Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ బయటకు వెళ్తా అంటే మిథున ఆపి బెడ్ మీద పిల్లోస్ అడ్డు పెట్టి పడుకుందామని అంటుంది. రామ్ వద్దని  వెళ్లిపోతాడు. సీత ఇలా అయితే ఎలా మామ నువ్వు ఇంత మంచోడివి అయితే ఎలా నేను ఈ రోజు రాత్రి మిథునలా నీతో కలవాలి నీ భార్య మిథునలా మారాలి అని సీత అనుకుంటుంది. 

రామ్ మీద అటాక్...

రామ్ బయటకు వెళ్లి వర్క్ చేసుకుంటుంటే గౌతమ్, రేఖలు ఎలా అయినా రామ్‌ని చంపేయాలి అనుకుంటారు. రేఖ హాల్‌లో లైట్స్ ఆఫ్ చేస్తుంది. గౌతమ్ వెనక నుంచి వెళ్లి తాడుతో రామ్ గొంతు బిగించేస్తాడు. రామ్ సీత సీత అని అరుస్తాడు. మిథున బయటకు వస్తుంది. ఇద్దరినీ విడిపించాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో మ్యానేజర్ వస్తారు. పోలీసులకు కాల్ చేస్తారు. రేఖ, గౌతమ్ పారిపోతుంటే పోలీస్ త్రిలోక్ తన గ్యాంగ్‌తో వచ్చి పట్టుకుంటారు. రామ్, మిథునలు కూడా బయటకు వస్తారు. మేనేజర్ వాళ్ల మీద కంప్లైంట్ ఇస్తారు. గౌతమ్, రేఖల్ని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్తారు.

రామ్ నన్ను దగ్గరకు రానివ్వడం లేదు..

మేనేజర్ మీద మిథున ఫుల్ సీరియస్ అవుతుంది. రామ్ వెళ్లి హాల్లో కూర్చొని మిథునకు థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు సీత అని పిలిచావ్ నీకు ఏమైందా అని నేను వచ్చానని మిథున అంటుంది. గదిలోకి వచ్చి పడుకోమని అంటుంది. రామ్ రానని చెప్పడంతో మిథున వెళ్లిపోతుంది. ఇక మహాలక్ష్మీ మిథున తన ప్లాన్ అమలు చేస్తుందా లేదా అని మహాలక్ష్మీ మిథునకి కాల్ చేస్తుంది. తాటికళ్లు తాగి మత్తులో ఏదేదో అనేశాను అని మిథున సారీ చెప్తుంది. రామ్ గురించి ఎంత వరకు వచ్చింది అని మహాలక్ష్మీ అంటే రామ్ నిజంగా సీతారామచంద్రడు అస్సలు నా గదిలో ఉండటానికి కూడా ఒప్పుకోవడం లేదని చెప్తుంది. రామ్ బయట హాల్లో ఉంటున్నాడని కనీసం దగ్గరకు కూడా రానివ్వడం లేదని అంటుంది. 

పాలలో మత్తు మందు ఇచ్చేయ్..

మిథున ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని  చెప్తుంది. మహాలక్ష్మీ మిథునతో ముందు చెప్పినట్లు పాలతో రామ్‌కి మత్తు మందు ఇవ్వు నువ్వు రామ్‌కి దగ్గర అవు మేం ఇక్కడ చేయాల్సింది చేస్తా అని అంటుంది. మిథున సరే అని చెప్పి ఫోన్ పెట్టి అత్తా నువ్వు సూపర్ ఒకప్పుడు నాకు రామ్ మామ గదిలోకి వెళ్లనిచ్చే దానివి కాదు కానీ ఇప్పుడు నువ్వే నన్ను గదిలోకి వెళ్లి అని చెప్తున్నావ్ అనుకుంటుంది. 

గౌతమ్, రేఖల్ని చితక్కొట్టిన పోలీసులు..

త్రిలోక్ గౌతమ్, రేఖల్ని ప్రశ్నిస్తాడు. వాళ్ల గెటప్‌లను చూసి మీరు ఎవరు మీ భాష ఏంటి? ఎన్ని హత్యలు చేశారు అని ప్రశ్నిస్తాడు. ఆడుకుంటూ ఉంటే అతను అడ్డు వచ్చాడు. ఆయన అడ్డు వచ్చాడని చెప్తారు. త్రిలోక్ హీరోలా ఉన్నాడని మా బాలీవుడ్‌కి వచ్చి ప్రయత్నించండి అని చెప్తారు. త్రిలోక్‌కి బిస్కెట్ వేసి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తారు. కానీ  త్రిలోక్ ఒప్పుకోడు. రామ్ మీద అటాక్ చేయమని మీకు ఎవరు చెప్పారు అని ప్రశ్నిస్తాడు. ఇద్దరికీ కోటింగ్ ఇవ్వమని త్రిలోక్ చెప్తాడు. ఇద్దరినీ సెల్లో వేసి చితక్కొడతారు. 

మత్తు మందు కలిపేసిన..

మిథునలా సీత రామ్ జీవితంలోకి వెళ్లాలి అని పాలలో మత్తు మందు కలిపేస్తుంది. వాటిని పట్టుకొని క్షమించు మామ మిథునలా నీ జీవితంలోకి ఆ ఇంటికి రావడానికి నాకు ఇదెక్కటే దారి అనుకొని పాలు తీసుకొని రామ్ దగ్గరకు వెళ్తుంది. నేను నైట్ పాలు తాగుతా అని నీకు ఎలా తెలుసు అని రామ్ అంటాడు. తెలుసుకున్నా అని మిథున చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!