continues below advertisement

విజయాంబిక వాళ్లు ఇలాగే చేద్దాం అని అనుకుంటారు. బంటీని తీసుకొని రూప, రాజులు బయటకు వెళ్తారు. బంటి చాలా చాలా హ్యాపీగా ఉంటాడు. సాయంత్రం వరకు ఏం చేస్తాం ఎక్కడికి వెళ్దాం అని మాట్లాడుకుంటారు. బంటీ ఐస్‌ క్రీం తిందామని అంటాడు. సరే అని ముగ్గురు ఓ బండి దగ్గరకు వెళ్లి ఐస్‌క్రీమ్ తింటారు. ఇక ముగ్గురూ వెళ్తుంటే బంటీ కనిపించకుండా పోతాడు. రూప, రాజు చాలా టెన్షన్ పడతారు. బంటీ దాగుడు మూతలు ఆడుతున్నారని అనుకుంటారు. మొత్తం వెతుకుతారు. బంటీ కోసం మొత్తం వెతుకుతారు. కొందరు రౌడీలు బంటీని కిడ్నాప్ చేస్తారు.

Continues below advertisement

 బంటీ దూరం నుంచి రూప, రాజుల్ని చూస్తాడు. పిలవాలి అని ప్రయత్నిస్తాడు. కానీ రూప వాళ్లు చూడరు. బంటీని రౌడీలు తీసుకెళ్లిపోతారు. రాజు, రూప మొత్తం వెతుకుతారు. రౌడీలు దీపక్‌కి కాల్ చేసి బంటీని కిడ్నాప్ చేశామని అంటాడు. దీపక్ ఆ విషయం విజయాంబిక, కోమలిలకు చెప్తాడు. విజయాంబిక బంటీని బంధించి కొత్త నెంబరు నుంచి రాజుకి కాల్ చేసి ఇంజక్షన్ ఇస్తే బంటీని ఇస్తామని చెప్పమని అంటుంది. బంటీ వెళ్లిపోతాను అని గోల చేస్తే రౌడీలు బంటీకి చాకుతో బెదిరిస్తారు. 

బంటీ కనిపించకపోయే సరికి రూప చాలా ఏడుస్తుంది. విరూపాక్షి విషయం తెలిసి రూప దగ్గరకు వస్తుంది. విరూపాక్షి కూడా ఏడుస్తూ అలా ఎలా వదిలేశారు జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటుంది. ఎవరో మిమల్ని ఫాలో అయి ఇదంతా చేశారని విరూపాక్షి అంటుంది. దీపక్ రాజుకి కాల్ చేసి బంటీని కిడ్నాప్ చేశామని అంటాడు. విరూపాక్షి, రూప అందరూ బంటీని వదిలేయమని బతిమాలుతారు. దీపక్ రాజుతో మాట్లాడి మీరు కోమాలో ఉన్న పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేయడానికి బయట దేశం నుంచి ఇంజక్షన్ తీసుకొస్తున్నారు కదా ఆ ఇంజక్షన్ మాకు ఇస్తే మీ కొడుకుని మీకు అప్పగిస్తామని అంటారు. రాజు, రూప, విరూపాక్షి షాక్ అయిపోతారు. ఆ ఇంజక్షన్ కావాలి అంటే మరో ఇంజక్షన్ తెప్పిస్తా అని రాజు అంటే మీకు మీ బాబు కావాలి అంటే అదే ఇంజక్షన్ మాకు ఇచ్చి మీ బాబుని తీసుకెళ్లండి.. మీకు ఇంజక్షన్ ముఖ్యం అనుకుంటే మీ బాబు మీకు దక్కడు అని దీపక్ చెప్తాడు. గంటలో ఇంజక్షన్ ఇవ్వకపోతే మీ కొడుకుని చంపేస్తామని బెదిరిస్తాడు. 

విరూపాక్షి ఏడుస్తూ ఆ ఇంజక్షన్ మీకు ఇచ్చేస్తాం అని అంటుంది. దీపక్ అడ్రస్ చెప్తాడు. కోమలి విజయాంబికతో రాజు ఒప్పుకోడు అని అనిపిస్తుందని అంటే రూప ఒప్పిస్తుందని విజయాంబిక అంటుంది. ఇంతలో దీపక్ విజయాంబికకు కాల్ చేసి రాజు ఇంజక్షన్‌ ఇవ్వడానికి ఒప్పుకున్నాడని అంటాడు. రాజు చెప్పాడు అంటే నమ్మాలి అని లేదురా కాస్త జాగ్రత్త అని అంటుంది. విరూపాక్షి ఇంజక్షన్ ఇవ్వమని అంటే వాళ్లకి కావాల్సింది ఇంజక్షన్ బంటీ ప్రాణం కాదు.. మీరు ఇంజక్షన్‌ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లండి నేను బంటీని కాపాడుకుంటా అని రాజు అంటాడు. రిస్క్ వద్దు బంటీ మనకు ముఖ్యం అని విరూపాక్షి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.