Ammayi garu Serial Today Episode రూప తన ఆస్తి మొత్తం తన తదనాంతరం గుడి ట్రస్ట్‌కి ఇచ్చేస్తానని తండ్రితో చెప్తుంది. విజయాంబిక, దీపక్ అడ్డుకోవాలని ప్రయత్నిస్తారు. గుడి ట్రస్ట్‌కి ఇవ్వడం కంటే అనాథలకు ఇవ్వమని అంటుంది. దీపక్‌కి చెవిలో గుడి ట్రస్ట్‌కి ఇస్తే వాటిని దక్కించుకోలేమని అనాథలకు ఇస్తే ఏదో ఒకలా తీసుకోవచ్చని అంటుంది. పేదవాళ్లను నేను తీసుకొస్తా వాళ్లకి నువ్వు సాయం చేయమని అంటారు.
రూప తండ్రితో ట్రస్ట్‌కి రాసివ్వడంతో ఎలాంటి దుర్వినయోగం అవ్వదు అని అంటుంది. మనం వాళ్లకి ఇస్తే ట్రస్ట్ ద్వారా చాలా మందిని లాభాలు ఉంటాయని ఎంతో మంది బాగు పడతారు అంటారు. దానికి సూర్యప్రతాప్ రేపు మీకు ఓ బాబో పాపో పుడితే ఎలా అని అడుగుతారు. రూప, రాజులు బంటీని గుర్తు చేసుంటారు. తన కొడుకు బతికే ఉన్నాడని మీకు త్వరలోనే చెప్తామని అంటారు. ఇక సూర్యప్రతాప్ మీ ఇష్టం అని చెప్తాడు. దాంతో విజయాంబిక మీకు అవసరం లేకపోతే మనలో ఎవరికో ఇచ్చేయండి అంటుంది. రూప ఆస్తి రూప ఇష్టం అని అంటారు సూర్యప్రతాప్.
సూర్యప్రతాప్ రూపతో నా ఆస్తి కూడా నీకే కదమ్మా నువ్వు వద్దు అంటే నా ఆస్తి కూడా నా తదనాంతరం ట్రస్ట్‌కి ఇచ్చేస్తా అంటారు. చంద్ర కూడా అన్నయ్య బాటే అంటారు. విజయాంబిక కనీసం చంద్రని అయినా ఆపాలి అనుకుంటారు. మీ కూతురి గురించి ఆలోచించండి అని చెప్తుంది. దాంతో మా కూతురికి ఏం అవసరం లేదని అంటారు. మందారం పేరు మీద కాస్త ఆస్తి రాసిద్దామని సూర్యప్రతాప్ అంటే మందారం కూడా వద్దని అంటుంది. మందారం కూడా ఆస్తి ఇస్తాను అన్నారు మనకు మాత్రం ఇవ్వడం లేదని విజయాంబిక అనుకుంటుంది. రూప చండీయాగం తర్వాత ఆస్తి రాసిచ్చేద్దామని అంటుంది.
ఆస్తి మొత్తం చేజారిపోతుందని విజయాంబిక, దీపక్ వాళ్లు అనుకుంటారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనుకుంటారు. ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. ఇంతలో రూప వాళ్లు వచ్చి మీరు మమల్ని చంపేస్తే మీకు నిలువ నీడ ఉండదు. ఆస్తి మొత్తం ట్రస్ట్‌కి వెళ్లిపోతుంది. ఇప్పుడు మీకు సాయం చేయడానికి ఎవరూ రారు మీకు ఉన్న దిక్కు మా నాన్న మాత్రమే. ఇప్పుడు మీకు మా నాన్న ప్రాణాలతో ఉండటమే ముఖ్యం అని రూప, రాజులు అంటారు. మీరే మా నాన్నని కాపాడుకోవాలని ఈగ కూడా వాలకుండా చూసుకోమని రూప చెప్తుంది. ఎలా ఉంది మేం ఆడిన చదరంగం అని అంటారు. రేపే మీ ఆశలు అడియాశలు అవుతాయని అంటారు.
విజయాంబిక, దీపక్‌లను ఆట పట్టించునందుకు హ్యాపీగా ఉందని అనుకుంటారు. ఇక బంటీని కూడా రేపే తండ్రికి పరిచయం చేస్తానని అనుకుంటారు. ఆ విషయం దీపక్, విజయాంబికలు వినేస్తారు. బంటీ గురించి చెప్పడానికి రాజు భయపడతాడు. వద్దని రాజు అంటే రూప చెప్పేద్దాం అని అంటుంది. బంటీని మామయ్యకి పరిచయం చేస్తే ప్రాబ్లమ్ అని అనుకుంటారు. చండీయాగం తర్వాత ఆస్తి ట్రస్ట్‌కి రాస్తారు. ఈ లోపు బంటీని, రూపని వేసేయాలి అని అనుకుంటారు. ఉదయం రూప, సూర్యప్రతాప్‌తో పాటు అందరూ గుడికి వెళ్తారు. అందరూ దేవుడిని దండం పెట్టుకుంటారు. తన తల్లీదండ్రుల్ని కలపాలి అని రూప కోరుకుంటుంది. విరూపాక్షి బంటీని తీసుకొని వస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!